Amitabh Bachchan Grand Daughter Aaradhya Moves Delhi HC Over Fake Reporting On Her Health - Sakshi
Sakshi News home page

హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనవరాలు!

Published Thu, Apr 20 2023 1:26 PM | Last Updated on Thu, Apr 20 2023 1:48 PM

Amitabh Bachchan Grand Daughter Aaradhya Moves Delhi High Court - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు, అభిషేక్‌-ఐశ్వర్యరాయ్‌ల ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్‌ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. తన ఆరోగ్యంపై తప్పులు కథనాలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్‌ చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ అంశంపై నేడు(ఏప్రిల్‌ 20) హైకోర్టులు విచారణ జరిగింది.

11 ఏళ్ల వయసు ఉన్న ఆరాధ్యపై కొన్ని యూట్యూబ్‌ చానళ్లు తరచూ తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఆమెను టార్గెట్‌ చేస్తూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. తన కూతురుపై వచ్చిన తప్పుడు కథనాలపై గతంలో అభిషేక్‌ మీడియా ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రెటీల పిల్లలను ట్రోల్స్‌ చేయడం సరికాదని, అలాంటి వారిని క్షమించొద్దని అన్నారు.

అయినా కూడా ట్రోల్స్‌ తగ్గలేదు. దీంతో ఆరాధ్య నేరుగా హైకోర్టుని ఆశ్రయించింది. ఆరాధ్య ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలను షేర్‌ చేయకుండా యూట్యూబ్‌ చానళ్లను న్యాయస్థానం నిషేదించినట్లు తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 6న ఆరాధ్య జన్మించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement