
పన్నీర్ శిబిరంలో ఆనందోత్సాహాలు!
చెన్నై: అన్నాడీఎంకేలో సంక్షోభం నేపథ్యంలో తమిళ రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. శశికళ నటరాజన్ తో సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్న పన్నీర్ సెల్వం క్రమంగా బలం పుంజుకుంటున్నారు. ఆయనకు అన్నీ కలిసొస్తున్నట్టు కనబడుతోంది. శశికళకు సుప్రీంకోర్టు నుంచి సమన్లు వచ్చాయన్న ప్రచారంతో పన్నీర్ సెల్వం శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అక్రమ ఆస్తుల కేసులో సోమవారం శశికళ కోర్టుకు హాజరవుతారని ప్రచారం జరగడంతో పన్నీర్ సెల్వం మద్దతుదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని సంబరాలు జరుపుకున్నారు.
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నెం.2గా ఉన్న శశికళ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశముందని గురువారం వార్తలు వచ్చాయి. 2016 జూన్ నెలలోనే విచారణ పూర్తి కాగా అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఒకేవేళ ఈ కేసులో శశికళను దోషిగా నిర్ణయిస్తే ఆమె సీఎం పదవి కోల్పోవడమే కాదు.. కొంత కాలం పాటు ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా వీలు లేకుండా నిషేధం పడుతుంది.
సంబంధిత కథనాలు చదవండి..
శశికళపై పోలీసులకు ఫిర్యాదు
ఏ టైమ్ లోనైనా గవర్నర్ నుంచి పిలుపు!
అన్నాడీఎంకే ఎంపీలకు నిరాశ తప్పదా?
(మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్!)