Tamil Nadu politics
-
అవును.. నిందితుడు మా పార్టీ మద్దతుదారుడే: సీఎం స్టాలిన్
చెన్నై: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటన తమిళనాట రాజకీయ దుమారం రేపుతోంది. అసెంబ్లీని సైతం దద్దరిల్లిపోయేలా చేసిన ఈ ఘటనపై బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. నిందితుడు తమ పార్టీ మద్దతుదారుడేనని ప్రకటించారాయన. అయితే..అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు సీఎం స్టాలిన్(CM Stalin) మాట్లాడుతూ.. ‘‘అన్నా వర్సిటీ ఘటనలో నిందితుడు కేవలం డీఎంకే మద్దతుదారుడేనని, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నట్లు పార్టీ సభ్యుడు ఎంతమాత్రం కాదు’’ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. మహిళల భద్రతే ప్రాధాన్యంగా పని చేస్తున్న తమ ప్రభుత్వం.. నిందితుడికి రక్షణ కల్పించలేదని, భవిష్యత్తులోనూ కల్పించబోదని, పైగా అతనిపై గుండా యాక్ట్ ప్రయోగించామని ప్రకటించారు. అన్నా వర్సిటీ ఘటన.. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.‘‘విద్యార్థినిపై లైంగిక దాడి(Sexual Assault) క్రూరమైన ఘటన. అయితే.. చట్ట సభ్యులు ఇవాళ ఈ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని విమర్శించడమే అంతా పనిగా పెట్టుకున్నారు. బాధితురాలి తరఫు నిలబడి సత్వర న్యాయం చేకూర్చాలనే మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాధారణంగా.. ఘటన జరిగాక నిందితుడు తప్పించుకుంటేనో.. అరెస్ట్‌లో జాప్యం జరిగితేనో.. లేకుంటే నిందితుడ్ని రక్షించే ప్రయత్నాలు జరిగితేనో విమర్శలు వినిపిస్తాయి. కానీ, ఇక్కడ వీలైనంత త్వరగా అరెస్ట్ చేసినా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే రాద్ధాంతం కాకపోతే ఇంకేంటి?’’ అని ప్రశ్నించారాయన. అన్నా వర్సిటీ(Anna University) ఘటనకు నిరసనగా ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యులు నల్లదుస్తులతో అసెంబ్లీకి వచ్చారు. వాళ్లను ఉద్దేశిస్తూ సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.గతంలో ఇదే ప్రతిపక్ష అన్నాడీఎంకే అధికారంలో ఉండగా.. పొల్లాచ్చి లైంగిక దాడి కేసు సంచలనం సృష్టించింది. ఆ టైంలో ప్రభుత్వం ఏం చేసింది?.. ఆలస్యంగా స్పందించడంతో నిందితుడు పారిపోలేదా? అని ప్రశ్నించారాయన. ప్రతిపక్షాలంతా నిందితుడు ఎవరు? మీ పార్టీ వాడు కాదా అని ప్రశ్నిస్తున్నాయి. అవును.. అతను మా పార్టీ మద్దతుదారుడే. కానీ, సభ్యుడు మాత్రం కాదు. ఈ విషయాన్ని మేం ముందు నుంచే చెబుతున్నాం. అరెస్ట్ విషయంలోనూ ఎక్కడా రాజకీయ జోక్యం జరగలేదు. ఒకవేళ.. అలా జరిగిందని ఆధారాలు ఉంటే సిట్‌కు సమర్పించండి. దర్యాప్తు అయ్యేదాకా ఎదురుచూడడండి. అంతేగానీ స్వప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేయొద్దు అని ప్రతిపకక్షాలను ఉద్దేశించి హితవు పలికారాయన. ఈ తరుణంలో అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇదిలా ఉంటే.. అన్నా వర్సిటీ ఉందంతంపై దాఖలైన ఓ పిటిషన్ విషయంలోనూ మదద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19) తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో.. క్యాంపస్‌కు దగ్గర్లో బిర్యానీ సెంటర్ నడిపే జ్ఞానేశ్వర్‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను డీఎంకే సభ్యుడంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. మరోవైపు.. ఈ కేసులో ఇంకొంతమంది నిందితులు ఉన్నారని.. వాళ్లను రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.ఇదీ చదవండి: బీజేపీ నేత నోటి దురుసు! ఫలితంగా.. -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా సమయం ఉంది. 2026 ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. అధికార డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. అటు బీజేపీ కూడా తమ ఓటు బ్యాంకు పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్- డీఎంకే కూటమిని ఓడించాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.ఏదైనా జరగొచ్చు..అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో జట్టు కట్టే అవకాశముందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సూచనప్రాయంగా వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే పార్టీని తమిళనాడులో లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలపడం లేదా ప్రస్తుతం కొనసాగుతున్న కూటమిని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. ‘వచ్చే ఎన్నికల సమయానికి ఏదైనా జరగొచ్చు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే మా ధ్యేయమ’ని అన్నామలై పేర్కొన్నారు. 2026లో ద్రవిడేతర పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.‘2026 అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ద్రవిడ పార్టీలు సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండకపోవచ్చు. నాన్-ద్రవిడన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నాం. మాది కూడా బలమైన కూటమే. తమిళనాడు ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. 2025లో జరిగే రాజకీయ పరిణామాలతో ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంద’ని అన్నామలై వ్యాఖ్యానించారు.బలమైన కూటమి ఏర్పాటు చేస్తాంఅన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడపాడి పళనిస్వామి కూడా ఇంచుమించు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వీరిద్దరిని మాటలను బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖాయమన్న అభిప్రాయం బలపడుతోంది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని ఓడించి తాము మళ్లీ అధికారంలోకి వస్తామన్న దీమాను పళనిస్వామి వ్యక్తం చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటతామని ప్రకటించారు. ‘అందరూ ఊహించినట్లుగానే ఏఐఏడీఎంకే బలమైన కూటమిని ఏర్పాటు చేస్తుంది. పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. రెండిటికీ చాలా తేడా ఉంది. 2026 మన ఎన్నికలు! ఇవి అన్నాడీఎంకే ఎన్నికల’ని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నారు.ఈసారి అటువంటి పొరపాటు చేయంలోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే నష్టపోయామన్న అభిప్రాయాన్ని పరోక్షంగా అంగీకరించారు పళనిస్వామి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి పొరపాటు చేయబోమని చెప్పారు. ‘2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐఏడీఎంకేపై అనేక విమర్శలు వచ్చాయి. సరైన పొత్తు లేకపోవడంపై పలువురు ప్రశ్నలు సంధించారు. పొత్తులు వస్తాయి, పోతుంటాయి.. కానీ ఏఐఏడీఎంకే భావజాలం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు, బలమైన కూటమి లేదు.. ప్రభుత్వంలో లేనప్పటికీ మేము 20 శాతానికి పైగా ఓట్లను సాధించాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే కూటమికి 26 శాతం ఓట్లు సాధించింది. 2019తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ’ని ఈపీఎస్ వివరించారు. ఈ ట్రెండ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.చదవండి: అమిత్ షా మాట.. ఒమర్ అబ్దుల్లా నోట.. ఏం జరిగింది?డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడమనేది పగటి కలగా మిగిలిపోతుందని పళనిస్వామి జోస్యం చెప్పారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు గెలుస్తామని చెబుతూ డీఎంకే పగటి కలలు కంటోంది. అది ఎప్పటికీ నిజం కాదు. డీఎంకేపై ప్రజల్లో కొత్త చైతన్యం వస్తోంది. అదే మా విజయమ’ని ఆయన అన్నారు. కాగా తమిళనాడు శాసనసభలో 234 మంది సభ్యులు ఉన్నారు. -
Actor Vijay: విజయ్ పార్టీ కోసం పని చేస్తారా?
చెన్నై: స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటన తర్వాత.. తమిళనాడు రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైం ఉంది. ఈలోపే విజయ్ ‘‘తమిళగ వెట్రి కళగం’’ TVK ఎవరితో చేతులు కలుపుతుంది? ఏ మేర ప్రభావం చూపెడుతుందంటూ డిబేట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రవేశంపై విజయ్ ప్రశాంత్ కిషోర్‌తో సైతం చర్చలు జరిపినట్లు వార్తలు వినవచ్చాయి. ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్‌కు దీనికి సంబంధించి ప్రశ్న ఎదురైంది. విజయ్ అడిగితే ఆయన పార్టీ కోసం పని చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘విజయ్ నాతో టచ్‌లో లేరు. ప్రస్తుతం ఎన్నికల వ్యహకర్త వ్యవహారాలను నేను చూడడం లేదు. ఒకవేళ ఆయన నన్ను అడిగినా.. ఆ పని చేయలేను. కానీ, ఆయన కోరుకుంటే మాత్రం సలహాలు ఇచ్చి సాయం చేయగలను. ఎందుకంటే.. నన్ను గౌరవించే వాళ్లకు సలహాలు ఇవ్వడం నాకు అలవాటు’’ అని పీకే క్లారిటీ ఇచ్చారు. ఇక.. ఇదే ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాలపై స్పందించిన పీకే.. అక్కడి రాజకీయాల్లో విజయ్ ప్రభావంపైనా మాట్లాడారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని తేలికగా తీసుకోవద్దని ఇతర పార్టీలకు సూచించారు. ముఖ్యంగా ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకు 60 నుంచి 65 శాతం తగ్గిపోయే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. -
Vijay Political Party: రాజకీయ పార్టీ ప్రకటించిన హీరో విజయ్
తమిళనాడులో హీరో విజయ్ పార్టీ ప్రకటించాడు. 'తమిళగ వెట్రి కళగం'Tamizhaga Vetri Kazhagam పేరుతో ఆయన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. గత మూడేళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా నేటితో దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తమిళగ వెట్రి కళగం పేరును రిజస్టర్ చేసినట్లు ప్రకటన రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఆయన ఎక్కువగా ప్రజల్లోనే కనిపించడమే కాకుండా పలు సేవా కార్యక్రామాల్లో పాల్గొంటు ఉన్న విషయం తెలిసిందే. పార్టీ ప్రకటన అయితే వచ్చేసింది కానీ అందుకు సంబంధించిన గుర్తును త్వరలో ప్రకటించనున్నారు. పార్టీ ఎజెండాను కూడా త్వరలో ప్రకటిస్తామాని విజయ్ నుంచి ఒక నోట్ వెలువడింది. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని దానిని నిర్మూలించడమే తన ధ్యేయం అని విజయ్ అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్ పేర్కొన్నారు. హీరో విజయ్ తన రాజకీయ రంగప్రవేశం ఒకరోజుతో అనుకుని జరగలేదు. పక్కా ప్లాన్‌తోనే ఆయన అడుగులు వేశారు. పొలిటికల్ రంగంలోకి దిగిన తర్వాత తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి అనే దృఢ సంకల్పంతోనే టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తన విజయ్ మక్కళ్ ఇయక్కుమ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరవయ్యారు. ఈ సంఘం ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆపై అనేక రక్తదాన శిబిరాలతో పాటు ఉచిత విద్య కేంద్రాలు, ఉచిత న్యాయ సలహా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ ఏర్పాటు చేశారు. గతేడాది తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు చెందిన పదవ తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ముగ్గురు చొప్పున తన కార్యాలయానికి రప్పించి వారికి ప్రశంసాపత్రాలతో పాటు కానుకలను అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ వారితో ముఖ్యంగా నోటుకు ఓటు విధానం సరికాదని, దీన్ని అందరూ పాటించాలని హితవు పలికారు. నెలరోజుల క్రితం తమిళనాడులో తుపాను దెబ్బకు వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. వారందరికి తనవంతుగా సాయం అందించి వారికి అండగా నిలిచాడు. ఇలా తన పొలిటికల్ ఎంట్రీ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం తమిళనాడులో సినిమా పరిశ్రమ నుంచి కమల్ హాసన్, ఖుష్బూ, నమిత వంటి వారు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. విజయ్ రాకతో ఆయన పార్టీలోకి మరికొంత మంది చేరనున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Vijay (@actorvijay) -
ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా.. అని పరోక్షంగా పళణి స్వామి శిబిరాన్ని ఉద్దేశించి పన్నీరు సెల్వం వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. వివరాలు.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరాల మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఇద్దరు నేతలు పక్క పక్కనే కూర్చున్నా, ఒకరి ముఖాలు, మరొకరు చూసుకోవడం లేదు. పలకరించుకోవడం కూడా లేదు. ఈ నేపథ్యంలో మంళవారం మీడియా ప్రతినిధి ఓ ప్రశ్న సంధించగా, ఏకం అయ్యేందుకే తన ప్రయత్నమంటూ పరోక్షంగా పళణితో చేతులు కలిపేందుకు తాను రెడీ అనే సంకేతాన్ని ఇచ్చారు. అయితే ఇప్పటికే పళణి శిబిరం పన్నీరుకు ఇక పార్టీలో చోటు లేదని స్పష్టం చేయడం గమనార్హం. -
‘చౌరస్తా’లో రాజ్యాంగ విలువలు
దేశంలో జరుగుతున్న ఎన్నో ఘటనలు పడిపోతున్న ప్రజాస్వామిక విలువలను సూచిస్తున్నాయి. అసహనాన్ని సూచిస్తున్నాయి. న్యాయంగా ఉండటానికి రోజులు కావని చెబుతున్నాయి. ఇది కొత్త రాజకీయ వాదనలు చేయడానికి కారణమవుతోంది. నిజానికి ఇలాంటి ధోరణులు ప్రబలడానికి మూలం ఎక్కడ ఉందో అంతా ఆలోచించాలి. యావద్భారత రాజకీయాల్ని తారుమారు చేసే ‘పుండు’ అంతా స్వార్థపూరిత పార్టీల పాలకులలో ఉంది. అంబేడ్కర్ ఆశించినట్టుగా సంపన్న వర్గాల ఆధిపత్యం నుంచీ, కుల వ్యవస్థ పట్టు నుంచీ విడివడిన సామాజిక వ్యవస్థ నిర్మాణం జరగలేదు. వామపక్షాల మధ్య ఐక్యత కొరవడిన ఫలితంగా బలమైన ఉద్యమాలు లేక జనం మితవాద పార్టీల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది మౌనం వీడాల్సిన సమయం. ‘‘తమిళనాడును స్వయంప్రతిపత్తిగల ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే స్థితికి మా తమిళనాడును నెట్టవద్దు. తమిళనాడును ప్రత్యేక దేశంగా మేము ప్రకటించుకునే స్థితికి మమ్మల్ని నెట్టవద్దు. స్వపరిపాలనా ప్రాంతంగా తమిళనాడును కేంద్రం ప్రకటిం చాలి. అందాకా మేము విశ్రమించేది లేదు. తమిళనాడు వేరే దేశంగానే వృద్ధి చెందాలన్న పెరియార్ విశ్వాసం వైపుగా మమ్మల్ని నెట్టవద్దు.’’ – సీఎం ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సీనియర్ నాయకుడు, నీలగిరి పార్లమెంట్ సభ్యుడైన ఎ.రాజా (4 జూలై 2022). ‘‘ద్రవిడియన్ ప్రాంతీయ పార్టీ రాజకీయాల వైఫల్యాన్ని డీఎంకే నాయకుడు రాజా ఆమోదించినట్టే’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సి.టి. రవి దీనికి స్పందించారు. రాజా ప్రకటన దేశ విభజనకు దారితీసే పచ్చి చీలుబాట రాజకీయమని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి ప్రకటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ మౌనంగా ఉండిపోవడాన్ని ఖండిస్తున్నాననీ, రాజ్యాంగానికి బద్దులై ఉంటానని హామీపడి కూడా స్టాలిన్ ప్రేక్షకుడిగా ఉండిపోయారనీ తిరుపతి అన్నారు. నిజానికి దేశంలో ఇలాంటి ధోరణులు ప్రబలడానికి మూల మంతా ఎక్కడ ఉందో నిష్పాక్షికంగా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. వేర్పాటు ధోరణుల మూలం అంతా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఉందని దక్షిణ, తూర్పు భారత రాష్ట్రాలు ఇప్పటికే గ్రహించాయి. యావద్భారత రాజకీయాల్ని తారుమారు చేసే ‘పుండు’ అంతా స్వార్థపూరిత పార్టీల పాలకులలో ఉంది. కేంద్రాధి కారంలో ఉన్న రాజకీయ పక్షాల ఉసురును ఇంతవరకూ కాపాడి నిలబెడుతున్న ఏకైక ‘చిట్కా’ – యూపీలోని 80 లోక్‌సభ సీట్లు. ఈ ‘గుట్టు’ చేతుల నుంచి జారిపోకుండా జాగ్రత్త పడటానికే ఉత్తర– దక్షిణ భారతదేశాల మధ్య గండి కొట్టాల్సిన అవసరం పాలకులకు అనివార్యం అయిపోయింది. భారతదేశ పాలనలో ఈ ‘గుట్టు’ను కాస్తా పసిగట్టి ‘రట్టు’ చేసిన తొలి దార్శనికుడు, భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన అంబేడ్కర్. కనుకనే దక్షిణ భారతదేశానికి హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా తక్షణం ప్రకటించాలని అంబేడ్కర్ కోరారని మరచి పోరాదు. అప్పుడుగానీ ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ సీట్ల ఆధారంగా దక్షిణ భారత రాష్ట్రాలకు కేంద్ర పాలకులు నిరంతరం తలపెడుతున్న అన్యాయానికి అడ్డుకట్టు వేయడం సాధ్యపడదు. అందుకే అంబేడ్కర్ ప్రతిపాదనకు (దక్షిణ భారత రాజధానిగా హైదరాబాద్) అంతటి విలువ! ఈ దృష్టితో చూస్తే డీఎంకే నాయకుడు ఎ.రాజా ఆందోళనను కూడా తప్పుగా అర్థం చేసుకోనక్కర్లేదు. అంబేడ్కర్ 1956లో విస్తృత స్థాయిలో భారత రిపబ్లికన్ పార్టీని ఏర్పరచి, దానిని లౌకిక (సెక్యులర్) ప్రాతిపదికపైన ‘సోషలిస్టు ఫ్రంట్’గా తీర్చిదిద్దారు. బౌద్ధంలోని హేతువాద సూత్రాల అండ దండలనూ తోడు చేసుకున్నారు. తద్వారా సంపన్న వర్గాల ఆధిపత్యం నుంచీ, కుల వ్యవస్థ పట్టు నుంచీ, మూఢ విశ్వాసాల నుంచీ, సామాజిక దురన్యాయాల నుంచీ విడివడిన కుల రహిత సామాజిక వ్యవస్థ నిర్మాణాన్ని ఆశించారు. అందువల్లే వ్యవసాయ రంగంలోని పేద రైతాంగ వర్గాలనూ, సామాజికంగా వెనుకబడిన, నిరక్ష్యానికి గురైన వర్గాలనూ ఆకర్షించగలిగారు. అయితే అప్పటికి కుల వర్గ విభేదాలనూ, దౌర్జన్యాలనూ, హింసాకాండనూ బలంగా ఎదురొడ్డి, అగ్రకుల పెత్తనాలకు వ్యతిరేకంగా నిలబడగల బలవత్తర ఉద్యమాలు లేకపోవడంవల్ల... దళిత, బహుజన, పేద వర్గాలు మితవాద రాజకీ యాల వైపు ఆకర్షితులవుతూ వచ్చిన ఉదాహరణలూ ఎన్నో అని ప్రొఫెసర్ హరీష్ వాంఖడే (జేఎన్‌యూ ప్రొఫెసర్) అభిప్రాయం. ఆ మాటకొస్తే అప్పుడే కాదు, ఇప్పటి వర్తమాన రాజకీయాల లోనూ ఇదే పరిస్థితి. వామపక్షాల మధ్య ఐక్యత, ఏకవాక్యత కొరవడిన ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాలు పలు అన్యాయాలకూ, దాష్టీకాలకూ బలి కావలసి వస్తున్న సత్యాన్ని గుర్తించాలి. ఈ రోజుకీ భూమి తగాదాల మిషపైన ఆదివాసీ మహిళల పైన దాడులు జరుగుతున్నాయి. ఒక ఆదివాసీ మహిళనుగానీ, పురుషుడినిగానీ దేశ రాష్ట్రపతి స్థానంలో ఒక పాలకవర్గ పార్టీ కూర్చోబెట్టినంత మాత్రాన ఏ ప్రయోజనమూ లేదు. ‘స్టాంపు డ్యూటీ’తో నిమిత్తం లేకుండా, కేవలం ‘రబ్బర్ స్టాంప్’గా రాష్ట్రపతి ఉన్నంతకాలం దేశానికీ, ప్రజలకూ ఒరిగేదేమీ ఉండదు. బీజేపీకి చెందిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ హయాంలో, లక్నోలోని 140 ఏళ్ల చరిత్రగల ఒక హయ్యర్ సెకండరీ స్కూలు, కళాశాల ఉన్నట్టుండి అంతర్ధానమై, వాటి స్థానంలో ఒక ప్రైవేట్ స్కూలు వెలిసింది. దాంతో విద్యార్థులు పాఠాలన్నీ రోడ్డుపైనే నేర్చుకోవలసిన గతి పట్టింది. స్కూలు పేరు మారిపోయింది. స్కూలు లోకి విద్యార్థుల్నీ, ఉపాధ్యాయుల్నీ రానివ్వలేదు. వందలాదిమంది ఆ బడి పిల్లలు గేటు బయటే కూర్చునివుంటే, రోడ్డుమీదనే టీచర్లు పాఠాలు చెప్పాల్సిన గతి పట్టింది. ‘పేరు ధర్మరాజు, పెను వేప విత్తయా’ అన్నట్టు ప్రసిద్ధ చరిత్ర గల ఆ పాఠశాలకు బీజేపీ పాలకులు ఎందుకు ఆ గతి పట్టించారంటే – లక్నోలో ప్రసిద్ధికెక్కిన ఆదర్శ విద్యావేత్త రెవరెండ్ జేహెచ్ మెస్మోర్ ఆ పాఠశాలను నెలకొల్పి ఉండటమే! అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి హెచ్.పి. సందేశ్ అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ)ను విమర్శిస్తూ, అవినీతికి పాల్పడిన ఒక అధికారిని శిక్షించాలని ఆదేశించారు. అయితే నిజాయితీపరుడైన న్యాయమూర్తి సందేశ్‌కు దక్కిన ప్రతిఫలం – బదిలీ ఉత్తర్వులు! బదిలీకి సిద్ధంగా ఉన్నానని సందేశ్ ప్రత్యుత్తరమిచ్చారు. ఈ సంద ర్భంగా, ఏసీబీ తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నిస్తూ సందేశ్ చేసిన ప్రకటన దిమ్మ తిరిగిపోయేలా ఉంది: ‘‘ఇంతకూ మీరు ప్రజల ప్రయోజనాల్ని రక్షిస్తున్నారా లేక అవినీతితో గబ్బు పట్టిపోయిన అధికారుల్ని కాపాడుతున్నారా? ఈ నల్ల కోట్లు ఉన్నవి అవినీతిపరుల్ని రక్షించడానికి కాదు. లంచగొండితనం, అవినీతి క్యాన్సర్ వ్యాధిగా తయారైంది. ఈ వ్యాధి ఇక ఆఖరి దశ వరకూ పాకడానికి వీల్లేదు’’ అని హెచ్చరించారు. ఇక గుజరాత్ అల్లర్లానంతరం నరేంద్ర మోదీని ఒకప్పుడు సుప్రీంకోర్టు ‘నయా నీరో’గా విమర్శించింది. కానీ, అదే గుజరాత్ కేసులో మోదీకి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం’ ఇచ్చిన ‘క్లీన్ చిట్’ సరైనదేనంటూ సుప్రీం ఇటీవల చెప్పడం మరో చిత్రమైన ట్విస్టు. కాగా, ఈ సందర్భంగా 92 మంది సుప్రసిద్ధులతో కూడిన రాజ్యాంగ పరిరక్షణా మండలి ఒక ప్రకటన విడుదల చేసింది: ‘‘ఇంతకూ 2002 నాటి గుజరాత్ ఊచకోతలపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికలు, నాటి సుప్రీంకోర్టు ప్రత్యేక సలహాదారైన ప్రసిద్ధ న్యాయ వాది రాజు రామచంద్రన్ సమర్పించిన ప్రత్యేక నివేదిక ఏమైనట్టు?’’ అని రాజ్యాంగ పరిరక్షణ మండలి ప్రశ్నించింది. ఈ 92 మంది ఉద్దండులలో సమాచార శాఖ మాజీ కమిషనర్ హబీబుల్లా, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సునీల్ మిత్రా, హోంశాఖ మాజీ కార్య దర్శి జి.కె. పిళ్ళై, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్, తదితర పెక్కుమంది మాజీ ప్రధాన కార్యదర్శులూ, రిటైర్డ్ రాష్ట్ర పోలీస్ అధికారులూ ఉన్నారు. ఆ ప్రకటనలో వారిలా పేర్కొ న్నారు: ‘‘జీవించే హక్కును, పౌర స్వేచ్ఛను హరించే ప్రభుత్వ చర్యలను ప్రశ్నించి, వాటిని కాపాడుకోవడం పౌరుల విధి.’’ అందుకే ‘మౌనం’ అనేది ఒక్కో సందర్భంలో మంచికి దోహదం చేయొచ్చు. ఇంకొన్ని చోట్ల ఆ లక్షణమే మానవుడి ఉనికికే ప్రమాదభరితం కావొచ్చు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పన్నీర్ సెల్వం కీలక వ్యాఖ్యలు; అన్నాడీఎంకేలో కలకలం
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే అవకాశముందా?.. తమిళనాడు రాజకీయాల్లో తాజాగా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అన్నాడీఎంకే కన్వీనర్ పన్నీర్ సెల్వం చేసిన తాజా వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. చేసిన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం కోరిన వారిని క్షమించాలని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు శశికళను ఉద్దేశించి చేశారని ప్రచారం మొదలైంది. అయితే శశికళను క్షమించేది లేదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. చెన్నైలోని లిటిల్ సిస్టర్స్ వృద్ధాశ్రమంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పార్టీ కో–కన్వీనర్ ఎడపాడి పళనిస్వామితో కలిసి పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షమాగుణమే మంచి నాయకత్వానికి నిదర్శనమని పేర్కొంటూ ఒక చిన్న కథ చెప్పారు. అయితే శశికళను ఇరుకున పెట్టేందుకే పన్నీర్ సెల్వం ఇలా మాట్లాడారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మాజీ మంత్రి జయకుమార్ స్పందిస్తూ.. ‘శశికళ లేకుండా అన్నాడీఎంకే పార్టీ బాగా నడుస్తోంది. ఆమెను క్షమించే ప్రసక్తే లేదు. పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు శశికళకు వర్తించవు’ అని స్పష్టం చేశారు. (చదవండి: ఎన్నికలొస్తున్నాయిగా.. మీకోసమే ఐయామ్.. వెయిటింగ్) శశికళపై పోలీసులకు ఫిర్యాదు ఇప్పటికీ అన్నాడీఎంకే నాయకురాలినని చెప్పుకుంటున్నారని శశికళపై పోలీసులకు జయకుమార్ ఫిర్యాదు చేశారు. పార్టీతో ఆమె ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ శశికళ తన అధికారిక ప్రకటనలలో 'ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ'ని ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై పన్నీర్‌సెల్వం ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. గత అక్టోబర్‌లోనూ శశికళపై అన్నాడీఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఎన్నికలుంటే ఇలా.. లేకుంటే అలా!) -
శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోబోం: ఏఐఏడీఎంకే
కృష్ణగిరి: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, బహిష్కృత నేత వీకే శశికళను తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిం చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపిం చింది. ఏఐఏడీఎంకేను తిరిగి గుప్పిట్లోకి తెచ్చు కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ మేరకు సోమ వారం ఆ పార్టీ నాయకత్వం స్పందించింది. ఎట్టి పరిస్థితు ల్లోనూ శశికళను తిరిగి ఏఐఏడీఎంలోకి రానివ్వ బోమని, పార్టీ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ కో ఆర్డినేటర్ మునుస్వామి స్పష్టం చేశారు. ‘శశికళకు ఏఐఏడీఎంకేతో ఎలాంటి సంబంధం లేదు, ఆమె పార్టీకి చెందిన వ్యక్తి కాదు’ అని మునుస్వామి తేల్చిచెప్పారు. పార్టీ కేడర్ దృష్టి మరల్చి, వారిలో అయోమయం సృష్టించేందుకు శశికళ సాగిస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవన్నారు. పార్టీకి చెందిన ఏ ఒక్క నేత కూడా ఆమెతో ఫోన్లో మాట్లాడలేద న్నారు. ఒక్క కార్యకర్త కూడా ఆమె వలలో చిక్కుకోరని తెలిపారు. ఏఐఏండీఎంకేపై తిరిగి పట్టు సాధిస్తానంటూ శశికళ తన అనుయా యులతో అన్నట్లుగా ఉన్న ఆడియో క్లిప్పింగులు ఆదివారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: (పార్టీ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోలేను.. త్వరలోనే వస్తా!) -
VK Sasikala: పార్టీ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోలేను.. త్వరలోనే వస్తా!
చెన్నై: దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు అందించారు. గతంలో ఏఐఏడీ ఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆమె ఆ పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. త్వరలోనే మంచి నిర్ణయం ప్రకటిస్తానంటూ తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలతో పేర్కొనడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక లకు ముందు శశికళ..అంతర్గతపోరు కారణంగా పార్టీ నాశనమైపోవడం తాను చూడలేననీ, రాజకీ యాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించారు. ఆమె ఆ సమయంలో స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ, ఏఐఏడీఎంకే నాయకత్వం కోసం అగ్ర నేతలు పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య విభేదాల గురించేనని స్పష్టమైంది. తాజాగా, శశికళ తన అనుయాయులైన ఇద్దరు నేతలతో చేసిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్పులు చర్చనీయాంశంగా మారాయి. మొదటి వీడియోలో శశికళ ‘పార్టీని కచ్చితంగా గాడిలో పెడదాం, నేను తప్పక వస్తాను’అని అన్నట్లుగా ఉంది. రెండో ఆడియోలో ఏఐఏడీఎంకేను ఉద్దేశించి.. ‘నాతోపాటు అనేక మంది నేతల కృషితోనే పార్టీ ఏర్పడింది. ఆ ఇద్దరి మధ్య పోరుతో పార్టీ నాశనమై పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. కరోనా వేవ్ తగ్గాక మద్దతుదారులతో మాట్లాడతా. ఆందోళన వద్దు. త్వరలోనే వస్తా. పార్టీని బలోపేతం చేస్తా్త’అని శశికళ అన్నట్లుగా ఉంది. ఈ ఆడియో క్లిప్పులు చర్చనీయాంశమయ్యాయి. శశికళ ఏఐఏ డీఎంకేపై మళ్లీ పట్టుబిగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తానంటూ సంకేతాలు ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు. జయలలిత మరణా నంతరం 2016లో శశికళ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి అయ్యారు. అక్రమాస్తుల కేసులో 2017 ఫిబ్రవరిలో అరెస్టయి జైలుకు వెళ్లిన శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ పార్టీపై పట్టు కోల్పోయారు. -
విజయ్ రాజకీయాల్లోకి రావడం తథ్యం..
సాక్షి, పెరంబూరు: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు స్టార్ నటుల చుట్టూ తిరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. అంతే కాదు ఈ స్టార్లతోనూ ఇతర పార్టీలకు చెక్ పెట్టాలని ద్రవిడ పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే పార్టీ నాయకులు వ్యూహ రచన చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మరో ఏడాదిలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేనే మళ్లీ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఈ సారి అధికారంలోకి రావడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. కాగా ప్రస్తుతం ఆ పార్టీతో పొత్తు కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. అందుకు నటుడు విజయ్‌ని పార్టీలో చేర్చుకునే విధంగా పావులను కదుపుతోంది. ఇక నటుడు కమల్‌హాసన్ సొంతంగా మక్కళ్ నీది మయ్యం పార్టీని ప్రారంభించి ఆ మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశాజనక ఓట్లను సంపాదించుకుని రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు రజనీకాంత్ కొత్తగా పార్టీని ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన రానున్న శాసనసభ ఎన్నికలపైనే గురిపెడుతున్నారు. రాష్ట్రంలోని 234 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తానని రజనీకాంత్ ఆరంభంలోనే వెల్లడించారన్నది గమనార్హం. కాగా ఈయన బీజేపీ మద్దతుదారుడిగా ముద్ర వేసుకున్నారనే ప్రచారం బాగానే జరుగుతోంది. చదవండి: విజయ్ పార్టీని ప్రారంభిస్తే వారికే లాభం.. విజయ్‌కి స్వాగతం కాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నటుడు విజయ్‌ని తమ పార్టీలోకి లాగాడానికి ప్రయత్నాలను ఇప్పటికే మొదలెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు విజయ్ అన్నాడీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వాటికి అన్నాడీఎంకే నాయకులు గట్టిగానే బదులిచ్చారు. అప్పుడు కాంగ్రెస్ నాయకులు విజయ్‌కి మద్దతుగా నిలిచారు. కాగా ఇటీవల విజయ్ ఇళ్లల్లో ఐటీ సోదాలు జరిగినప్పుడూ కాంగ్రెస్ నాయకులు ఆ సోదాలను ఖండించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్.అళగిరి రజనీకాంత్ విషయంలో రాయితీలు ఇచ్చిన ఆదాయపన్నుశాఖ నటుడు విజయ్‌కు ఒక్క రోజు కూడా సమయం ఇవ్వకుండా సోదాలు నిర్వహించడం ఏమిటని, రజనీకి ఒక న్యాయం, విజయ్‌కు ఒక న్యాయమా అని ప్రశ్నంచారు. చదవండి: రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేను.. దీంతో శుక్రవారం నటుడు విజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారా అని ఆ పార్టీ అధ్యక్షుడు కేఎస్.అళగిరిని మీడియా ప్రశ్నంచగా విజయ్ తమ పార్టీలో చేరతానంటే సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. అయితే ఆయన్ని పార్టీలో చేరమని కోరలేదని అన్నారు. కాగా 2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో నటుడు రజనీకాంత్‌కు పోటీగా విజయ్ను దింపడానికి వ్యూహం జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ త్వరలో పార్టీని ప్రారంభించి రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈయన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు సవాల్‌గా మారతారనే భావన వ్యక్తం అవుతోంది. దీంతో ఆయనకు వ్యతిరేకంగా నటుడు విజయ్ను రంగంలోకి దింపితే రాష్ట్రంలో యథాతథంగా ద్రావిడ పార్టీలైన అన్నాడీఎంకే గానీ, డీఎంకే గానీ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చుననే వ్యూహం జరుగుతున్నట్లు తెలిస్తోంది. అదే విధంగా రజనీకాంత్‌కు కాషాయ ముద్ర వేసి, నటుడు విజయ్ బీజేపీకి వ్యతిరేకి అని ప్రచారం చేస్తే రజనీకాంత్‌ను సులభంగా ఓడించవచ్చుననే పథకాన్ని రచిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా ఇప్పటికే డీఎంకే వర్గం నటుడు విజయ్ను తమ పార్టీలోకి లాగడానికి ప్రయత్నించినట్లు ప్రచారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విజయ్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారా? ఇవన్నీ కాకుండా తనే సొంతంగా పార్టీని పెడతారా? ప్రస్తుతానికి మౌనంగా ఉంటారా? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయ్ రాజకీయాల్లోకి రావడం తథ్యం.. కాగా విజయ్ రాజకీయ రంగప్రవేశం గురించి సందిగ్ధత నెలకొన్న పరిస్థితిలో ఆయన తండ్రి, దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ కుమారుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం తథ్యం అని ప్రకటించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విజయ్‌కి వ్యతిరేకంగా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సినిమాల్లో చెప్పినట్లుగానే ప్రజలకోసం పనిచేస్తారని అన్నారు. ఇంతకుముందు రజనీకాంత్, కమలహాసన్‌లకు మద్దతు తెలిపినందుకు ఇప్పుడు చింతిస్తున్నానని పేర్కొన్నారు. వారు రాజకీయాల్లోకి వస్తే తమిళనాడుకు మంచి జరుగుతుందని భావించానని, అయితే రజనీకాంత్ తమిళ ప్రజలను మోసం చేస్తున్నారని ఇప్పుడు తనకు అనిపిస్తోందన్నారు. తూత్తుక్కుడిలో పోలీసుల తుపాకీ గుళ్లకు బలైనవారిని రజనీకాంత్ సంఘవిద్రోహులుగా చిత్రీకరించి మాట్లాడారని,తమిళ ప్రజలు వ్యతిరేకిస్తున్న పౌరహక్కుల చట్టం బిల్లుకు ఆయన మద్దతు పలికారని, దీన్ని ఎవరూ అంగీకరించరని దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ అన్నారు. -
కాంగ్రెస్‌తో పొత్తా.. ఇప్పుడే చెప్పలేను!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడంపై ఇప్పుడే చెప్పలేనని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్ అన్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న తరువాత కమల్ మీడియాతో మాట్లాడారు. పొత్తు అంశాన్ని కాంగ్రెస్ అగ్ర నేతల వద్ద ప్రస్తావించలేదని అన్నారు. రాజకీయాల్లో తన దారేదో తానే నిర్ణయించుకుంటానని చెప్పారు. జాతీయ రాజకీయాల గురించి చర్చించేందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని కలిశానని తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే విషయంపై తన పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మీడియాలో వస్తున్న ఊహాగానాలపై ఇప్పుడే ఏం మాట్లాడలేనని అన్నారు. రాహుల్, కమల్ల భేటీపై స్పందించేందుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ నిరాకరించారు. -
తమిళ రాజకీయాల్లో శూన్యాన్ని పూర్తి చేస్తాను
-
ఇక సినిమాల్లో నటించను: కమల్‌హాసన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇప్పటికే అంగీకరించిన, నిర్మాణ దశలో ఉన్న చిత్రాలు పూర్తికాగానే నటనకు స్వస్తి పలుకుతానని ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రకటించారు. ఈనెల 21న రాజకీయ పార్టీ పేరు, పతాకాన్ని ప్రకటించి తమిళనాడువ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించేందుకు ఇటీవల వెళ్లిన ఆయన అక్కడ ఒక టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ పెట్టిన తర్వాత క్రియాశీలక రాజకీయాలకు పూర్తి సమయం కేటాయిస్తానని స్పష్టంచేశారు. విడుదలకు సిద్ధమైన విశ్వరూపం–2, సెట్స్‌పై ఉన్న శభాష్ నాయుడు సినిమాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత సినిమాల్లో నటించే ఆలోచన లేదని ఆయన చెప్పారు. కమల్ తన పర్యటన వివరాలను ఈనెల 18న వెల్లడించనున్నారు. అభిమానులతో రజనీ పార్టీ ఇన్చార్జిల భేటీ ప్రముఖ నటుడు రజనీకాంత్ తన రాజకీయపార్టీ ఏర్పాటు సన్నాహాలను ముమ్మరం చేశారు. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రజనీకాంత్ అభిమాన సంఘాల జాతీయ నిర్వాహకులు సుధాకర్, రాజీవ్ మహాలింగం సంయుక్తంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు అభిమాన సంఘాల ముఖ్యనేతలతో సమావేశమవుతున్నారు. -
కమల్ బహిరంగ లేఖ.. పార్టీపై ఫుల్ క్లారిటీ!
సాక్షి, చెన్నై: త్వరలోనే రాజకీయాల్లో అడుగుపెడుతున్న సినీ నటుడు కమల్ హాసన్ వచ్చేనెల 21 నుంచి తమిళనాడు రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టబోతున్నారు. ప్రజల సుఖదుఃఖాలను, వారి అవసరాలను, స్థితగతులు తెలసుకోవడానికి, వారితో కలిసి గడపడానికి ఈ యాత్ర చేపట్టబోతున్నానని కమల్ ప్రకటించారు. తన జన్మస్థలం రామనాథపురం నుంచి యాత్రను ప్రారంభించాలనుకుంటున్నానని, ఆ తర్వాత మదురై, దిండిగల్, శివగంగై జిల్లాల్లో తన యాత్ర కొనసాగుతుందని తెలిపారు. తన యాత్ర ప్రారంభం సందర్భంగా ఫిబ్రవరి 21న పార్టీ పేరుతోపాటు విధివిధానాలు వెల్లడించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు తమిళనాడు ప్రజలకు కమల్ ఒక లేఖ రాశారు. తమిళ ప్రజలు చూపుతున్న ప్రేమ, అభిమానాలకు ప్రతిగా వారికి ఏదైనా చేసేందుకే తాను రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయాల్లో నెలకొన్న యథాతథస్థితి బద్దలుకొట్టి.. ప్రజాసంక్షేమ పాలనను తీసుకురావాల్సిన అవసరముందని, ఇందుకోసం తలపెట్టిన తన యాత్రకు ప్రజలంతా అండగా నిలిచి.. మన దేశం, రాష్ట్రం సాధికారిత దిశగా కృషి చేయాలని కోరారు. -
శత్రువుగా మారనివ్వను..!
సాక్షి, చెన్నై: తమిళ సూపర్స్టార్లు రజనీకాంత్, కమల్ హసన్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఇప్పటికే రజనీకాంత్ ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించి.. తన మద్దతుదారులు, ప్రజలు అందులో నమోదు చేసుకొని.. తనకు మద్దతు పలుకాలని పిలుపునిచ్చారు. మరోవైపు కమల్ కూడా తన మద్దతుదారులను కూడగట్టేందుకు ఓ యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నాయకులుగా కొత్త అవతారం ఎత్తబోతున్న రజనీ, కమల్ ఎప్పటికీ చేతలు కలిపే అవకాశం లేదని, వారు రాజకీయాల్లో ప్రత్యర్థులుగానే కొనసాగవచ్చునని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ తాజాగా రాసిన ఓ వ్యాసంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తన రాజకీయ ప్రస్తానంలో స్నేహితులను శత్రువులుగా మార్చుకోబోనని, నిందా రాజకీయాలకు పాల్పడి.. రాజకీయ అందలం కోసం ప్రయత్నించబోనని కమల్ పేర్కొన్నారు. ఆ రకమైన రాజకీయాలు తన మార్గం కాదని, అవి ప్రజలకు కూడా నచ్చవని కమల్ అన్నారు. జనవరిలో యాప్ విడుదల చేస్తానని చెప్పిన కమల్ ఇప్పటివరకు దానిని ఆవిష్కరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ.. చాలా ఆచితూచి ప్రజలకు అనుసంధానమయ్యేలా యాప్‌ను తీసుకొస్తున్నానని, త్వరలోనే యాప్‌ను విడుదల చేస్తామని తెలిపారు. -
కరుణతో ప్రధాని భేటీ
సాక్షి, చెన్నై: చెన్నై పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ డీఎంకే అధినేత కరుణానిధిని ప్రత్యేకంగా కలిశారు. సోమవారం మధ్యాహ్నం చెన్నై గోపాలపురంలోని కరుణ నివాసానికి వెళ్లిన మోదీ ఆయనను పరామర్శించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపింది. 2014 ఎన్నికల అనంతరం ఈ ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి. చెన్నైలో మోదీ రెండు కార్యక్రమాల్లో పాల్గొంటారని సోమవారం బీజేపీ ప్రకటించింది. కరుణను కలుస్తారని కాసేపటికి బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు ట్వీట్ చేశారు. మధ్యాహ్నం కరుణ నివాసానికి మోదీ చేరుకోగానే డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, ఎంపీ కనిమొళి, సీనియర్ నేత దురై మురుగన్ ఆహ్వానం పలికారు. మోదీ లోపలికి వెళ్లి కరుణానిధిని పలకరించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మోదీకి పుస్తకాన్ని కరుణ కానుకగా ఇచ్చారు. దాదాపు 20 నిమిషాలు ప్రధాని అక్కడ గడిపారు. ‘తమిళనాడు మాజీ సీఎం ఎం.కరుణానిధిని కలిసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశాను’ అని తర్వాత ట్వీటర్లో మోదీ వెల్లడించారు. భారత రాజకీయాల్లో కరుణానిధి చాలా సీనియర్ నేతని, ఆయన పట్ల మోదీకి చాలా గౌరవం ఉందని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ పేర్కొన్నారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, గతంలో ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడూ సమావేశాల్లో పలకరించుకునేవారని ఆయన పేర్కొన్నారు. ‘కరుణానిధిని ప్రధాని మోదీ మర్యాద పూర్వకంగా కలిసి ఆరోగ్యం గురించి వాకబు చేయడంతో పాటు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు’ అని తన ట్విటర్ పేజీలో స్టాలిన్ పేర్కొన్నారు. ఈ భేటీ గురించి స్టాలిన్‌కు ముందుగానే తెలుసని, అందుకే దుబాయ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని ఆయన చెన్నైకి హుటాహుటిన వచ్చినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తమిళనాట అన్నాడీఎంకేకు పట్టు తగ్గిందని, తదుపరి ఏ ఎన్నికలు వచ్చినా డీఎంకేదే ఆధిపత్యమని.. ఈ నేపథ్యంలో మోదీ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్దిరోజుల్లో అవినీతి కేసుల్లో డీఎంకే నేతలపై తీర్పు వెలువడనున్న వేళ.. ఈ భేటీపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. -
రాజ్‌నాథ్‌తో తమిళనాడు గవర్నర్ భేటీ
-
రాజ్‌నాథ్‌తో తమిళనాడు గవర్నర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు మరోసారి భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం ఇక్కడ జరిగిన ఈ సమావేశంలో మిళనాడు రాజకీయలపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కాయి. ఈ నేపథ్యంలో విద్యాసాగర్‌రావు నిన్న కూడా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోంమంత్రితో వేర్వేరుగా సమావేశం అయిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ విశ్వాస పరీక్షకు అనుమతిస్తే.. ముఖ్యమంత్రి పళనిస్వామి మరోసారి సీఎంగా నెగ్గటం సులువే. మొత్తం 233 మంది ఎమ్మెల్యేలున్న ప్రస్తుత తమిళ అసెంబ్లీలో (జయ మరణంతో ఆర్కేనగర్ ఖాళీగా ఉంది) విజయానికి 117 సీట్లు అవసరం. అయితే.. పళనిస్వామి వర్గంలో 113 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మిత్రపక్షాలున్నారు. ఈ నేపథ్యంలో 18మందిపై అనర్హత వేటు పడితే.. 215 సభ్యులు మాత్రమే విశ్వాస పరీక్షలో పాల్గొంటారు. అప్పుడు గెలిచేందుకు 109 సీట్లు అవసరం. ఈ మేజిక్ ఫిగర్‌ను సీఎం వర్గం సులభంగానే చేరుకుంటుంది. అయితే.. రెండ్రోజుల్లో ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
-
18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం తలెత్తింది. రాజకీయ ఉత్కంఠకు తెరదించే విధంగా బల పరీక్ష విషయంలో గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతుందోనని ఎదురు చూపులు చూడగా చివరికి దినకరన్ వర్గానికి స్పీకర్ భారీ షాకిచ్చారు. అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి దినకరన్ వర్గానికి చెందిన 18 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. సీఎం పళని స్వామిపై తిరుగుబావుట ఎగురవేసిన ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ సోమవారం ప్రకటించారు. దీంతో దినకరన్ వర్గానికి ఏం చేయాలో మింగుడు పడటం లేదు. తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్‌రావు నేడు చెన్నైకి రానున్న నేపథ్యంలో స్పీకర్ ధనపాల్ ఈ నిర్ణయం తీసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ధనపాల్ నిర్ణయాన్ని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. తమపై అనర్హత వేటు వేయడం అన్యాయమని, దీనిపై తాము హైకోర్టుకు వెళతామని తెలిపారు. మరోవైపు గవర్నర్ బల పరీక్షకు ఆదేశిస్తే, ఇరాకాటంలో పడుతామన్న ఆందోళనతో సీఎం పళని స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తమపై తిరుగుబాటు చేస్తున్న వారిపై అనర్హత వేటు పడేలా పావులు కదిపింది. మైనారిటీ ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో దినకరన్ వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డీఎంకే సభ్యులకూ అనర్హత టెన్షన్..! దినకరన్ వర్గం ఎమ్మెల్యేలతో పాటు డీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. అసెంబ్లీలో సాగిన గుట్కా వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే సభ్యులు 21 మందిని సస్పెండ్ చేయడానికి పళనిస్వామి వర్గం తగ్గ కార్యాచరణ సిద్ధం చేసి, సభా హక్కుల సంఘం ద్వారా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు సైతం ఇప్పించారు. గుట్కా వ్యవహారం కోర్టులో విచారణలో ఉండడం, ఇప్పటికే నిషేధిత వస్తువులపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉండటాన్ని అస్త్రంగా చేసుకుని నోటీసు రద్దుకు డీఎంకే సభ్యులు హైకోర్టు తలుపు తట్టడంతో సస్పెన్షన్ వేటు నుంచి ఇటీవల తాత్కాలిక ఊరట లభించింది. ఏ సమయంలోనైనా స్పీకర్ వారిపై వేటు వేసే అవకాశాలున్నాయి. -
అత్తారింటికి వెళ్లేదెవరో!
నేతల మధ్య మాటల తూటాలు.. సవాళ్లు ప్రతి సవాళ్లు సీఎం హెచ్చరిక, విరుచుకుపడ్డ మంత్రులు ఎదురుదాడిలో దినకరన్ అత్తారింటికి వెళ్లేది నువ్వంటే.. నువ్వే నంటూ అన్నాడీఎంకే గ్రూపుల మధ్య శనివారం మాటల తూటాలు పేలాయి. మళ్లీ జైలుకు వెళ్తావంటూ సీఎం పళని స్వామి దినకరన్‌కు హెచ్చరిక చేశారు. అమ్మ జయలలిత మరణానికి ప్రధాన కారకురాలు చిన్నమ్మ శశికళ అని మంత్రులు విరుచుకు పడ్డారు. తానేమీ తక్కువ తిన్నానా..? అంటూ దినకరన్ ఎదురుదాడికి దిగారు. శాశ్వతంగా ఇంటికి.. ఆ తదుపరి అత్తారింటికి వెళ్లబోయేదెవరో మరి కొద్దిరోజుల్లో తేలుతుందని హెచ్చరించారు. సాక్షి, చెన్నై : సీఎం పళని స్వామిని ఇరకాటంలో పెట్టే రీతిలో, ప్రభుత్వాన్ని కూల్చేందుకు తగ్గ ప్రయత్నాల్ని దినకరన్ వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయన్ను గురిపెట్టి పాలకులు తీవ్రంగా స్పందించే ప నిలో పడ్డారు. సీఎం పళని స్వామి మొదలు, మంత్రుల వరకు శనివారం దినకరన్‌ను గురిపెట్టి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. చిన్నమ్మ శశికళ కుటుంబంపై దుమ్మెత్తి పోశారు. అమ్మ మరణానికి ప్రధాన కారకురాలు శశికళ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. అత్తారింటికి దినకరన్ వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. అత్తారిళ్లు(జైలు) తనకు కొత్త కాదని, ఇక, వెళ్లబోయేదెవరో వెయిట్ అండ్ సీ.. అని దినకరన్ ఎదురుదాడికి దిగారు. సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య పళని, దినకరన్ శిబిరాల మాటల తూటాలు పేలడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ మొదలైంది. మళ్లీ జైలుకెళ్లడం ఖాయం.. సీఎం పళని స్వామి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, దినకరన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, అందర్నీ తొలగిస్తున్న దినకరన్, అమ్మ జయ లలిత బతికి ఉండి ఉంటే, ఆమె కూడా పదవి నుంచి తొలగించి ఉండే వాడేమోనని మండిపడ్డారు. అమ్మ కన్నెర్ర చేయడంతో పది సంవత్సరాలు వనవాసంలో ఉన్న దినకరన్, ఇప్పుడు అమ్మ లేని దృష్ట్యా, జబ్బలు చరుస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆయన బెదిరింపులు, హెచ్చరికలకు ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. అమ్మ జయలలిత ఆశీస్సులతో తాను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యానని పేర్కొంటూ, దినక రన్ లాంటి కపట నాటక దారుడ్ని నమ్మే స్థితిలో అన్నాడీఎంకే కేడర్ లేదని ధీమా వ్యక్తంచేశారు. అమ్మ ఆత్మ ఎన్నడూ క్షమించదని, దినకరన్ అండ్ బృందానికి గుణపాఠం తథ్యమని హెచ్చరించారు. అమ్మ మరణానికి చిన్నమ్మే కారణం దిండుగల్, తిరుచ్చి, తంజావూరుల్లో జరిగిన వివిధ కార్యక్రమల్లో మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, వెల్ల మండి నటరాజన్, ఓఎస్ మణియన్, బెంజమిన్, ఎంపీలు తంబిదురై, వైద్యలిం గం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. దినకరన్, శశికళను గురిపెట్టి తీవ్రంగానే స్పందించారు. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు దిగారు. దిండుగల్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, అమ్మ రోగం తీ వ్రత పెరగడంతో, చివరకు సహజ మరణంగా రూపొందించారని ఆరోపించారు. అమ్మను చూసేందుకు ఎవరినీ అనుమతించకుండా శశికళ అడ్డుకున్నారని, అమ్మ మరణానికి ప్రధాన కారకురాలు చిన్నమ్మేనని ఆరోపించారు. అందుకే ఆ కుటుంబాన్ని సాగనంపడం లక్ష్యంగా తమ ప్రభుత్వం, పార్టీ ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు. వెల్లమండి నటరాజన్ స్పందిస్తూ, జయలలిత ఆరోగ్యంపై పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ఉన్నారని, చిన్నమ్మ శశికళ దగ్గరుండి మరీ అమ్మ ఆరోగ్యం క్షీణించేందుకు ప్రధాన కారకురాలు అయ్యారని ఆరోపించారు. ఓఎస్ మణియన్ పేర్కొంటూ, దినకరన్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని, త్వరలో సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఖాయం అని హెచ్చరించారు. అదే సమయంలో చిన్నమ్మ శశికళ విషయంగా, ఆమెను వదులుకునే పరిస్థితి ఉండబోదని స్పందించారు. బెంజమిన్ వ్యాఖ్యానిస్తూ, ద్రోహులకు గుణపాఠం నేర్పే రోజు సమీపించిందని హెచ్చరించారు. ఎంపీ వైద్యలింగం మాట్లాడుతూ, దినకరన్ లాంటి వ్యక్తుల కాకమ్మ బెదిరింపులకు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అవసరం అయితే, మెజారిటీ నిరూపించుకుని ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామన్నారు. తంబిదురై వ్యాఖ్యానిస్తూ, అన్నాడీఎంకే సర్కారును కూల్చడం, ఆ పార్టీని నిర్వీర్యం చేయడం ఎవరితరమూ కాదన్నారు. దినకరన్ ఎదురుదాడి తన మీద ఆరోపణలు, విమర్శనాస్త్రాల్ని ఎక్కుబెట్టడంతో దినకరన్ ఎదురు దాడికి దిగారు. అడయార్‌లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. త్వరలో ఈ మంత్రులు అందరూ శాశ్వతంగా ఇంటికి వెళ్లబోతున్నారని పేర్కొన్నారు. శశికళకు పళనిస్వామి తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. అమ్మ ఆశయాలకు తూట్లు పెట్టే విధంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉప్పు తిన్న వాడు నీళ్లు తాగక తప్పదని, తిన్నింటి వాసాలు లెక్కించే పళని స్వామి అండ్ బృందం త్వరలో అత్తారింటికి వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. తనకు అత్తారిళ్లు కొత్త కాదని, అయితే, ఇక వెళ్లబోయే వాళ్లకే కొత్త అని వ్యాఖ్యానించారు. తన మీద విదేశీ మారక ద్రవ్యం కేసు మాత్రమే ఉందని పేర్కొంటూ, సీఎం, మంత్రుల వలేæ తాను అవినీతికి పాల్పడ లేదని, ప్రజాధనాన్ని దోచుకోలేదన్నారు. ప్రజా ధనాన్ని కోట్లు కోట్లుగా దోచి దాచి పెట్టుకుంటున్న వాళ్లకు అత్తా రిళ్లు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉందని, ఎవరెవరు వెళ్లబోతున్నారో వేచి చూడంటూ ముగించారు. బెంగళూరుకు దినకరన్ మాటల తూటాలు ఓ వైపు సాగుతుంటే, మరోవైపు తన మద్దతు ఎమ్మెల్యేలతో భేటీకి దినకరన్ నిర్ణయించారు. మైసూరు సమీపంలోని ఓ రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేల్ని కలుసుకునేందుకు సిద్ధం అయ్యారు. 20వ తేదీన ఆయన బెంగళూరు మీదుగా మైసూర్‌కు పయనం కానున్నారు. అలాగే, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ చేతిలో ఉన్న మత్స్యకారులకు సంబంధించిన సంఘం పదవిని ఊడగొట్టారు. ఇక, ఈ శిబిరంలో ఉన్న అంబూర్ ఎమ్మెల్యే బాలసుబ్రమణియన్ తాను అజ్ఞాతంలో లేనని, నియోజకవర్గ ప్రజలతో సంప్రదింపుల్లో ఉన్నట్టుగా మీడియా ముందుకు వ్యాఖ్యానించారు. ఇక, తమ నాయకుడ్ని గురిపెట్టి మంత్రులు, సీఎం స్వరం పెంచడంతో దినకరన్ మద్దతు ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ ఎదురుదాడికి దిగుతూ, దమ్ముంటే బల పరీక్షకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ రెండు శిబిరాల సమరంపై ద్రవిడ కళగంనేత వీరమణి స్పందిస్తూ, ఆత్మలు, కాషాయంలతోనే పాలకుల సంప్రదింపులు అని ఎద్దేవా చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ అయితే, పరస్పరం విమర్శలు, ఆరోపణలతో ముందుకు సాగుతున్న వాళ్లను శాశ్వతంగా సాగనంపేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారని వ్యాఖ్యానించారు. -
19 ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు విజ్ఞప్తి
చెన్నై: తమిళ రాజకీయం గంటకో మలుపు తిరుగుతోంది. పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు శశికళ, దినకరన్ వర్గం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం తంటాలు పడుతోంది. దినకరన్ వెంట ఉన్న 19 మంది తిరుగుబాబు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రభుత్వ చీఫ్ విప్ రాజేంద్రన్ గురువారం శాసనసభ స్పీకర్‌కు పి ధనపాల్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై దినకరన్ వర్గం స్పందించింది. చీఫ్ విప్ ప్రతిపాదనపై కోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వం తెలిపారు. ముఖ్యమంత్రి పళనిస్వామిని మార్చాలని మాత్రమే తాము కోరుతున్నామన్నారు. దినకరన్‌కు సీఎం పదవిపై ఆశలేదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన పార్టీని నడపడం లేదని ఎమ్మెల్యే వట్రివేల్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంను కూడా పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వీరిద్దరినీ తప్పించి వేరెవరికి పదవులు అప్పగించినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కొంత మంది అవినీతి మంత్రులను కూడా తప్పించాల్సిన అవసరముందన్నారు. బలపరీక్షలో పళనిస్వామి సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. కాగా, పుదుచ్చేరి రిసార్ట్‌లో ఉన్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. -
దినకరన్ సేఫ్.. అందుకే?
చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో పన్నీర్ సెల్వం వర్గం విలీనం పూర్తయింది. శశికళ, దినకరన్ భవితవ్యంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. వీరిద్దరినీ పార్టీ నుంచి గెంటేయ్యాలని విలీన చర్చల సందర్భంగా ఓపీఎస్ వర్గం గట్టిగా పట్టుబట్టింది. అయితే దినకరన్‌ను పార్టీ నుంచి వెలి వేయకూడదన్న ఆలోచనలో ముఖ్యమంత్రి పళనిస్వామి ఉన్నట్టు తెలుస్తోంది. దినకరన్‌పై వేటు వేస్తే తన పదవికి ముప్పు వచ్చే అవకాశం ఉన్నందున్న ఈ విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనబడుతోంది. ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల మధ్య విలీన చర్చలు తుదిదశకు వచ్చినప్పుడు దినకరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి గెంటేస్తే పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వెనుకాడబోనని పరోక్షంగా వ్యాఖ్యనించారు. అంతేకాదు తన మద్దతుగా ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో మదురైలో ర్యాలీ కూడా నిర్వహించారు. ఒకవేళ దినకరన్‌పై వేటు వేస్తే అన్నాడీఎంకే 20 మంది ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయే అవకాశముంది. 235 మంది స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118. ఓపీఎస్ వర్గం నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి సర్కారు మద్దతుయిచ్చినా మేజిక్ ఫిగర్‌కు 3 సీట్లు తగ్గుతాయి. మరోవైపు ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష డీఎంకే నాయకుడు స్టాలిన్ ఎదురు చూస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)కు 9 మంది శాసనసభ్యులున్నారు. వీరంతా కలిస్తే విపక్ష బలం 98కి చేరుతుంది. వీరికి దినకరన్ దగ్గరున్న 20 మంది ఎమ్మెల్యేలు కలిస్తే పళనిస్వామి ప్రభుత్వం కూలడం ఖాయం. అందుకే దినకరన్‌పై వేటు వేయాలని పన్నీర్ సెల్వం వర్గం ఎంత ఒత్తిడి చేస్తున్నా పళనిస్వామి ముందడుగు వేయడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం, పార్టీలో తన పంతం నెగ్గించుకున్న పన్వీర్ సెల్వం ఏం చేస్తారనే దానిపై తమిళ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
తమిళనాట ఆ ఇద్దరు కలిస్తే అద్భుతమే!
తమిళ రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది ఆరెస్సెస్ సిద్ధాంతకర్త గురుమూర్తి న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాలకు సంబంధించి మాస్టర్‌మైండ్‌గా ఆరెస్సెస్ సిద్ధాంతకర్త స్వామినాథన్ గురుమూర్తిని పరిగణిస్తారు. రజనీకాంత్ సన్నిహిత మిత్రుడిగా, సలహాదారుగా పేరొందిన ఆయన తాజాగా సూపర్‌స్టార్ రాజకీయ ఎంట్రీపై స్పందించారు. 'రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారా?' అన్న ప్రశ్నకు తొలిసారిగా సూటిగా సమాధానమిస్తూ.. 'నా అంచనా ప్రకారం రజనీ తన సొంత రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు. జయలలిత మృతి తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శూన్యం ఆవరించింది. ఈ శూన్యాన్ని భర్తీ చేయడానికి రజనీ సరైన వ్యక్తి' అని అభిప్రాయపడ్డారు. రజనీకి బీజేపీ మద్దతునిస్తుందా? అన్న ప్రశ్నకు.. 'రజనీకాంత్‌కు తన లోపాలేమిటో తెలుసని అనుకుంటా. ఆయన, నరేంద్రమోదీ చేతులు కలుపడం నిజంగా అద్భుతమైన విషయం. ద్రవిడ రాజకీయాలతో ముందుకు సాగుతున్న తమిళనాడు రాజకీయ రాజకీయ ముఖచిత్రాన్ని ఇది పూర్తిగా మారిపోతుంది' అని చెప్పారు. బీజేపీ, రజనీకాంత్ చేతులు కలుపుతారన్న గురుమూర్తి వ్యాఖ్యలు ఇటు తమిళనాట, అటు జాతీయ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తమిళ రాజకీయాలను 'ద్రవిడ రహితంగా' (డీ-ద్రవిడనైజ్) మార్చేందుకు రజనీ రాక ఉపయోగపడుతుందని, ఇప్పటికే తమిళ రాజకీయాలు కొంతమేరకు డీ-డ్రవిడనైజ్ అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్యేలకు డబ్బులు.. కోర్టుకు విపక్షం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హైకోర్టుకు చేరింది. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రతిపక్ష డీఎంకే మంళగవారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ముడుపుల బాగోతంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో విచారణ జరిపించాలని డిఎంకే డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు శశికళ, పన్నీర్ సెల్వం భారీ మొత్తంలో డబ్బులు ముట్టచెప్పినట్టు టైమ్స్ నౌ, మూన్ టీవీ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో డీఎంకే కోర్టుకు వెళ్లింది. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం 5 గంటలకు స్టాలిన్ ఆధ్వర్యంలో సమావేశం కానున్నారు. కాగా, తనపై చేసిన ఆరోపణలు చేసిన దక్షిణ మధురై ఎమ్మెల్యే ఎస్ఎస్ శరవణన్‌ను పన్నీర్ సెల్వం వివరణ కోరారు. విశ్వాస పరీక్ష నెగ్గేందుకు పన్నీర్ సెల్వం తనకు డబ్బులు ముట్టచెప్పారని శరవణన్ ఆరోపించారు. -
ఢిల్లీ పర్యటనలోపన్నీర్ వర్గానికి నిరాశ
-
సూపర్ స్టార్ పాపులారిటీ!
తలైవా 'ఓటు'లాటరీ? రజనీకాంత్.. కర్ణాటకలో పుట్టి, బస్కండక్టర్గా పనిచేస్తూ .. ప్రయాణికులకు టికెట్లు కట్ చేస్తూ .. తమిళనాడులో ప్రేక్షకుల టికెట్లు కోయించేదాకా వచ్చాడు. ఈ టికెట్లు ఇంతటితోనే ఆగుతాయా? పార్టీ టికెట్లు ఇచ్చేవరకు పోతాయా? రజనీకాంత్ సినిమాల్లో సన్నివేశాలు, డైలాగులు తనని ఒక తలైవాగా మార్చాయి. ఎంత పాపులర్ అయ్యాడంటే షారూక్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లోని లుంగీ డాన్స్ పాటను రజనీకాంత్‌కు అంకితమిచ్చేంతగా! ఇక ఇక్కడి నుంచి చూడాల్సింది తమిళనాడు రాజకీయాల్లో ఆయన కండువా బిగిస్తాడా? లుంగీ బొడ్లోకి దోపుతాడా? అనే! దోపినా ఓట్లు రాలుతాయా? రాలవా? ఈ సినిమా సన్నివేశాలు చూసి, సినిమా పాపులారిటీ పొలిటికల్ ‘ఓటు’లాటరీగా మారుతుందా లేదా మీరే అంచనా వేయండి! ‘నాన్నా... పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది!’ ఇది ‘శివాజి’లో రజనీకాంత్ పంచ్ డైలాగ్. అన్నట్టుగానే సినిమాల్లోకి ఆయన మందీమార్బలం ప్రోద్బలంతో రాలేదు. సింహంలా సింగిల్‌గానే ఎంట్రీ ఇచ్చారు. విజయం సాధించారు. సూపర్‌స్టార్ అయ్యారు. ఆ పాపులారిటియే రాజకీయాల్లోనూ ఆయన ప్రెజెన్స్ ఉండాలని ఆశ పడుతోంది. మరి, ‘అతిగా ఆశపడ్డ మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అని రజనీయే అన్నారు ‘నరసింహ’లో. రాజకీయాల ఆశ ఆయనది కాదు ఆయన ఫ్యాన్స్‌ది కదా అంటారా? నిజమే! ‘ఈ పడిశం, తుమ్ములు, వెక్కిళ్లు, దగ్గులు, ఆకలి, నిద్ర, మంచీచెడు, మరణం, జననం, పదవి, పట్టం, ప్రాప్తం.. ఇవేవీ అడిగి రావు. అవే వస్తాయి. అవి రావడం తెలియదు మనకు, పోవడం తెలియదు మనకు. యచ్చచ్చ.. యచ్చచ్చ.. గచ్చచ్చ.. గచ్చచ్చ..’ అంటారు ‘ముత్తు’ సినిమాలో. ‘నీతిని.. న్యాయాన్ని ఎవరి కోసమూ వదల్లేను’ ఇది ‘పెదరాయుడు’ డైలాగ్. ఇందులో చెల్లెలు జయంతికి, అన్న (పాపారాయుడు) రజనీకాంత్‌కి ఒక ఘర్షణ వస్తుంది. ‘అన్నయ్యా.. నువ్వు నన్ను జమీందారు కుటుంబంలో ఇచ్చావ్. రేపు నువ్వు ఇవ్వబోయే తీర్పు మీద ఆ వంశం పరువు, మర్యాదలు ఆధారపడి ఉన్నాయ్. ఏదో చిన్నతనం వల్ల తెలియక నా కొడుకు పొరపాటు చేశాడు. నువ్వు పెద్ద మనసుపెట్టి వాడిని క్షమిస్తే...’ అంటుంది జయంతి.అప్పుడు ‘పెదరాయుడూ.. మన ఇనప్పెట్టెలో మీ అమ్మది 500 తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడబుట్టినదానికి తెచ్చివ్వు. చూడమ్మా.. రామాపురంలో నాకు 700 ఎకరాల కొబ్బరితోట ఉంది. దాన్ని నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కనున్న 200 ఎకరాల సాగుభూమి కూడా నీ పేర్న రాస్తాను. నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తినీ మీకు ధారాదత్తం చేస్తాను. అంతేకానీ మేం తరతరాలుగా నమ్ముకున్న నీతిని, న్యాయాన్ని ఎవరికోసమూ వదల్ను’ అంటారు రజనీకాంత్. తాను నమ్మిన సిద్ధాంతాన్ని బంధుప్రీతికి తాకట్టు పెట్టక పేదల పరం చేస్తాడు. అది నచ్చని చెల్లెలి భర్త ఆయనను తుపాకీతో కాలుస్తాడు. ప్రాణాలు వదులుతూ పాపారాయుడు తన కొడుకు పెదరాయుడికి ఒక మాట చెప్తాడు.. ‘తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒకటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పు ఇచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క... గుర్తుంచుకో’ అని. ఆయన రాజకీయాల్లోకి వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని బహుశా ఈ డైలాగ్‌తోనే రజనీ అభిమానులు స్ఫూర్తి చెంది ఉంటారేమో. సినిమా ప్రభావం సాధారణమైంది కాదు.. అందునా హీరో ఇంపాక్ట్ అసాధారణం! ‘ఇచ్చిన మాట.. చేసిన ధర్మం’ పినతండ్రి కొడుకును తోడబుట్టిన వాడికన్నా ఎక్కువ చూసుకుంటాడు. కాని ఆస్తి విషయంలో ఆ తమ్ముడే వెన్నుపోటు పొడుస్తాడు. తనకున్న మిగిలిన ఆస్తినీ అతని పేరుమీదే రాసి కట్టుబట్టలతో ప్రయాణమవుతాడు. తప్పయిపోయింది అలా తమని ఒంటరిచేసి వెళ్లిపోవద్దని తమ్ముడి భార్య బతిమాలుతుంది. ‘ఇచ్చిన మాట.. చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటు మా వంశంలోనే లేదు’ అంటారు రజనీకాంత్. ఇది ‘ముత్తు’ సినిమాలోని పాపులర్ డైలాగ్. రాజకీయాల్లోకి రావాలని రజనీ మీద ఒత్తిడి తెచ్చి, ఆయనతో సరే అని ఓ మాట అనిపిస్తే.. తిరిగి వెనక్కి తీసుకోకుండా రాజకీయాల్లో కంటిన్యూ అవుతారనే నమ్మకంతోనే రజనీతో ఆయన అభిమానులు సమావేశం అవ్వాలని అనుకుని ఉంటారు. (అన్నట్లు ఈ నెల 12న రజనీ తన ఫ్యాన్స్‌ని కలవబోతున్నారు) ‘చెప్పిందే చేస్తాడు.. చేసేదే చెప్తాడు’ మరి రజనీకాంత్ మనసులో ఏముందో? ‘పెదరాయుడు’లో చెప్పినట్టు ‘ఈ రాయుడు చెప్పిందే చేస్తాడు.. చేసేదే చెప్తాడు’ అని ఇప్పటివరకూ చెప్పినట్లు రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేక ‘అరుణాచలం’లో అన్నట్టు ‘ఆ దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటిస్తాడు’ అని అభిమానుల నిర్ణయాన్ని ఆమోదిస్తారా? బికాజ్.. ఏ హీరోకైనా అభిమానులే దేవుళ్లు కదా! పైగా ‘ముత్తు’లో ఆయనే చెప్పారు.. ‘వాళ్లు చప్పట్లు కొడితేనే నాలాంటి వాళ్లు ఎందరో నాయకులయ్యారు’ అని. అంతేకాదు.. ‘నరసింహ’లోనూ దాన్ని నొక్కి వక్కాణించారు.. ‘నేనొక్కడినే.. కాని ఈ ఒక్కడికోసం ప్రాణాలు అర్పించడానికి ఎంతమంది వచ్చారో చూడు’ అని. అందుకే ‘నేను ఎవరి దారికీ అడ్డురాను.. నా దారికి ఎవరినీ అడ్డుపడనివ్వను...’ అంటూ ప్రత్యర్థులకు చెప్పారు.. చూపించారు ‘నరసింహ’గా! అదే సినిమాలో ‘మీకున్నది రాజకీయబలం.. నాకున్నది ప్రజాబలం. మీరు పోలీస్ శక్తితో బతుకుతున్నారు.. నేను ప్రజాశక్తితో బతుకుతున్నాను.. ఈ శక్తి ముందు మీ శక్తి జుజూబి’ అంటూ తన అభిమానుల ప్రేమను, నమ్మకాన్ని హిమాలయాలంత ఎత్తుకు ఎత్తేశారు. ఉబ్బితబ్బిబ్బైన జనం ఇప్పుడు ఆ తలైవా (నాయకుడు) ను వెండితెరను కాదు రాజకీయాలను ఏలమని అడుగుతున్నారు. ‘కష్టపడందే ఏదీ రాదు.. కష్టపడకుండా వచ్చింది నిలవదు’ అని తప్పుకుంటారా? కష్టపడి నిరూపించుకుంటారా అన్నది రియల్ స్క్రీన్ ప్లాట్.. రిమైనింగ్ స్టోరి. ‘మంచివాడు మొదట కష్టపడొచ్చు.. కాని ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు... కాని ఓడిపోతాడు’ ఇది ‘భాషా’లో మాణిక్భాషా ఉరఫ్ రజనీకాంత్ ఫేమస్ డైలాగ్. బహుశా దీన్ని తన పూర్వపు రాజకీయ అనుభవంతో చెప్పి ఉంటారు. అయితే ఈసారి సవాలుగా తీసుకుంటారా? లేక అదే సినిమాలో చెప్పినట్టు ‘పిరికివాడితో యుద్ధం చేయడం ఈ మాణిక్ భాషాకు నచ్చదు’ అని రాజకీయాల్లోని ప్రత్యర్థులను పిరికివాళ్లుగా జమకట్టి ‘నో పాలిటిక్స్’ అంటారా? ఏమైనా .. ఏ విషయమైనా ఆయన ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అని అభిమానులు సమాధాన పడ్తారా? ‘నువ్వంటే అందరికీ ఎందుకంత ఇష్టమో తెలుసా? వయసైపోయినా నీ స్టయిల్, అందం ఏమాత్రం తగ్గలేదు’ అంటుంది ‘నరసింహ’లో నీలాంబరి. ‘పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు’ అంటారు నరసింహ అలియాస్ రజనీకాంత్. రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా.. ఆయన స్టయిల్ ఆయనదే. ఆయన మార్క్ ఆయనదే. ఆయన దారి రహదారి.. బెటర్ డోన్ట్కమ్ ఆన్ హిజ్ వే! హి ఈజ్ తలైవా! ►‘ఆ దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటిస్తాడు’ (‘అరుణాచలం’లో...) ►‘ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’ (‘భాషా’లో...) ►‘ఇచ్చిన మాట.. చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటు మా వంశంలోనే లేదు’ (‘ముత్తు’లో...) ►‘మీకున్నది రాజకీయబలం. నాకున్నది ప్రజాబలం. మీరు పోలీస్ శక్తితో బతుకుతున్నారు.. నేను ప్రజాశక్తితో బతుకుతున్నాను.. ఈ శక్తి ముందు మీ శక్తి జుజూబి’ (‘నరసింహ’లో...) ►మేం తరతరాలుగా నమ్ముకున్న నీతిని, న్యాయాన్ని ఎవరికోసమూ వదల్ను (‘పెదరాయుడు’లో...) ►నా దారి రహదారి.. బెటర్ డోన్ట్కమ్ ఇన్ మై వే – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రజనీ ఫీవర్
-
ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు
పెరంబూర్: జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని నటుడు ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రయివేట్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. జల్లికట్టు క్రీడ కోసం యువత చాలా ప్రశాంతంగా, కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్నారన్నారు. తాము వారికి మద్దతు పలికామన్నారు. అలాంటి జల్లికట్టు పోరాటంలో పోలీసుల హింసాత్మక చర్యలు అనవసరంగా పేర్కొన్నారు. జయలలిత మరణానంతం అందరికీ మాట్లాదే ధైర్యం వచ్చిందని ప్రకాశ్ రాజ్ అన్నారు. జయలలిత మరణం తరువాత బాధ్యతాయుతమైన నాయకుడు లేడని, తమిళ ప్రభుత్వం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, ఇంకా చెప్పాలంటే ప్రస్తుత ప్రభుత్వ పాలనే ప్రశ్నార్థకంగా ఉందని వ్యాఖ్యానించారు. అనూహ్యంగా నాయకుడిని ఎంచుకోరాదన్నారు. వారి కోసం ప్రజలు ఓట్లు వేయలేదని, శాసనసభ్యుల మద్దతు ఉన్నా వారిని ఆ నాయకురాలి కోసమే ప్రజలు ఎన్నుకున్నారన్నది మరచిపోరాదన్నారు. అయినా రాజ్యాంగ చట్టప్రకారం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం ఐదేళ్లు పారిపాలించాల్సిందేనన్నారు. ఏ ప్రభుత్వం అయినా నిర్మాతల మండలి కోసం వారిని తాము కలిసి మాట్లాడతామని నటుడు ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. ఈయన నటుడు విశాల్‌తో కలిసి తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయనున్నారన్నది గమనార్హం. అదే విధంగా రెండు రోజుల క్రితం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద పోరాటం చేస్తున్న తమిళ రైతులను కలిసి వారికి మద్దతు తెలిపిన ఈ జట్టు బృందం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని, కేంద్ర మంత్రులను కలిసి రైతులు కరువు కోరల్లో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వారి దీన స్థితిని వివరిస్తూ వారి డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
ఆర్కే నగర్ లో బహుముఖ పోటీ!
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలు పోటీకి సిద్ధమవడంతో అందరి దృష్టి ఈ ఉప ఎన్నికపై నిలిచింది. ‘అమ్మ’ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని అన్నాడీఎంకే భావిస్తుండగా, ఇక్కడ పాగా వేసి సత్తా చాటాలని డీఎంకే వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా తమకు మద్దతు ఇవ్వాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్.. వామపక్షాలను కోరారు. అన్నాడీఎంకే తరపున దినకరన్ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఇక ‘కెప్టెన్’ విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే అభ్యర్థిగా ఆ పార్టీ ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి మదివానన్ పేరును ఖారారైంది. విజయకాంత్ సతీమణి ప్రేమలతను పోటీ దింపాలని పలువురు నేతలు కోరుతున్నారు. పన్నీర్ సెల్వం శిబిరం నుంచి పోటీకి దిగనున్నట్టు మాజీ డీజీపీ తిలకవతి సూచనప్రాయంగా వెల్లడించారు. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా సొంత పార్టీ తరపున బరిలోకి దిగుతానని ప్రకటించారు. ప్రజా సంక్షేమ వేదిక(పీడబ్ల్యూఎఫ్) కూడా పోటికి సిద్ధమవడంతో బహుముఖ పోరు తప్పదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఆసక్తి రేపుతోంది. ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనుంది. కాగా, ఆర్కే నగర్ లో పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచి శశికళ వర్గం నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని దీప ఆరోపించారు. -
చొక్కాలు చించుకున్న తమిళనాడు రాజకీయాలు
-
శశికళ నిజమైన వారసురాలు కాదు
-
అశ్విన్ సంచలన ట్వీట్స్
చెన్నై: టీమిండియా స్పిన్నర్, తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ తప్ప మిగతా విషయాల గురించి పెద్దగా స్పందించడు. అలాంటి అశ్విన్ తమిళనాడు రాజకీయాలను ఉద్దేశించేలా సంచలన ట్వీట్స్ చేశాడు. కాసేపటి తర్వాత తూచ్ తన ఉద్దేశం అది కాదంటూ మరో ట్వీట్ చేసి తేలికపరిచే ప్రయత్నం చేశాడు. త్వరలో 234 ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయని, తమిళనాడులోని యువకులందరూ సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లో చాలా అర్థాలున్నాయి. 234 ఉద్యోగాలు అంటే తమిళనాడు శాసన సభలో ఎమ్మెల్యేల సంఖ్య. త్వరలో ఉద్యోగావకాశాలు వస్తాయంటే తమిళనాడు శాసనసభ రద్దయి ఎన్నికలు వస్తాయా అని అతని ఫోలోవర్లు తికమకపడ్డారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. జయలలిత మరణం, తాజాగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా, అన్నా డీఎంకే చీఫ్ శశికళ ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో అశ్విన్ ట్వీట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అన్నా డీఎంకేలో అసమ్మతి ఏర్పడి ప్రభుత్వం కూలిపోతుందని అశ్విన్ భావించడా అని నెటిజెన్లు మెదడుకు పదును పెట్టారు. రెండు గంటల తర్వాత అశ్విన్ మరో ట్వీట్ చేశాడు. 'యువకులారా కూల్‌గా ఉండండి. ఈ ట్వీట్‌కు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదు, కేవలం ఉద్యోగ ప్రకటనకు సంబంధించినది' అంటూ జోక్ చేశాడు. To all the youngsters in TN, 234 job opportunities to open up shortly. — Ashwin Ravichandran (@ashwinravi99) 6 February 2017 Guys please cool it down, it is a job creation drive.Nothing to do with Politics.#howmuchtwisting -
నేనలా మాట్లాడలేదు: శరత్ కుమార్
-
నేనలా మాట్లాడలేదు: శరత్ కుమార్
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం, ఆయన అభిమానులు ఆందోళన చేపట్టడంతో మరో నటుడు శరత్ కుమార్ స్పందించారు. రజనీకాంత్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని శరత్ కుమార్ ఫేస్బుక్లో వివరణ ఇచ్చారు. రజనీకాంత్‌కు రాజకీయ పార్టీ పెట్టే అర్హత లేదని తాను వ్యాఖ్యానించలేదని, తన మాటలను కొందరు వక్రీకరించారని శరత్ కుమార్ చెప్పారు. రజనీ గురించి తనంతట తాను మాట్లాడలేదని, మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించడంతో స్పందించానని తెలిపారు. రజనీ తనకు మిత్రుడని, ఆయన పార్టీ పెడితే మాత్రం ప్రత్యర్థిగా భావిస్తానని చెప్పారు. తమిళనాడును పాలించేది తమిళులే కావాలన్నది తన అభిప్రాయమని శరత్ కుమార్ అన్నారు. జయలలిత మరణించిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుతున్నారు. ఈ నేపథ్యంలో శరత్ కుమార్ మాట్లాడుతూ.. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఎదిరించేవారిలో మొదట తానే ఉంటానని అన్నారు. రజనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శరత్ కుమార్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. (రజనీ రాజకీయాల్లోకొస్తే ఎదిరిస్తా: హీరో) -
తమిళనాడు రాజకీయల్లో కొత్త శక్తి?
-
జయలేని తమిళనాడులో ఏం జరగబోతోంది!
ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూత తమిళనాడు రాజకీయాలకు ఒక షాక్‌లాంటిదే. సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన జయలలిత కడసారి చూపు కోసం అశేషమైన ప్రజానీకమే కాదు.. అన్ని రాజకీయ పక్షాల నేతలు చెన్నైకి తరలివచ్చారు. అయితే, జయలలిత తదనంతరం తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటాయి? ఏయే పరిణామాలు జరిగే అవకాశముంది? అన్నదానిపై రాజకీయ పరిశీలకుల అంచనా ఇది. అన్నాడీఎంకే.. ప్రస్తుతం అన్నాడీఎంకేలో శశికళ కోటరి బలంగా ఉంది. ఆమెకు 60కిపైగా ఎమ్మెల్యేలు, 12మంది మంత్రుల మద్దతు ఉన్నట్టు చెప్తున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు డీఎంకే చేసే ప్రయత్నాలను శశికళ కోటరి గట్టిగా తిప్పికొట్టవచ్చు. అన్నాడీఎంకేలో ఇప్పుడు చాలా గ్రూపులు బలంగా ఉన్నాయి. అయితే తాత్కాలికంగా ఈ గ్రూపుల తమ విభేదాలను పక్కనబెట్టి అధికార యంత్రాంగం సహకారంతో పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రయత్నించవచ్చు. శశికళ కోటరి ఇప్పట్లో పన్నీర్ సెల్వం పదవికి ఎసరు పెట్టే ప్రయత్నాలు చేయకపోవచ్చు. స్వయంగా జయలలితే పన్నీర్ సెల్వంపై విశ్వాసం ఉంచిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడే ఆయన పదవికి గండం రాకపోవచ్చు. శశికళ మోసం చేసే అవకాశం ఉందని భావిస్తే ఆమెకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే క్యాడర్ తిరుగుబాటు చేయొచ్చు ముక్కులథోర్ (థెవర్) కుల సమీకరణాన్ని శశికళ తెరపైకి తేవచ్చు. జయలలితకు బలంగా అండగా నిలిచిన సామాజికవర్గాల్లో ముక్కులథోర్ కీలకమైనది. అదేవిధంగా దక్షిణ తమిళనాడులో బలంగా ఉన్న ముక్కులథోర్, పశ్చిమ తమిళనాడులో బలంగా ఉన్న గౌండర్ సామాజిక వర్గాల మధ్య సామరస్యానికి శశికళ ప్రయత్నించవచ్చు. ఈ మేరకు కొత్త సీఎంను శశికళ నామినేట్ చేస్తే.. గౌండర్ వర్గానికి చెందిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురైకి మరిన్ని అధికారాలు లభించవచ్చు. అన్నాడీఎంకేలో తనపట్ల అసమ్మతిని చల్లార్చేందుకు సీఎం జయలలితకు ప్రధాన సలహాదారుగా పనిచేసిన షీలా బాలకృష్ణన్‌ను రంగంలోకి తేవచ్చు. డీఎంకే అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించి తనవైపు మలుపుకొనే ప్రయత్నం చేసినప్పటికీ, తాజా ఎన్నికలకు వెళ్లకపోవచ్చు. అధికార పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు స్టాలిన్ నాయకత్వంలో పనిచేసేందుకు అంగీకరించవచ్చు. అయితే, అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చడంలో మాత్రం ఆచితూచి వ్యవహరించే అవకాశం. అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోతే.. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రపతి పాలన విధించి.. రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టు పెంచుకొనే అవకాశం ఉండటంతో ఆచితూచి అడుగులు వేయవచ్చు. బీజేపీ తమిళనాడులో తాజాగా ఎన్నికలు వస్తే శశికళ కోటరితో బీజేపీ చేతులు కలిపే అవకాశం. కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చు. తమిళనాడులో ప్రభుత్వాన్ని మార్చేందుకు కేంద్రం సహకరించే అవకాశం. అయితే, బలమైన నేత లేకుండా బీజేపీ సొంతంగా తమిళనాడులో ఎదగటం అసాధ్యమే. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నాడీఎంకేలోకి క్యూ కట్టడంతో ఆ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారిపోవచ్చు. -
అళగిరి కొత్త అడుగు
చెన్నై : డీఎంకేలో మరో మారు ప్రకంపన సృష్టించే విధంగా బహిష్కృత నేత అళగిరి అడుగులు వేస్తున్నారు. రెండు నెలల్లో సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్టు స్వయంగా అళగిరి వెళ్లడించడం డీఎంకేలో చర్చనీయాంశంగా మారింది. గోపాల పురంలో తనకు అనుమతి కరువు కావడంపై అళగిరి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. డీఎంకే నుంచి అధినేత ఎం కరుణానిధి తనయుడు అళగిరిని బహిష్కరించిన విషయం తెలిసిందే. మళ్లీ తనను అక్కున చేర్చుకుంటారన్న ఆశ అళగిరిలో ఉన్నా, అందుకు తగ్గ సమయం మాత్రం రావడం లేదు. అయితే, రాను రాను ఆ ఆశలు అళగిరిలో సన్నగిల్లుతున్నట్టున్నాయి. కొంత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉన్న అళగిరి మళ్లీ తన విమర్శలు, ఆరోపణాస్త్రాల్ని సంధించే పనిలో పడ్డారు. ప్రధానంగా స్టాలిన్‌కు వ్యతిరేకంగా మళ్లీ విరుచుకు పడే పనిలో పడ్డారు. హాంకాంగ్‌కు వెళ్లే సమయంలో గత వారం స్టాలిన్‌పై తీవ్రంగా స్పందించిన అళగిరి అక్కడి నుంచి మంగళవారం చెన్నై చేరుకోగానే సంచనల వ్యాఖ్య చేసి మదురైకు చెక్కేశారు. అనుమతి కరువు : పార్టీ నుంచి బహిష్కరించినా యథా ప్రకారం తరచూ చెన్నైకు వచ్చినప్పుడల్లా గోపాల పురంకు అళగిరి వెళ్తూ వచ్చారు. అయితే, ఆయనకు అధినేత, తండ్రి కరుణానిధి ప్రసన్నం మాత్రం దక్కడం లేదని చెప్పవచ్చు. దీంతో తన తల్లి దయాళు అమ్మాల్‌తో మాట్లాడటం, తన ఆవేదనను వెల్గక్కడం మదురైకు వెళ్లి పోవడం చేస్తూ వచ్చారు. అయితే, విదేశాల నుంచి చెన్నైకు వచ్చిన అళగిరి తనకు ఏదైనా శుభవార్త దక్కుతుందని ఎదురు చూసి భంగ పడక తప్పలేదు. తన తల్లి దయాళు అమ్మాల్‌ను కలుసుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. కరుణానిధి అనుమతి కూడా దక్కక పోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టున్నారు. మదురై వెళ్తూ చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో కొత్త అడుగు వేయబోతున్నట్టు ప్రకటించి విమానం ఎక్కేయడం గమనార్హం. రెండు నెలల్లో : అళగిరి విమానాశ్రయానికి రావడంతో మీడియా ఆయన్ను చుట్టుముట్టింది. తన తల్లిదండ్రుల్ని కలిసేందుకు వచ్చానని, వీలు పడక పోవడంతో తిరిగీ వెళ్తున్నట్టు పేర్కొన్నారు. స్టాలిన్‌ను ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశానని, అందులో ఎలాంటి మార్పులేదన్నారు. డీఎంకే అంటే కరుణానిధి, కరుణానిధి అంటే డిఎంకే మాత్రమేనని స్పష్టం చేశారు. ఆయన స్థానంలో మరొకర్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. రెండు నెలల్లో కొత్త నిర్ణయం, ప్రకటన వెలువరిస్తానని అంత వరకు వేచి ఉండంటూ, భద్రతా సిబ్బంది సాయంతో మీడియాను దాటుకుంటూ మదురైకు చెక్కేశారు. అయితే, రెండు నెలల్లో అళగిరి ఏ నిర్ణయం వెల్లడించబోతున్నారు. ఆయన చేయబోయే ప్రకటన ఏమిటీ..? ఎలాంటి ప్రకటన వెలువడుతుందోనన్న చర్చ డీఎంకేలో బయలు దేరి ఉన్నది. అదే సమయంలో స్టాలిన్ వ్యతిరేక శక్తులు మళ్లీ అళగిరి పక్షాన చేరి, పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరిస్తారా.? అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు ఉదాహరణగా లోక్ సభ ఎన్నికల సమయంలో అళగిరి వ్యవహరించిన తీరు ఓ నిదర్శనం. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అళగిరి రెండు నెలల తర్వాత ప్రకటన ఎలా ఉంటుందోనన్నది వేచి చూడాల్సిందే. -
కరుణానిధితో ఆళగిరి భేటీ
చెన్నై: డీఎండీకేతో పొత్తుపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన నేపథ్యంలో ఎం.కె. అళగిరి తన తండ్రి ఎం. కరుణానిధిని కలిశారు. దాదాపు అరగంట పాటు తండ్రితో మంతనాలు జరిపారు. అయితే భేటీ వివరాలు బయటకు వెల్లడికాలేదు. బయటకు వచ్చిన తర్వాత అళగిరి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే.. బహిష్కరించాల్సి ఉంటుందని తన తండ్రి హెచ్చరించిన నేపథ్యంలో కరుణానిధిని ఆళగిరి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో డీఎంకే పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయన్న అంశానికి వ్యతిరేకంగా ఆళగిరి వ్యాఖ్యలే చేయడంతో ఆయనపై కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎంతటివారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడానికీ వెనుకాడబోమని తేల్చేశారు. -
కెప్టెన్‌కు షాక్!
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్‌కు పెద్ద షాక్ తగిలింది. పార్టీ ప్రిసీడియం చైర్మన్, ఎమ్మెల్యే పదవులకు సీనియర్ నాయకుడు బన్రూటి రామచంద్రన్ రాజీనామా చేశారు. రాజకీయాలకు ఇక సెలవు అని ప్రకటించారు.విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే ఆవిర్భవించగానే, డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, ఎండీఎంకే తదితర పార్టీలకు చెందిన నాయకులు వలస వచ్చారు. ఇందులో బన్రూటి రామచంద్రన్ కీలక నేత. పార్టీ ఆవిర్భావం నుంచి విజయకాంత్ వెన్నంటే ఉంటూ వచ్చారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా బన్రూటీ, సీనియర్లుగా సుందరరాజన్, పాండియరాజన్, ఆస్టిన్ తదితరులు వ్యవహరించారు. పార్టీలో విజయకాంత్ సతీమణి ప్రేమలత , బావమరిది సుదీష్ జోక్యం క్రమంగా పెరగడంతో సీనియర్లు ఒకరి తర్వాత మరొకరు తప్పుకుంటూ వచ్చారు. సుందరరాజన్, పాండియరాజన్తో పాటుగా ఎందరో గుడ్ బై చెప్పి బయటకు వెళ్లినా, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారుతున్నా, బన్రూటి మాత్రం మౌనంగానే ఉంటూ వచ్చారు. విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష నేతగా ఎదగడంలో కీలక భూమిక పోషించిన బన్రూటికి పార్టీలో మాత్రం ఎన్నో అవమానాలు ఎదురైనట్లు వార్తలు వచ్చాయి. వీటికి అద్దం పట్టే విధంగా పార్టీ కార్యక్రమాలకు కొంత కాలంగా బన్రూటి దూరంగా ఉంటున్నారు. అరుుతే రెండు రోజుల క్రితం బ్రనూటి విజయకాంత్‌కు గట్టి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని తీసుకున్నారు. సీనియర్ నేతగా తన విజ్ఞతను చాటుకుంటూ, వివాదాల జోలికి వెళ్లకుండా, ఎవరి మనస్సు నొప్పించకుండా ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు మంగళవారం ఆయన ప్రకటించారు. రాజీనామా: ఎమ్మెల్యే పదవికి, శాసనసభ ప్రధాన ప్రతి పక్ష ఉప నేత పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, కార్యదర్శి జమాలుద్దీన్‌కు బన్రూటి లేఖ రాసినట్టు వెలుగు చూసింది. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ ధనపాల్ నిర్ణయం తీసుకున్న సమాచారంతో మీడియా బన్రూటి నివాసానికి పరుగులు తీసింది. దీంతో తాను తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తూ బన్రూటి మీడియాతో మాట్లాడారు. పార్టీ సభ్యత్వానికి, ప్రిసీడియం చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అసంతృప్తి: మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నల్ని సంధించినా, వివాదాల జోళికి వెళ్లకుండా ఆయన మాట్లాడారు. పార్టీలో అవమానాల్ని , ఇబ్బందుల్ని ఎదుర్కొన్నట్టు వార్తలు వచ్చారుుగా..? అని ప్రశ్నించగా చిరునవ్వే సమాధానంగా చెప్పారు. వివాదాల జోళికి వెళ్ల దలచుకోలేదని, పార్టీని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒకర్ని నిందించడం లేదా, విమర్శించడం మంచి పద్దతి కాదంటూ దాట వేశారు. విజయకాంత్‌కు ముందే తెలుసా అని ప్రశ్నించగా, తెలిస్తే ఆయన అంగీకరించేవారు కాద న్నారు. విజయకాంత్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తన మీద ఎవరి ఒత్తిడి లేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఒక్క విషయం మాత్రం చెప్పదలచుకున్నాననంటూ డీఎండీకే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవిర్భావ కాలంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం అక్కడ లేవని, దాన్ని మార్చుకోకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. చివరకు, తాను అనారోగ్య కారణాలతో రాజకీయూలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. ఇంత వరకు తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగించారు. అయితే బన్రూటి రాజీనామాతో అలంధూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుంది. బన్రూటి వైదొలగడంతో ఇక డీఎండీకే మరింత గట్టి పరిస్థితుల్ని ఎదుర్కోవడం తథ్యం. బన్రూటికి అనుకూల ఎమ్మెల్యేలు అనేక మంది ఆ పార్టీలో ఉన్నారు. వీరంతా రెబల్స్ అవతారం ఎత్తడం ఖాయం. ఈ దృష్ట్యా, మరి కొద్ది రోజుల్లో విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష నేత పదవికి గండం తప్పదేమో...!