చెన్నై: తమిళనాడు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అన్నాడీఎంకే ఘోర ఓటమికి ఆ పార్టీ నేత ఎడప్పాడి కె పళనిస్వామి క్షమాపణలు చెప్పాలని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ అన్నారు. తంజావురులో ఆయన మీడియాతో మాట్లాడారు.
అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం డబ్బులు ఉన్నవారి చేతిలో చిక్కుకుందన్నారు.కేవలం కార్యర్తలు మాత్రమే దివంగత జయలలిత అభిమానులని తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీకి నాయకత్వం దారితప్పిందని విమర్శలు చేశారు.
అటువంటి పార్టీలో తన పార్టీని ఎట్టిపరిస్థితుల్లోను విలీనం చేయబోనని నకరన్ అన్నారు. అన్నాడీఎంకే తన పార్టీని విలీనం అస్సలు సాధ్యంకాదని తేల్చిచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 20 స్థానాల్లో అన్నాడీఎంకే ఓటు షేర్ తగ్గిందని తెలిపారు.
మరోవైపు ఎన్డీయే కూటమి అనూహ్యంగా 18.5 శాతం ఓటు షేర్‌ను సాధించిందని అన్నారు. అన్నాడీఎంకే తగ్గిన ఓటు షేర్‌ను గమనిస్తే.. ఆ పార్టీకి మైనార్టీ కులాల నుంచి మద్దతు పడిపోయిందన్నారు. విక్రవంది అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎన్డీయే కూటమి పక్షాలు అన్నీ చర్చించుకోని నిర్ణయిస్తామని అన్నారు. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎలాంటి నిబంధనలు లేకుండా టీటీవీ దినకరన్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment