తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం తలెత్తింది. రాజకీయ ఉత్కంఠకు తెరదించే విధంగా బల పరీక్ష విషయంలో గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతుందోనని ఎదురు చూపులు చూడగా చివరికి దినకరన్ వర్గానికి స్పీకర్ భారీ షాకిచ్చారు. అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి దినకరన్ వర్గానికి చెందిన 18 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. సీఎం పళని స్వామిపై తిరుగుబావుట ఎగురవేసిన ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ సోమవారం ప్రకటించారు. దీంతో దినకరన్ వర్గానికి ఏం చేయాలో మింగుడు పడటం లేదు.