తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. విశ్వాస పరీక్షలో గట్టేక్కేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు పళనిస్వామిపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం చెంతకు చేరింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగిన తీరును పరిశీలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయలలిత మరణానంతరం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం, శశికళ,పళనిస్వామి వర్గాలు నడిపిన బేరసారాలు ఆలస్యంగా బయటపడ్డాయి.