సాక్షి, చైన్నె: కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చినా సెంథిల్ బాలాజీని సమీపించలేని పరిస్థితులలో ఈడీ వర్గాలు ఉన్నాయి. దీంతో విచారణలో జాప్యం తప్పడం లేదు. సెంథిల్ బాలాజి ఆరోగ్యపరిస్థితిపై జిప్మర్, ఎయిమ్స్ వైద్యబృందంతో ఈడీ వర్గాలు సమావేశమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం సెంథిల్ బాలాజీకి బైపాస్ శస్త్ర చికిత్స నిర్వహణకు కావేరి వైద్యులు నిర్ణయించినట్టు తెలిసింది. క్యాష్ ఫర్ జాబ్స్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. గుండెపోటు రావడంతో సెంథిల్ బాలాజి ఆస్పత్రిలో చేరారు.
అయినా సెంథిల్ బాలాజీని ఈడీ వర్గాలు వెంటాడుతున్నాయి. ఆయన్ను తమ కస్టడీలో ఉంచి విచారించేందుకు కోర్టు అనుమతి సైతం పొందాయి. ఆయన్ను విచారించేందుకు సర్వం సిద్ధం చేసుకున్న ఈడీ వర్గాలకు కోర్టు విధించిన ఆంక్షలు అడ్డంకిగా మారాయి. డాక్టర్ల అనుమతితో సెంథిల్ బాలాజీని విచారించాలని ఈడీకి కోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ మేరకు సెంథిల్ బాలాజి వద్ద విచారణ జరిపేందుకు, కోర్టు ఉత్తర్వుల నకలును శనివారం వైద్యులకు ఈడీ వర్గాలు అందజేశాయి. అయితే, సెంథిల్ బాలాజి ఐసీయూలో ఉన్న దృష్ట్యా, ఆయన వద్ద విచారణ కష్టతరంగా మారింది.
విచారణకు విశ్వప్రయత్నం..
ఆస్పత్రి వైద్యుల నుంచి ఎలాంటి సమాధానం లేకపో వడం, కోర్టు ఇచ్చిన 8 రోజుల గడువులో రెండు రోజు లు వృథాకావడంతో ఈడీ వర్గాలు అయోమయంలో పడ్డాయి. సెంథిల్ బాలాజీని ఎలాగైనా విచారించి తీ రాలని ఈడీ డెప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే, కావేరి వైద్యుల నుంచి సరైన సమాధానం లేనట్టు సమాచారం. దీంతో తమ నేతృత్వంలో రంగంలోకి దిగిన జిప్మర్, ఎయిమ్స్‌వైద్యబృందతో ఆదివారం ఈడీ వర్గాలు సమావేశమయ్యాయి.
తదుపరి చర్యలపై దృష్టిపెట్టాయి. ఇంతవరకు విచారణ ముందుకు సాగని నేపథ్యంలో ఆదివారం కావేరి వై ద్యుల నుంచి వెలువడిన సమా చారం ఈడీకి మరింత షాక్‌గా మారినట్టుంది. బుధవా రం సెంథిల్ బాలాజీకి బైపాస్ శస్త్ర చికిత్స నిర్వహణకు కావేరి వైద్యులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఆయన వద్ద విచారణ చేపట్టడం అసాధ్యంగా మారింది. దీంతో తమ వైద్యుల బృందంతో సమావేశమై సోమవారం కోర్టును ఆశ్రయించి తర్వాత అడుగులు వేయడానికి ఈడీ వర్గాలు కసరత్తుల్లో మునిగాయి.
విమర్శ...
సెంథిల్ బాలాజీని వెనకేసుకొచ్చి విచారణ ఖైదీకి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి మండిపడ్డారు. సెంథిల్ బాలాజీని పదవి నుంచి తప్పించకుండా, ఇంకా మంత్రి పదవిలో కొనసాగించడం అనుమానాలకు దారితీస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఇదిలాఉండగా, సెంథిల్ బాలాజి వ్యవహారంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రకటనపై డీఎంకే పత్రిక మురసోలి ఆదివారం తీవ్రంగానే స్పందించింది.
కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మంత్రి పదవి తప్పించాలని గవర్నర్ ఒత్తిడి తీసుకురావడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గవర్నర్ తీరు శాడిజాన్ని తలపిస్తున్నట్టు ధ్వజమెత్తారు. కేవలం ఆరోపణలకే ఒకరికి మంత్రి పదవి నుంచి తప్పించాల్సి వస్తే, ఆ జాబితాలో ఎందరో ఉంటారన్న విషయన్ని గుర్తెరగాలని హితవు పలికారు.
గతంలో కేరళ గవర్నర్‌కు ఇలాంటి వ్యవహారంలో ఎదురైన ఎదురుదెబ్బను డీఎంకే పత్రిక మురసోలి గుర్తు చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గవర్నర్ తీరును వ్యతిరేకిస్తూ ఎండీఎంకే నేతృత్వంలో సంతకాల సేకరణకు ఆ పార్టీ నేత వైగో నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment