
హ్యుస్టన్ టెక్సాస్ లో ని స్థానిక శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అష్టలక్ష్మి దేవాలయం, కేటీ హిందూ కమ్యూనిటీ సంయుక్తంగా జరిపిన జరిపిన సీతారాముల కళ్యాణ వేడుకల్లో సుమారు 800 మంది పాల్గొన్నారు. వేదపండితులు సీత రాములకు కళ్యాణంతో పాటు ,పట్టాభిషేకం, మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు.
కల్యాణం అనంతరం అర్చన, మంగళ శాశనం కార్యక్రమాలని ఎంతో భక్తిశ్రద్ధలతో జరిపిరాఉ. జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలు, వలంటీర్లకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తులకి తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment