డాక్టర్ పీటర్ హోటెజ్
హూస్టన్: కరోనాను అరికట్టడానికి భారత్ అభివృద్ధి చేసి, పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్లు ఈ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని రక్షిస్తాయని అమెరికాలోని హూస్టన్‌లో ఉన్న బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్(బీసీఎం)కు చెందిన ‘నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్’ డీన్, ప్రముఖ సైంటిస్టు డాక్టర్ పీటర్ హోటెజ్ చెప్పారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో భారత్ అందిస్తున్న సహకారాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అన్నారు. ఆయన తాజాగా ఒక వెబినార్‌లో మాట్లాడారు.
కరోనాపై పోరాటంలో ఇండియా పోషిస్తున్న పాత్రపై ప్రశంసల వర్షం కురిపించారు. అల్పాదాయ దేశాలకు ఇండియా వ్యాక్సిన్లు ఒక వరం లాంటివని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్లు ప్రపంచానికి ఇండియా ఇచ్చిన వరం లాంటివని అభివర్ణించారు. కరోనా నియంత్రణ కోసం భారత్‌లో అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల పంపిణీ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టీకాల కోసం ఇతర దేశాలు సైతం భారత్‌ను సంప్రదిస్తున్నాయి. ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment