Munuswamy
-
నీట్ కనీస వయో పరిమితిపై జోక్యం చేసుకోలేం
సాక్షి, అమరావతి : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు హాజరయ్యేందుకు కనీస వయో పరిమితి 17 సంవత్సరాలుగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంది. కనీస వయస్సును 17 సంత్సరాలుగా నిర్ణయించడం సమానత్వపు హక్కును హరించినట్లు కాదని స్పష్టంచేసింది. ఇదే అంశంపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలోనే తీర్పునిచ్చిందని, ఓసారి తేలిన అంశంలో మరోసారి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.నీట్‌కు కనీస వయోపరిమితి నిబంధనను కొట్టేయాలంటూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఓ మైనర్ విద్యార్థిని తండ్రి నాగ మునుస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అనూప్ కౌషిక్ వాదనలు వినిపిస్తూ, ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని అన్నారు. పిటిషనర్ కుమార్తెకు నీట్ అర్హత వయస్సుకు నాలుగు రోజులు తక్కువ ఉందన్నారు. పరీక్షకు అనుమతించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్, జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తరపున న్యాయవాది ఎస్.వివేక్ చంద్రశేఖర్‌లు వాదనలు వినిపిస్తూ.. ఇదే అంశంపై గతంలో దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం ఇదే అంశంపై తీర్పునిచ్చినప్పుడు దానికి విరుద్ధంగా స్పందించలేమంది. పరీక్ష రాసేందుకు నాలుగు రోజులు తక్కువైనా, ఒక్క రోజు తగ్గినా కూడా తాము ఏమీ చేయలేమని స్పష్టం చేసింది. -
శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోబోం: ఏఐఏడీఎంకే
కృష్ణగిరి: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, బహిష్కృత నేత వీకే శశికళను తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిం చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపిం చింది. ఏఐఏడీఎంకేను తిరిగి గుప్పిట్లోకి తెచ్చు కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ మేరకు సోమ వారం ఆ పార్టీ నాయకత్వం స్పందించింది. ఎట్టి పరిస్థితు ల్లోనూ శశికళను తిరిగి ఏఐఏడీఎంలోకి రానివ్వ బోమని, పార్టీ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ కో ఆర్డినేటర్ మునుస్వామి స్పష్టం చేశారు. ‘శశికళకు ఏఐఏడీఎంకేతో ఎలాంటి సంబంధం లేదు, ఆమె పార్టీకి చెందిన వ్యక్తి కాదు’ అని మునుస్వామి తేల్చిచెప్పారు. పార్టీ కేడర్ దృష్టి మరల్చి, వారిలో అయోమయం సృష్టించేందుకు శశికళ సాగిస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవన్నారు. పార్టీకి చెందిన ఏ ఒక్క నేత కూడా ఆమెతో ఫోన్లో మాట్లాడలేద న్నారు. ఒక్క కార్యకర్త కూడా ఆమె వలలో చిక్కుకోరని తెలిపారు. ఏఐఏండీఎంకేపై తిరిగి పట్టు సాధిస్తానంటూ శశికళ తన అనుయా యులతో అన్నట్లుగా ఉన్న ఆడియో క్లిప్పింగులు ఆదివారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: (పార్టీ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోలేను.. త్వరలోనే వస్తా!) -
మునుస్వామి కుటుంబానికి రూ.కోటి సాయం
హెడ్‌కానిస్టేబుల్ కుటుంబానికి సాయం కుమార్తెకు విద్యా పరంగా అండ అసెంబ్లీలో అమ్మ ప్రకటన పోలీసుల హర్షం చెన్నై: దుండగుల దాడిలో మరణించిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ మునుస్వామి కుటుంబానికి రూ.కోటి సాయాన్ని సీఎం జె.జయలలిత ప్రకటించారు. ఆయన కుమార్తె రక్షణ ఉన్నత విద్యా ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో వీర మరణం పొందే పోలీసుల కుటుంబాల్ని ఆదుకునే విధంగా సాయం పెంపు దిశగా చట్ట సవరణకు ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు. కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలో గత వారం దోపిడీ దొంగల్ని పట్టుకునే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ మునుస్వామి హతమయ్యారు. దుండగుల దాడిలో మరణించిన ఆయన కుటుంబానికి రూ.ఐదు లక్షలు ఆర్థిక సాయాన్ని సీఎం జె.జయలలిత ప్రకటించారు. దుండుగుల్ని త్వరితగతిన పట్టుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో సోమవారం అసెంబ్లీలో 110 నిబంధనల మేరకు సీఎం జె.జయలలిత చేసిన ప్రకటన పోలీసు వర్గాల్లో ఆనందాన్ని నింపింది. విధి నిర్వహణలో వీరోచితంగా పోరాడి అమరులయ్యే పోలీసుల కుటుంబాల్ని ఆదుకునేందుకు తగ్గ చట్ట సవరణలకు ఆదేశాలు ఇచ్చారు. అమ్మ నిర్ణయంతో పోలీసు వర్గాల్లో, వారి కుటుంబీకుల్లో హర్షం వ్యక్తం అవుతోన్నది. రూ. కోటి: ఉదయం అసెంబ్లీ సమావేశం కాగానే, సీఎం జె.జయలలిత ప్రత్యేక ప్రకటన చేశారు. కృష్ణగిరి జిల్లా హోసూరులో దుండగుల్ని పట్టుకునే క్రమంలో హత్యకు గురైన హెడ్‌కానిస్టేబుల్ మునుస్వామి కుటుంబాన్ని ఓదార్చే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ.ఐదు లక్షలు ప్రకటించామని, ఇది ఆ కుటుంబానికి చాలదంటూ, రూ.కోటి ప్రకటించారు. ఈ మొత్తం ఆ కుటుంబానికి అందిస్తామని ఆమె చేసిన ప్రకటనతో సభలో అన్నాడీఎంకే వర్గాల కరతాళ ధ్వనులు మార్మోగాయి. అలాగే, విధి నిర్వహణలో దుండగుల్ని పట్టుకునే క్రమంలో గానీయండి, విధి నిర్వహణ సమయంలో ఎదురయ్యే ప్రమాదం రూపంలో గానీయండి వీరోచితంగా శ్రమించి, అమరులయ్యే పోలీసుల కుటుంబాన్ని ఆదుకునేందుకు తగ్గ చర్యలు చేపట్టామని వివరించారు. ఆ మేరకు ప్రస్తుతం వారికి ఇస్తున్న ఆర్థిక సాయం పెంపునకు చట్ట సవరణలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇందుకు తగ్గ చర్యలను ప్రధాన కార్యదర్శి తీసుకోనున్నారని పేర్కొంటూ, హోసూరు ఘటనలో మరణించిన మునుస్వామి కుమార్తె రక్షణ ఉన్నత విద్యా భారం ప్రభుత్వం భరిస్తుందని, అందుకు తగ్గ అన్ని ఖర్చుల్ని తామే అందిస్తామని స్పష్టం చేశారు. కాగా, విధి నిర్వహణలో మరణించి హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రప్రథమంగా పరిగణించవచ్చు. అలాగే ఆర్థిక సాయం పెంపునకు ఆదేశాలు జారీ కావడంతో పోలీసు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.