Houston (USA)
-
అంతరిక్షంలో చెత్తకు కొత్త విరుగుడు.. అక్కడే మండించేందుకు పరికరం
హూస్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో తయారయ్యే వ్యర్థాలను భూమిపైకి తేకుండా అంతరిక్షంలోనే మండించే కొత్త పరికరాన్ని హూస్టన్‌కు చెందిన నానో ర్యాక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ తయారు చేసింది. బిషప్స్ ఎయిర్‌లాక్ అనే ఈ పరికరంలో ఒకేసారి 600 పౌండ్లు, సుమారు 272 కిలోల చెత్తను ఉంచి కాల్చవచ్చు. ఐఎస్ఎస్లో ఆస్ట్రోనాట్ల వల్ల ఏడాదికి 2,500 కిలోల వ్యర్థాలు తయారవుతున్నాయి. ఈ వ్యర్థాలను ఐఎస్ఎస్కు అవసరమైన సామగ్రి రవాణాకు ఉపయోగించే సిగ్నస్ కార్గో వెహికల్ ద్వారా భూమిపైకి పంపిస్తున్నారు. ఇందుకు సమయం పడుతోంది. కానీ, బిషప్స్ ఎయిర్ లాక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వెలుపలి అంతరిక్షంలోనే మండించి, తిరిగి ఐఎస్ఎస్కు చేరుకుంటుంది. దీనిని విజయవంతంగా పరీక్షించినట్లు నానోర్యాక్స్ తెలిపింది. -
హ్యూస్టన్‌లో శ్రీరామ నవమి వేడుకలు
-
హ్యూస్టన్‌లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
హ్యుస్టన్ టెక్సాస్ లో ని స్థానిక శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అష్టలక్ష్మి దేవాలయం, కేటీ హిందూ కమ్యూనిటీ సంయుక్తంగా జరిపిన జరిపిన సీతారాముల కళ్యాణ వేడుకల్లో సుమారు 800 మంది పాల్గొన్నారు. వేదపండితులు సీత రాములకు కళ్యాణంతో పాటు ,పట్టాభిషేకం, మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. కల్యాణం అనంతరం అర్చన, మంగళ శాశనం కార్యక్రమాలని ఎంతో భక్తిశ్రద్ధలతో జరిపిరాఉ. జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలు, వలంటీర్లకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తులకి తీర్థప్రసాదాలు అందజేశారు. -
టెక్సాస్ హ్యూస్టన్ పిక్నిక్ సంబరాలు
-
టెక్సాస్ హ్యూస్టన్ పిక్నిక్ సంబరాలు
టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో తెలుగు వాళ్లంతా కలిసి పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నారు. సుమారుగా 200 ఫ్యామిలీస్ దీనిలో పాల్గొని ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బిర్యానీపాట్ రెస్టారెంట్లో భోజన సదుపాయాలు కల్పించారు. ఈ పిక్నిక్ విజయవంతం కావడానికి దీనికి సహకరించిన దాతలందరికి బిర్యానీపాట్ రెస్టురెంట్ ఓనర్ శ్రీధర్ కంచనకుంట్ల ధన్యవాదాలు తెలిపారు. -
30 ఏళ్లుగా పెంచుకున్న గోళ్లను ఆ కారణంగా కట్ చేయించుకుంది..
వాషింగ్టన్: అమెరికాలోని హ్యూస్టన్ నగరానికి చెందిన అయన్నా విలియమ్స్ అనే మహిళ.. తన చేతి వేళ్ల గోళ్లను 30 సంవత్సరాలుగా పెంచుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె 2017లో అత్యంత పొడవైన చేతి వేళ్ల గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది. అయితే గత కొంతకాలంగా తన పొడవాటి గోళ్లతో ఇబ్బందులు పడుతున్న ఆమె.. వాటిని కత్తరించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు ఆమె వైద్యుల సమక్షంలో గోళ్లను తొలిగించుకుంది. ఆమె గోళ్లను చివరి సారిగా కొలిచినప్పుడు వాటి పొడవు 733.55 సెంటీమీటర్లుగా నమోదైంది. ఆమె తన రెండు చేతుల గోళ్లను పాలిష్ చేసుకోవడానికి రెండు సీసాల నెయిల్ పాలిష్ అవసరమయ్యేది. ఇందుకు గాను ఆమెకు దాదాపు 20 గంటల సమయం పట్టేది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) కాగా, గత కొంతకాలంగా రోజువారీ పనులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఆమె టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్ చర్మవ్యాధుల ఆసుపత్రిని సంప్రదించింది. నిపుణుల సమక్షంలో ఆమె తన గోళ్లను కత్తిరించుకుంది. తొలగించే సమయంలో గోళ్ల పొడవు 24 అడుగుల 7 అంగుళాలుగా తేలింది. అయితే గోళ్లు తొలగించిన తర్వాత ఆమె సంతోషంగా పనులు చేసుకోగలుగుతున్నానంటోంది. వంట చేయడం, పాత్రలు కడగటం, మంచంపై దుప్పట్లు పరచడం వంటి పనులను చిటికెలో చేసుకోగలుగుతున్నానంటూ తెగ సంబరపడిపోతుంది. -
భారత టీకాలతో ప్రపంచానికి రక్ష
హూస్టన్: కరోనాను అరికట్టడానికి భారత్ అభివృద్ధి చేసి, పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్లు ఈ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని రక్షిస్తాయని అమెరికాలోని హూస్టన్‌లో ఉన్న బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్(బీసీఎం)కు చెందిన ‘నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్’ డీన్, ప్రముఖ సైంటిస్టు డాక్టర్ పీటర్ హోటెజ్ చెప్పారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో భారత్ అందిస్తున్న సహకారాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అన్నారు. ఆయన తాజాగా ఒక వెబినార్‌లో మాట్లాడారు. కరోనాపై పోరాటంలో ఇండియా పోషిస్తున్న పాత్రపై ప్రశంసల వర్షం కురిపించారు. అల్పాదాయ దేశాలకు ఇండియా వ్యాక్సిన్లు ఒక వరం లాంటివని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్లు ప్రపంచానికి ఇండియా ఇచ్చిన వరం లాంటివని అభివర్ణించారు. కరోనా నియంత్రణ కోసం భారత్‌లో అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల పంపిణీ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టీకాల కోసం ఇతర దేశాలు సైతం భారత్‌ను సంప్రదిస్తున్నాయి. ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. -
అగ్ర దేశాల దౌత్య యుద్ధం
వాషింగ్టన్/బీజింగ్: అమెరికా, చైనా మధ్య విభేదాలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనర ల్ను మూసివేయాలంటూ ట్రంప్ సర్కార్ ఆదేశిం చడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో అగ్గి రాజుకుంది. హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనరల్ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో అమెరికా ప్రభుత్వం కాన్సులేట్‌ను మూసివేయాల్సిందిగా చైనాని ఆదేశించింది. అమెరికా మేధో సంపత్తిని, ప్రైవేటు సమాచారాన్ని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మోర్గా ఓర్టాగస్ మంగళవారం విలేకరులకు తెలిపారు. అయితే చైనా ఏ తరహా గూఢచర్యానికి దిగిందో ఆమె స్పష్టంగా వెల్లడించలేదు. దెబ్బకి దెబ్బ తీస్తాం: చైనా అమెరికా నిర్ణయం అత్యంత దారుణమైనదని, అన్యాయమైనదని చైనా విరుచుకుపడింది.. అమెరికా తన తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రతీకార చర్యలు తప్పవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్‌హెచ్చరించారు. కాన్సులేట్ జనరల్‌లో మంటలు అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని చైనా కాన్సులేట్ జనరల్‌లో మంటలు చెలరేగాయి. కార్యాలయం ఆవరణలో చైనా ప్రతినిధులు డాక్యుమెంట్లు తగులబెట్టడంతో మంటలు చెలరేగినట్టు పోలీసులు వెల్లడించారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో కాన్సులేట్‌ని మూసివేయాలని ఆదేశాలు జారీ అయిన కాసేపటికే కాన్సులేట్‌లో మంటలు రేగాయి. కొన్ని కంటైనర్లు, డస్ట్ బిన్స్‌లో డాక్యుమెంట్లు వేసి తగులబెట్టడంతో మంటలు చెలరేగిన వీడియోలు సోషల్‌మీడియాలో షేర్ అయ్యాయి. మంటలు ఆర్పడానికి వెళ్లే అగ్నిమాపక సిబ్బందికి కాన్సులేట్ అధికారులు అనుమతినివ్వలేదని పోలీసులు తెలిపారు. ఎందుకీ మూసివేత! అమెరికా, చైనా మధ్య కోవిడ్ వ్యాక్సిన్ అధ్యయనాల హ్యాకింగ్ చిచ్చు కాన్సులేట్ మూసివేతకు ఆదేశాల వరకు వెళ్లినట్టుగా అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన అధ్యయన వివరాలను తస్కరించారంటూ అమెరికా న్యాయశాఖ ఇద్దరు చైనా జాతీయుల్ని వేలెత్తి చూపిన రోజే హ్యూస్టన్‌లో కాన్సులేట్ మూసివేతకు ఆదేశాలు వెలువడ్డాయి. ఆ ఇద్దరు వ్యక్తులు అమెరికాలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ అధ్యయనాలను తస్కరించడానికి ప్రయత్నించారని అమెరికా ఆరోపిస్తోంది. -
‘అతడు ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు’
వాషింగ్టన్: శ్వేత జాతీ పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురయిన ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ స్వస్థలమైన హ్యూస్టన్‌లో మంగళవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. తన తల్లి సమాధి పక్కనే ఆయన మృతదేహాన్ని కూడా ఖననం చేశారు. ఆరు రోజుల సంతాప దినాల తర్వాత మూడు నగరాల్లో ఫ్లాయిడ్ మృతదేహాన్ని ప్రదర్శించారు. ఫ్లాయిడ్ పుట్టిన నార్త్ కరోలినాలోని రేఫోర్డ్, అతను పెరిగిన హ్యూస్టన్, అతడు మరణించిన మిన్నియాపాలిస్ నగరాల్లో ప్రదర్శించారు. వేలాది మంది ఫ్లాయిడ్ మృతదేహానికి నివాళులర్పించేందుకు తరలి వచ్చారు. వీరిలో నటులు జామీ ఫాక్స్, చాన్నింగ్ టాటమ్, రాపర్ ట్రే థా ట్రూత్, రిపబ్లిక్ షీలా జాక్సన్ లీ, హూస్టన్ పోలీస్ చీఫ్ ఆర్ట్ అసేవెడో, హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్, గ్రామీ విజేత నే-యో కూడా ఉన్నారు. మాజీ వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్, ఫ్లాయిడ్ ఆరేళ్ల కుమార్తెను ఉద్దేశిస్తూ.. ‘ఏ పిల్లలు అడగలేని చాలా ప్రశ్నలు నీ మదిలో తలెత్తుతున్నాయని నాకు తెలుసు. తరాలుగా నల్ల జాతి పిల్లలంతా ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. జాత్యాంహకారాన్ని రూపమాపడానికి.. సమ న్యాయం చేయడానికి. భవిష్యత్తులో మన పిల్లలు ఎందుకు ఇలా జరిగింది అంటే మనం సమాధానం చెప్పగలగాలి’ అన్నారు. అయితే ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఎలాంటి విమర్శలు చేయలేదు. మరి కొందరు మాత్రం ట్రంప్‌పై విమర్శల వర్షం కురిపించారు. ‘అధ్యక్షుడు మిలిటరీని తీసుకురావడం గురించి మాట్లాడుతుంటాడు. కాని 8 నిమిషాల 46 సెకన్ల పాటు జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య గురించి అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు’ అని పౌర హక్కుల కార్యకర్త రెవ. అల్ షార్ప్టన్ అన్నారు. ట్రంప్ మానవ హక్కుల గురించి చైనాను సవాలు చేస్తాడు. కానీ జార్జ్ ఫ్లాయిడ్ మానవ హక్కు గురించి మాట్లడడు అన్నారు. (బంకర్ బాయ్) -
ఆస్ట్రియా యువరాణి ఆకస్మిక మృతి
టెక్సాస్ : భారత సంతతికి చెందిన చెఫ్‌ను పెళ్లి చేసుకున్న ఆస్ట్రియా యువరాణి మరియా గాలిట్జీన్ (31) మృతి చెందారు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో హ్యూస్టన్‌లో కన్నుమూశారు. అయితే మరియా మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 4న మరియా మృతి చెందగా స్థానిక మీడియాలో వచ్చిన సంతాప వార్త ఆధారంగా ప్రపంచానికి ఆమె మరణ వార్త తెలిసింది. 2017లో హ్యూస్టన్‌లో నగరంలో చెఫ్ రిషి రూప్ సింగ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు మాక్సిమ్ ఉన్నాడు. రిషి రూప్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా పనిచేస్తున్న హ్యూస్టన్లోనే మరియా ఇంటిరీయర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. (ఇప్పట్లో స్కూళ్లు లేనట్లే! కాలేజీలకు మాత్రం.. ) మరియా.. ప్రిన్సెస్ మరియా- అన్నా,ప్రిన్స్ పియోటర్ గాలిట్జీన్ కుమార్తె. 1988లో లగ్జంబర్గ్‌లో జన్మించారు. మరియాకు ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నాడు. ఆమెకు అయిదు సంవత్సరాల వయస్సులోనే రష్యాకు మకాం మార్చారు. అక్కడే గ్యాడ్యూయేషన్ పూర్తిచేసుకున్న మరియా ఆర్ట్ ఆండ్ డిజైన్ కాలేజీలో చేరేందుకు బెల్జియంకు వెళ్లారు. బ్రస్సెల్స్తోపాటు చికాగో, ఇల్లినాయిస్, హ్యూస్టన్ వంటి నగరాలలో ఆమె పనిచేశారు. చిన్న వయస్సులోనే మరియా మరణించడంతో రాజ కుటంబీకులంతా సంతాపం ప్రకటించారు. (ప్రముఖ హస్యనటుడి మృతి ) -
నిద్రలోనే తనువు చాలించాడు
భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన భూర్ల అరుణ్‌కుమార్ (41) అమెరికాలో గురువారం రాత్రి మృతి చెం దాడు. జ్వరం, లోబీపీతో నిద్రలోనే తనువు చా లించాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అమెరికాలోని హోస్టన్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్.. రెండు రోజులుగా జ్వరం, లోబీపీ సమస్యతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అమెరికా నుంచి కామారెడ్డిలోని తల్లితో భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటలకు మాట్లాడారు. ‘అమ్మా నాకు దమ్ము వస్తోంది.. మాట్లాడుతుంటే ఇబ్బంది అవుతోంది, రేపు మళ్లీ మా ట్లాడుతా’అని చెప్పాడు. అరుణ్ మందులు వేసుకుని నిద్రకు ఉపక్రమించిన తర్వాత అతని భార్య రజనీ ఉద్యోగానికి వెళ్లింది. గంట తర్వాత ఫోన్ చేయగా..ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వచ్చింది. ఎంత పిలిచినా అరుణ్ పలుకక పోవ డంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు..అప్పటికే అరుణ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. గురువారం రాత్రి పది గంటల సమయంలో అరుణ్ మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు స్పృహ కోల్పోయారు. అమెరికా ప్రభుత్వం సమ్మతిస్తే అరుణ్ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు హోస్టన్‌లోని ఆర్యవైశ్య సంఘాలు, వాసవీ సంస్థలు సమాయత్తమయ్యాయి. మృతదేహం ఇండియాకు తేవడం సాధ్యం కాదు పలు దేశాల్లో కరోనా వ్యాధి విజృంభించడం వల్ల అమెరికా నుంచి ఇండియాకు అరుణ్ మృతదేహాన్ని పంపించేందుకు అక్కడి ప్రభుత్వం అను మతివ్వకపోవచ్చని తెలుస్తోంది. అరుణ్ అంత్యక్రియలను అక్కడే నిర్వహిస్తారని చెబుతున్నారు. అరుణ్, రజనీ తల్లిదండ్రులు గురువా రం వేకువ జామున 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరారు. -
హ్యూస్టన్‌లో ఘనంగా ‘హౌడీ మోదీ’ కార్యక్రమం
-
‘టెక్సాస్’ ఫైనల్లో దీపిక
హౌస్టన్ (అమెరికా): భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ దీపిక 11-7, 11-13, 13-11, 10-12, 11-4 తేడాతో 8వ ర్యాంకర్ మెడలిన్ పెర్రీ (ఐర్లాండ్)పై సంచలన విజయం సాధించింది. దీంతో 22 ఏళ్ల దీపిక తన కెరీర్లోనే అతిపెద్ద టోర్నీ (రూ.30 లక్షల ప్రైజ్‌మనీ)లో టైటిల్ పోరుకు చేరుకుంది. అంతేగాక పెర్రీతో ముఖాముఖి రికార్డునూ 2-2తో సమం చేసింది. ఇక ఫైనల్లో నయా సంచలనం నౌర్ ఎల్ షెర్బిని (ఈజిప్టు)తో దీపిక తలపడనుంది. క్వాలిఫయర్‌గా టోర్నీ బరిలోకి దిగి సంచలన విజయాలు సాధించిన షెర్బిని సెమీప్లో ప్రపంచ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)కు షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది.