ఇక సినిమాల్లో నటించను: కమల్‌హాసన్‌ | good bye to Movies after Political Debut, says Kamal Haasan | Sakshi
Sakshi News home page

ఇక సినిమాల్లో నటించను: కమల్‌హాసన్‌

Feb 14 2018 9:26 AM | Updated on Sep 12 2019 10:40 AM

good bye to Movies after Political Debut, says Kamal Haasan  - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇప్పటికే అంగీకరించిన, నిర్మాణ దశలో ఉన్న చిత్రాలు పూర్తికాగానే నటనకు స్వస్తి పలుకుతానని ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ ప్రకటించారు. ఈనెల 21న రాజకీయ పార్టీ పేరు, పతాకాన్ని ప్రకటించి తమిళనాడువ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు.

అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రసంగించేందుకు ఇటీవల వెళ్లిన ఆయన అక్కడ ఒక టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ పెట్టిన తర్వాత క్రియాశీలక రాజకీయాలకు పూర్తి సమయం కేటాయిస్తానని స్పష్టంచేశారు. విడుదలకు సిద్ధమైన విశ్వరూపం–2, సెట్స్‌పై ఉన్న శభాష్‌ నాయుడు సినిమాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత సినిమాల్లో నటించే ఆలోచన లేదని ఆయన చెప్పారు. కమల్‌ తన పర్యటన వివరాలను ఈనెల 18న వెల్లడించనున్నారు.

అభిమానులతో రజనీ పార్టీ ఇన్‌చార్జిల భేటీ
ప్రముఖ నటుడు రజనీకాంత్‌ తన రాజకీయపార్టీ ఏర్పాటు సన్నాహాలను ముమ్మరం చేశారు. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రజనీకాంత్‌ అభిమాన సంఘాల జాతీయ నిర్వాహకులు సుధాకర్, రాజీవ్‌ మహాలింగం సంయుక్తంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు అభిమాన సంఘాల ముఖ్యనేతలతో సమావేశమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement