సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలపై రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయి. మెయిన్ లాండ్ డిజిటల్ టెక్నాలజీలో ముగ్గురు నేతలు భాగస్వాములుగా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.
జేపీ బ్రదర్స్ షోరూమ్స్ తో పాటు అమిర్‌పేట్‌లో కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో పలు వ్యాపారాలు మర్రి జనార్థన్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. మర్రికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో సైతం ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
పైళ్లకు చెందిన తీర్ధా ప్రాజెక్ట్స్ పై ఐటీ నజర్
నేతల సతీమణులు, కుటుంబ సభ్యులు డైరెక్టర్లగా ఉన్న కంపెనీలపై ఐటీ ఫోకస్ పెట్టింది. ముగ్గురు నేతలు కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ గుర్తించింది. బ్యాంకు లాకర్స్‌ను సైతం ఓపెన్ చేసిన ఐటీ అధికారులు.. కీలకపత్రాలు, సమాచారం సేకరించారు.
చదవండి: ‘బండి’ మార్పు లేదు
Comments
Please login to add a commentAdd a comment