వడపావ్ అమ్ముతున్న యువతిని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను పోలీసులు ఖండించారు. వడాపావ్ గర్ల్‌గా ఫేమస్ అయిన చంద్రిక దీక్షిత్‌ను అరెస్టు చేయలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేగాక ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు.
చంద్రిక దీక్షిత్ అనే యువతి కొంతకాలంగా ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో వడపామ్ ఫుడ్ స్టాల్ నడిపిస్తోంది. రాను రాను ఆమె ‘వడపామ్ గర్ల్’గా పేరొందింది. ఆమెకు ఇన్‌స్టాలో 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఈ యువతి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. స్టాల్ దగ్గర యువతి విందు ఏర్పాటు చేయగా.. స్థానికులతో వివాదం జరిగినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. స్టాల్‌ను తొలగించాలని ఆదేశించిన మున్సిపల్ అధికారులతో ఆమె గొడవకు దిగింది. ఆ వీడియో వైరల్ అయ్యింది.
అయితే, చంద్రిక ఫుడ్ స్టాల్‌ను స్థానిక మున్సిపాలిటీ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం వల్ల ఆమె స్టాల్ వద్దకు జనాలు భారీగా వస్తున్నారని. దీని వల్ల స్థానికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న చుట్టుపక్కల వారు తమకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
దీంతో పోలీస్ సిబ్బంది వెళ్లి ప్రశ్నించగా ఆమె దురుసుగా ప్రవర్తించిందని, ఈ నేపథ్యంలో ఆ ఫుడ్ స్టాల్ ను సీజ్ చేసి, ఆమెను పోలీస్ స్టేషన్ తరలించినట్లు పేర్కొన్నారు. అయితే, ఆమెను అరెస్ట్ చేయలేదని, తనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment