రాజ్‌నాథ్‌తో తమిళనాడు గవర్నర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు మరోసారి భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం ఇక్కడ జరిగిన ఈ సమావేశంలో మిళనాడు రాజకీయలపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కాయి. ఈ నేపథ్యంలో విద్యాసాగర్‌రావు నిన్న కూడా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోంమంత్రితో వేర్వేరుగా సమావేశం అయిన విషయం తెలిసిందే.
మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ విశ్వాస పరీక్షకు అనుమతిస్తే.. ముఖ్యమంత్రి పళనిస్వామి మరోసారి సీఎంగా నెగ్గటం సులువే. మొత్తం 233 మంది ఎమ్మెల్యేలున్న ప్రస్తుత తమిళ అసెంబ్లీలో (జయ మరణంతో ఆర్కేనగర్ ఖాళీగా ఉంది) విజయానికి 117 సీట్లు అవసరం. అయితే.. పళనిస్వామి వర్గంలో 113 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మిత్రపక్షాలున్నారు.
ఈ నేపథ్యంలో 18మందిపై అనర్హత వేటు పడితే.. 215 సభ్యులు మాత్రమే విశ్వాస పరీక్షలో పాల్గొంటారు. అప్పుడు గెలిచేందుకు 109 సీట్లు అవసరం. ఈ మేజిక్ ఫిగర్‌ను సీఎం వర్గం సులభంగానే చేరుకుంటుంది. అయితే.. రెండ్రోజుల్లో ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.