గుంటూరు: తెనాలి మండల కేంద్రంలో హనుమాన్ చాలీసా మహా యజ్ఞం శనివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరగనుంది. బుర్రుపాలెం రోడ్డులోని 50ఎకరాల స్థలంలో ఈ యజ్ఞం జరుగుతోంది. దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో 1లక్షా 11వేల మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని నమోదు చేసుకునేందుకు గిన్నిస్ బుక్ రికార్డు ప్రతినిధులు ఇప్పటికే తెనాలి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులు ఒక్కొక్కరితో 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయిస్తారు. యజ ్ఞప్రాంగణంలో 50 అడుగుల ఎతైన ధ్యాన మారుతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ యజ్ఞంలో పాల్గొనేందుకు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గవర్నర్లు నర్సింహన్, కె. రోశయ్యలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు.
(తెనాలి)