శశికళకు సెల్వం స్ట్రాంగ్ వార్నింగ్ | panneerselvam warn sasikala natarajan | Sakshi
Sakshi News home page

శశికళకు సెల్వం స్ట్రాంగ్ వార్నింగ్

Published Fri, Feb 10 2017 8:17 PM | Last Updated on Thu, May 24 2018 12:05 PM

శశికళకు సెల్వం స్ట్రాంగ్ వార్నింగ్ - Sakshi

శశికళకు సెల్వం స్ట్రాంగ్ వార్నింగ్

చెన్నై: శశికళ నటరాజన్ పై విమర్శల ధాటిని పన్నీర్ సెల్వం పెంచారు. తన మద్దతుదారులతో కలిసి మరోసారి మీడియా ముందుకు వచ్చిన సెల్వం తీవ్రస్థాయిలో శశికళపై విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకేను ఎవరూ హైజాక్ చేయలేరని, పార్టీని చీల్చే కుట్రలను సాగనివ్వబోమని గర్జించారు. త్వరలోనే శుభవార్త వింటారని పునరుద్ఘాటించారు. తనకు మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

తమిళ ప్రజలపై నాకు గౌరవం ఉందని చెప్పారు. ఎంజీఆర్, జయలలిత బాటలో నడుస్తానని అన్నారు. లక్షల కష్టాలు వచ్చినా ప్రజలు మేలు చేయాలన్నదే 'అమ్మ' అభిమతమన్నారు. పార్టీ నుంచి శశికళను బహిష్కరిస్తామని హెచ్చరించారు. పార్టీ తనను బహిష్కరించడానికి శశికళ ఎవరని ప్రశ్నించారు. వేద నిలయం నుంచి శశికళను ప్రజలు తరిమికొడతారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement