సాక్షి, చెన్నై: మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని 8 రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ చెన్నై జిల్లా మొదటి Ðమేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి లిల్లీ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. క్యాష్ ఫర్ జాబ్స్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గుండెపోటు రావడంతో ఆయన్ను కావేరీ ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం డాక్టర్ ఏఆర్ రఘురాం నేతృత్వంలోని బృందం రెండు మూడు రోజులలో ఆయనకు బైపాస్ సర్జరీ చేయడానికి చర్యలు తీసుకుంది.
ఈ నేపథ్యంలో సెంథిల్ బాలాజీని 15 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ వేసిన పిటిషన్‌పై చెన్నై జిల్లా మొదటి మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి లిల్లీ విచారణ చేపట్టి..ఎనిమిది రోజుల పాటు సెంథిల్ బాలాజీని కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రిలో ఉన్న దృష్ట్యా, విచారణ అక్కడే జరగాలని ఆదేశించారు. సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్‌ను నిరాకరించారు. సెంథిల్ బాలాజీ సోదరుడు అశోకన్‌ను విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment