మంత్రిపై వేటు వేసిన జయలలిత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. ఆ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీకి ఉద్వాసన పలికారు. జయలలిత సూచన మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య.. సెంథిల్ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. సోమవారం రాజ్భవన్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
కరూర్ జిల్లా అన్నా డీఎంకే కార్యదర్శిగా ఉన్న సెంథిల్ను పార్టీ పదవి నుంచి కూడా జయలలిత తొలగించారు. ఇదిలావుండగా, తమిళనాడు పరిశ్రమల మంత్రి తంగమణికి రవాణ శాఖ బాధ్యతలు అప్పగించారు.