
కృష్ణగిరి: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, బహిష్కృత నేత వీకే శశికళను తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిం చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపిం చింది. ఏఐఏడీఎంకేను తిరిగి గుప్పిట్లోకి తెచ్చు కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ మేరకు సోమ వారం ఆ పార్టీ నాయకత్వం స్పందించింది. ఎట్టి పరిస్థితు ల్లోనూ శశికళను తిరిగి ఏఐఏడీఎంలోకి రానివ్వ బోమని, పార్టీ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ కో ఆర్డినేటర్ మునుస్వామి స్పష్టం చేశారు.
‘శశికళకు ఏఐఏడీఎంకేతో ఎలాంటి సంబంధం లేదు, ఆమె పార్టీకి చెందిన వ్యక్తి కాదు’ అని మునుస్వామి తేల్చిచెప్పారు. పార్టీ కేడర్ దృష్టి మరల్చి, వారిలో అయోమయం సృష్టించేందుకు శశికళ సాగిస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవన్నారు. పార్టీకి చెందిన ఏ ఒక్క నేత కూడా ఆమెతో ఫోన్‌లో మాట్లాడలేద న్నారు. ఒక్క కార్యకర్త కూడా ఆమె వలలో చిక్కుకోరని తెలిపారు. ఏఐఏండీఎంకేపై తిరిగి పట్టు సాధిస్తానంటూ శశికళ తన అనుయా యులతో అన్నట్లుగా ఉన్న ఆడియో క్లిప్పింగులు ఆదివారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
చదవండి: (పార్టీ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోలేను.. త్వరలోనే వస్తా!)