దేశ ఆర్థిక రాజధాని ముంబై పేరు చెప్పగానే ఆహార ప్రియులకు మొదటగా గుర్తొచ్చేది ‘వడా పావ్’. పేదాగొప్ప తేడాలను చెరిపేసే ఈ స్కాక్‌కు మరాఠ ప్రజలు పట్టం కడతారు. అయితే శుక్రవారం ముంబై వీధుల్లో టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేకు వడా పావ్ తింటుంటే అతడికి ఓ సందేహం కలిగింది. దీంతో తన సందేహాన్ని నివృతి చేసుకునేందుక వెంటనే తన అధికారిక ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘మీకు వడా పావ్ ఎలా తినడం ఇష్టం.. 1, చాయ్‌తో వడా పావ్, 2. చట్నీతో వడా పావ్, 3. కేవలం వడా పావ్’అంటూ తన మనసులోని సందేహాన్ని ట్వీట్ రూపంలో భయటపెట్టాడు. అయితే రహానే అడిగిన ప్రశ్నకు ఫ్యాన్స్ వినూత్నంగా సమాధానం ఇచ్చారు.
అయితే రహానే ట్వీట్‌కు మాస్టర్ బ్లాసర్ సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయ్యాడు. ‘నాకు వడా పావ్‌ని ఎర్ర చట్నీతో కాస్త గ్రీన్ చట్నీ, ఇంకాస్త చింతపండు చట్నీతో తినడం చాలా ఇష్టం’ అని సచిన్ రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ట్వీట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సచిన్ మంచి భోజనప్రియడు మాత్రమే కాకుండా సూపర్ చెఫ్ అన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన వంటకాలను ఎలా వండాలో తెలుసుకొని నేర్చుకుని వండి అతడి సన్నిహితులకు రుచి చూపిస్తాడు. ఇక గతంలో ఓ మరాఠ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘నేను, నా కొడుకు(అర్జున్) శివాజీ పార్క్ జింఖానా వద్ద వడా పావ్ తింటాం. ఈ స్నాక్‌కి ధీటైన వస్తువు మరొకటి లేదు’ అని సచిన్ పేర్కొన్న సంగతి విదితమే.
I like my Vada Pav with red chutney, very little green chutney & some imli chutney to make the combination even better👍
— Sachin Tendulkar (@sachin_rt) January 10, 2020
Comments
Please login to add a commentAdd a comment