సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శన చర్చనీయాంశంగా మారింది. హెచ్‌సీయూలో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఇటీవల రెండు సంఘాలు కలిసి ప్రదర్శించినట్లు తెలిసింది. 2002 గోద్రా అల్లర్లు, రామమందిర నిర్మాణ ఘర్షణపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించగా దానిపై భారతదేశంలో నిషేధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
డాక్యుమెంటరీని ప్రదర్శించిన, తిలకించిన వారిపై చర్యలు తీసుకోవాలని యూనివర్సి'rటీ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. దేశంలో మళ్లి అల్లర్లు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఈ డాక్యుమెంటరీపై ఎలాంటి నిషేధం లేదని, సెన్సార్ మాత్రమే చేశారని, బీబీసీ నుంచి అనుమతి పొంది ప్రదర్శించుకోవచ్చని కొందరు వాదిస్తున్నట్లు తెలిసింది. అధికారికంగా ఫిర్యాదు రానిదే దీనిపై విచారణ చేయడం, కేసులు నమోదు చేయడం ఉండదని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment