
ఏఐఏడీఎంకేలో విలీనం లేదు: పన్నీర్ సెల్వం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే వర్గాల విలీనానికి ఇక ఎంతమాత్రం తావులేదని ‘అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ’ వర్గ నేత, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు.
మధురై జిల్లా ఉసిలంపట్టిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నుండి అనుమతి రాగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు ఉంటాయని అన్నారు. విలీనం కోసం ఏర్పాటు చేసుకున్న కమిటీని రద్దు చేసినందున ఇక ఆ ఆంశాన్ని పక్కనపెట్టేశామని తెలిపారు. శశికళ వర్గంలో చేరాలని తనకు రూ.30 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు పన్నీర్‌వర్గ ఎమ్మెల్యే మనోహరన్ విరుదునగర్ జిల్లా రాజపాళయంలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో తెలిపారు.