ధైర్యమున్నంత వరకూ పోరాడతా..జస్ప్రీత్ వీడియో వైరల్‌ : ఆనంద్‌ మహీంద్ర ఫిదా | Anand Mahindra Vows to Help 10 yearold Delhi BoyViral Video Selling Rolls | Sakshi
Sakshi News home page

ధైర్యమున్నంత వరకూ పోరాడతా..జస్ప్రీత్ వీడియో వైరల్‌ : ఆనంద్‌ మహీంద్ర ఫిదా

Published Mon, May 6 2024 1:19 PM | Last Updated on Mon, May 6 2024 1:47 PM

Anand Mahindra Vows to Help 10 yearold Delhi BoyViral Video Selling Rolls

నాన్న (బ్రెయిన్‌ టీబీ) అనారోగ్యంతో కన్నుమూశాడు. తల్లి ఇక్కడ ఉండలేనంటూ సొంత ఊరికి (పంజాబ్‌) వెళ్లిపోయింది. దీంతో ఒంటరి అయిపోయాడు. అయినా ధైర్యం కోల్పోలేదు. నాన్న చనిపోయి నెలరోజులైనా కాకుండానే బాధ్యతను భుజానకెత్తు కున్నాడు. నాన్న నేర్పిన విద్యనే ఎంచుకున్నాడు. కేవలం పదేళ్లకే స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్‌ని నడుపుతూ దైర్యంగా జీవిస్తున్నాడు. తన 14 ఏళ్ల అక్కకు కూడా కొండంత అండగా నిలుస్తున్నాడు.  ఆ దైర్యం  పేరే  జస్ప్రీత్. 

చదువుకుంటూనే, ఈ సెంటర్‌ నడుపుతూ ఉండటం విశేషం. ‘‘జబ్‌తక్‌ హిమ్మత్‌ హై.. తబ్‌ తక్‌ లడూంగా’’ అంటున్న ఆ కుర్రవాడి కళ్లలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం నెటిజనులకు ఆకట్టుకుంటోంది. 

 
పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్‌లో  ఈ సెంటర్‌ నడుపుతున్న జస్ప్రీత్‌ వీడియోను  ఫుడ్ వ్లాగర్ సరబ్‌జీత్ సింగ్  ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. చికెన్‌ ఎగ్ రోల్‌, కబాబ్‌ రోల్‌, పన్నీర్‌ రోల్‌...ఇలా రుచికరమైన పదార్థాలను అలవోకగా చేసి కస్టమర్లకు అందిస్తాడు. జస్ప్రీత్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్‌ వైరలవుతోంది.

ఈ వీడియో పారిశ్రామిక వేత్త, ఎం అండ్‌ ఎం అధినేత ఆనంద్‌ మహీంద్ర వరకూ చేరింది. దీంతో వెంటనే  ఆయన స్పందించారు. ఆ బాలుడి ధైర్యానికి దృఢ సంకల్పానికి ఫిదా అయిపోయారు. అతని  కాంటాక్ట్‌ నంబరు తెలిస్తే జస్ప్రీత్‌కు సాయం చేస్తానంటూ ప్రకటించారు.  అతని చదువు దెబ్బ తినకూడదు. మహీంద్రా ఫౌండేషన్ బృందం, అతని విద్యకు ఎలా మద్దతు ఇవ్వగలదో ఆలోచిస్తుంది. దయచేసి జస్ప్రీత్‌ వివరాలను అందింగచలరు అంటూ ఎక్స్‌ లో పోస్ట్‌(ట్వీట్‌) చేశారు.

మరోవైపు సోషల్‌ మీడియాలో  వైరల్‌ కావడంతో  జస్ప్రీత్‌ భారీ మద్దతు లభిస్తోంది. ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్  కూడా స్పందించారు. తగిన సాయం అందిస్తానని ప్రకటించారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement