
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా.. అని పరోక్షంగా పళణి స్వామి శిబిరాన్ని ఉద్దేశించి పన్నీరు సెల్వం వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. వివరాలు.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరాల మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే.
అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఇద్దరు నేతలు పక్క పక్కనే కూర్చున్నా, ఒకరి ముఖాలు, మరొకరు చూసుకోవడం లేదు. పలకరించుకోవడం కూడా లేదు. ఈ నేపథ్యంలో మంళవారం మీడియా ప్రతినిధి ఓ ప్రశ్న సంధించగా, ఏకం అయ్యేందుకే తన ప్రయత్నమంటూ పరోక్షంగా పళణితో చేతులు కలిపేందుకు తాను రెడీ అనే సంకేతాన్ని ఇచ్చారు. అయితే ఇప్పటికే పళణి శిబిరం పన్నీరుకు ఇక పార్టీలో చోటు లేదని స్పష్టం చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment