వడ పావ్.. ఈ మాట వినిగానే ఠక్కున గుర్తొచ్చేది ముంబై నగరం. వడ పావ్‌లకు ముంబై పెట్టింది పేరు. అక్కడి ప్రజలకు ఈ స్ట్రీట్‌ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయితే వడ పావ్ పేరుతో దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. దుబాయ్‌లోని కరమాలో ఉన్న భారతీయులకు సేవలు అందించడంలో ప్రసిద్ధి చెందిన ఓ పావో అనే సంస్థ స్పెషల్‌గా గోల్డ్ వడపావ్ వంటకాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే తొలిసారి 22 క్యారెట్ల గోల్డ్ వడ పావ్‌ను ప్రారంభిస్తున్నట్లు సెప్టెంబర్ 1న తమ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.
ఈ గోల్డ్ వడ పావ్‌ను మొత్తం ఛీజ్, బట్టర్‌తో ఫిల్ చేస్తారు. తరువాత బంగారం రంగులో ఉండే పిండిలో ముంచి తీసి నూనెలో వేయించి ఇస్తారు. దీంతో అచ్చం బంగారంలా కనిపిస్తుంది. దీన్ని ఓ చెక్క డబ్బాలో పెట్టి ఇస్తారు. ఈ వడాపావ్‌తో పాటు స్వీట్ పొటాటో ఫ్రైస్, పుదీనా లేమనేడ్‌ని కూడా ఇస్తారు. ఇంత అద్భుతంగా తయారు చేసి అందించడంతో ఈ వడపావ్ భోజన ప్రియులను ఎంతగానే ఆకట్టుకుంటోంది.
చదవండి: ఢిల్లీకి నయాగరా వాటర్ ఫాల్స్ వచ్చిందిరోయ్.. వైరల్ వీడియో
అయితే ఈ గోల్డ్ వడ పావ్ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. దీని ధర 99 దిర్హామ్ అంటే మన కరెన్సీలో సుమారు రూ. 2 వేలు అన్నమాట. మరి ఇంత ఖరీదైన, ఢిఫరెంట్ వడాపావ్‌ను సాధారణంగా ప్లేట్‌లో పెట్టేసి ఇచ్చేస్తే ఏం విలువుంటుంది? అందుకే ప్రజంటేషన్‌లో ఏమాత్రం తీసిపోకుండా 22 క్యారెట్ల బంగారం వడాపావ్ రేంజ్‌లోనే ప్రజంటేషన్ కూడా ఉంది.
చదవండి:అద్భుత ఫోటో షూట్..విషయం తెలిస్తే కన్నీళ్లొస్తాయ్!
Comments
Please login to add a commentAdd a comment