sasikala natarajan
-
శశికళ భర్తకు సీరియస్?
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ భర్త నటరాజన్ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆయనకు ఛాతీ నొప్పి రాగా.. చెన్నైలోని గ్లోబల్ హెల్త్ సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని.. ఆరోగ్యంపై ఇప్పుడే ఏం చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ భర్త అనారోగ్యం వార్త అందుకోగానే హుటాహుటిన పెరోల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమచారం. కాగా, 74 ఏళ్ల నటరాజన్ లివర్ సంబంధిత వ్యాధితో గతంలోనూ అస్వస్థతకు గురికాగా.. శశికళ పెరోల్‌పై బయటకు వచ్చారు. అయితే ఆమె అప్పుడు భర్త కోసం కంటే రాజకీయాల పైనే ఎక్కువ దృష్టిసారించారన్న ఆరోపణలు వినిపించాయి. -
టార్గెట్ ఎనిమిది మంది, ‘వివేక్’ మెడకు ఉచ్చు
సాక్షి, చెన్నై: ఆదాయ పన్ను శాఖ విచారణ వలయంలోకి చిన్నమ్మ శశికళ కుటుంబం, సన్నిహితులు, సహాయకులు మూడు వందల మందిని తీసుకొచ్చారు. వీరిలో ఎనిమిది మంది టాప్ లిస్టులో ఉన్నారు. వీరందరికీ సమన్లు సిద్ధం చేస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ఇక, ఇళవరసి కుమారుడు వివేక్ మెడకు మాత్రం ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. 27 ఏళ్ల వయసు కల్గిన వివేక్ వెయ్యి కోట్ల మేరకు ఆస్తులు, పెట్టుబడుల్ని కల్గి ఉన్నట్టు ఐటీ దాడుల్లో వెలుగు చూసి ఉండడంతో చిన్నమ్మ కుటుంబంలో ఉత్కంఠ తప్పడం లేదు. అన్నాడీఎంకే అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ కుటుంబాన్ని, సన్నిహితుల్ని గురి పెట్టి ఐటీ దాడులు గురువారం నుంచి సాగుతున్న విషయం తెలిసిందే. తొలిరోజు 187 చోట్ల, రెండోరోజు 147 చోట్ల, మూడో రోజు 40 చోట్ల తనిఖీలు జరిగాయి. ఇక, నాలుగో రోజుగా 20 చోట్ల తనిఖీల్లో ఐటీ వర్గాలు నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఐటీ విభాగంలో ఉన్నతాధికారులుగా ఉన్న వాళ్లు నాలుగో రోజు రంగంలోకి దిగడంతో తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనన్న చర్చ బయలు దేరింది. టార్గెట్ 8 మంది: ఐటీ చరిత్రలో తమిళనాడులో కనీవిని ఎరుగని రీతిలో ఏకకాలంలో, రోజుల తరబడి సాగుతున్న ఈ దాడులపై సర్వత్రా దృష్టి పెట్టారు. రాజకీయ పక్షాలు కొన్ని విమర్శలు గుప్పిస్తుంటే, మరికొన్ని ఐటీ దాడుల్ని ఆహ్వానిస్తున్నాయి. ఈ చర్చ ఓ వైపు సాగుతుంటే, మరో వైపు నాలుగు రోజులుగా చిన్నమ్మ ఫ్యామిలీ, సన్నిహితులకు కంటి మీద కునుకు కరువైందని చెప్పవచ్చు. పట్టువదలని విక్రమార్కుడిలా తిష్ట వేసిన ఐటీ వర్గాలు అణువణువు సోదాలు చేస్తూ, లభించిన ఆధారాలను, వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలు, లభించిన ఆధారాలు, రికార్డులు, పెట్టుబడులు, ఆస్తులు, నగలు, నగదులకు సంబంధించి విచారణను ముమ్మరం చేయడానికి సిద్ధం అయ్యారు. ఇందు కోసం ఓ జాబితాను సిద్ధం చేస్తున్నారు. మూడు వందల మందిని విచారణ వలయంలోకి చేర్చి, ఒక్కొక్కర్ని తమ కార్యాలయం మెట్లు ఎక్కించేందుకు ఐటీ వర్గాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ జాబితాలో టాప్ 8 మందిని తొలుత టార్గెట్ చేశారు. ఇందులో శశికళ భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, అక్కకుమారులు దినకరన్, భాస్కరన్, అన్న కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణ ప్రియ, న్యాయవాది సెంథిల్, జ్యోతిష్కుడు చంద్రశేఖర్ ఉన్నట్టు సమాచారం. వివేక్ మెడకు ఉచ్చు: టాప్ 8 మందిలో తొలి పేరుగా వివేక్‌ను చేర్చినట్టు సమాచారం. ఇందుకు కారణం, 27 ఏళ్ల వయస్సు కల్గిన వివేక్ వెయ్యి కోట్ల మేరకు ఆస్తుల్ని, పెట్టుబడుల్ని తన గుప్పెట్లో ఉంచుకున్నట్టుగా ఐటీ దాడుల్లో వెలుగు చూడడమే. జయ టీవీ, నమదు ఎంజీయార్, జాస్ సినిమాస్ ఇలా మరికొన్ని సంస్థలకే ఆయనే అధిపతి అన్నట్టుగా ఆధారాలు చిక్కడంతోనే వివేక్‌ను తొలి జాబితాలో చేర్చినట్టు తెలిసింది. తదుపరి చిన్నమ్మ సోదరుడు దివాకరన్ను గురి పెట్టి ఉండడంతో, మున్ముందు ఐటీ వర్గాల విచారణలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనన్న ఉత్కంఠ తప్పడం లేదు. అదే సమయంలో వివేక్‌ను అరెస్టు కూడా చేయవచ్చనట్టు ప్రచారం ఊపందుకుంది. శశికళ భర్త నటరాజన్‌ను టార్గెట్ చేసినా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి విచారణకు పిలిచేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం లభించిన ఆధారాల మేరకు మొత్తం ఆస్తుల వివరాల్ని, పట్టుబడ్డ వాటి గురించిన వివరాల్ని లెక్కించే పనిలో ఐటీ వర్గాలు బిజీగా ఉన్నాయి. వీరు తమకు ఇచ్చే నివేదిక ఆధారంగా రంగంలోకి దిగేందుకు సీబీఐ, ఈడీ వర్గాలు సిద్ధం అవుతుండం గమనార్హం.లగ్జరీ కార్లు: ఆదివారం 20 చోట్ల దాడులు జరగ్గా, పట్టుబడ్డ రికార్డుల సమగ్ర పరిశీలన మేరకు లగ్జరీ కార్ల కొనుగోళ్లలోనూ పన్ను ఎగవేత వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. విదేశాల నుంచి పలు కార్లు అక్రమ మార్గంలో దిగుమతి చేసుకుని ఉండడాన్ని గుర్తించారు. దివాకరన్ వద్ద విచారణ: మన్నార్ కుడిలోని దివాకరన్, ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్ హౌస్, కళాశాలల్లో ఐటీ వర్గాలు తనిఖీలు ముగించాయి. ఆయన కళాశాలలోని ఓ గదిని ఐటీ వర్గాలు తమ గుప్పెట్లోకి తీసుకుని సీల్ వేశాయి. మన్నార్‌కుడిలో లభించిన రికార్డులు, ఇతర వాటిని 14 కార్లో యాభై మంది అధికారులు చెన్నైకు తరలించడం గమనార్హం. అలాగే, మరి కొందరు అధికారులు దివాకరన్ను రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పుదుచ్చేరికి చంద్రశేఖర్: శశికళ జ్యోతిష్కుడు చంద్రశేఖర్ ఇంట్లో , న్యాయవాది సెంథిల్ ఇంట్లో విచారణ ముగిసింది. జ్యోతిష్కుడి ఇంట్లో చిన్నమ్మ ఫ్యామిలికీ సంబంధించిన అనేక దస్తావేజులు ఐటీ వర్గాలకు చిక్కినట్టు సమాచారం. అలాగే, రాష్ట్ర మంత్రి ఒకరు ఈ జ్యోతిష్కుడితో మరీ సన్నిహితంగా ఉండడంతో ఆయన ఎవరో అని ఆరా తీస్తున్నారు. దీంతో చంద్రశేఖర్‌ను విచారించేందుకు ఐటీ వర్గాలు పుదుచ్చేరికి తరలించారు. అక్కడి శ్రీలక్ష్మి జ్యువెలరీస్ అధినేత తెన్నరసును సైతం విచారించేందుకు చర్యలు చేపట్టారు. మోసం చేసి ఆస్తులు గడించారు: అమ్మ జయ లలితను మోసగించిన శశికళ కుటుంబం ఆస్తుల్ని గడించిందని అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేనే లేదని స్పష్టం చేశారు. అమ్మకు తెలియకుండా ఏళ్ల తరబడి మోసాలకు, అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాజకీయం చేయొద్దు: ఐటీ దాడుల్ని రాజకీయం చేయవద్దు అని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐటీ పరిశీలనలో తేలిన అంశాలు, లభించిన ఆధారాల మేరకు దాడులు సాగుతున్నాయని తెలిపారు. బీజేపీ మీద నిందల్ని వేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. శశికళ కుటుంబాన్ని మాత్రమే ఐటీ టార్గెట్ చేయలేదని, ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి చెందిన వారిని సైతం గురి పెట్టి తనిఖీలు, సోదాలు సాగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అన్నాడీఎంకేను ముక్కలు చేయాల్సిన అవసరం గానీ, రాజకీయ కక్ష సాధింపులకు దిగాల్సినంత విరోధంగా ఇక్కడి వారితో బీజేపీ పెద్దలకు లేదని స్పష్టం చేశారు. ఇక, పీఎంకే అధినేత రాందాసు పేర్కొంటూ, శశికళ బంధువులు కూడబెట్టిన ఆస్తులను జప్తు చేయాలని, వాటన్నింటిని కేంద్రం స్వాధీనం చేసుకోవాలని కోరారు. మమ్మల్ని తరిమేయడానికి కుట్ర: తిరువణ్ణామలైలో దైవ దర్శనానికి వెళ్లిన దినకరన్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలు బట్టి చూస్తే, ఈ రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి తమ కుటుంబాన్ని తరిమి వేయడానికి కుట్ర జరుగుతున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. అమ్మ జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె కోరిక మేరకు వీడియో తీశామని, అది తన వద్దే ఉందన్నారు. వైద్య చికిత్సలు, అమ్మకు సంబంధించిన వీడియో తన వద్దే ఉందని, దానిని ఐటీ వర్గాలు తీసుకెళ్ల లేదని స్పష్టం చేశారు. ఈ దాడులతో రాజకీయంగా తాను వెనుక బడ లేదని, ప్రజల మదిలో స్థానం సంపాదించుకున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని పేర్కొంటూ, పదవి చేతిలో ఉంది కదా అని మంత్రులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం శోచనీయమని విమర్శించారు. మంత్రి సీవీ షణ్ముగం లాంటి వాళ్లు ఎందరో ఎలా ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్నారో అన్న వివరాల్ని బయట పెడితే..అంటూ, ఓ మారు గుర్తుంచుకోండని మంత్రులకు హితవు పలికారు. కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటామని, చట్టపరంగా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. మహా అయితే, అరెస్టు చేస్తారేగానీ, కాల్చి చంపరుగా అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
తవ్వే కొద్దీ కోట్లు బయటపడుతున్నాయి...!
సాక్షి, చెన్నై: తమిళనాట సాగుతున్న ఐటీ దాడుల్లో తవ్వే కొద్దీ చిన్నమ్మ శశికళ కుటుంబం అవినీతి భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ. వెయ్యి కోట్ల మేరకు పన్ను ఎగ వేసినట్టుగా శుక్రవారం గుర్తించిన అధికారులు, శనివారం జరిపిన పరిశీలనల్లో రూ. 1500 కోట్లు విలువైన పెట్టుబడుల దస్తావేజుల్ని వెలికి తీసినట్లు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, ఆరు కోట్లు నగదు, పదిహేను కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కుటుంబంపై ఐటీ కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ క్లీన్ మనీ నినాదంతో గురువారం చేపట్టిన తనిఖీలు శనివారం కూడా కొనసాగాయి. తొలి రోజు 187 చోట్ల, రెండో రోజు 147 చోట్ల విచారణ సాగగా, తాజాగా 40 మందిని గురి పెట్టి అణువణువు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంతో పాటుగా వివిధ దేశాల్లోని సంస్థల్లో రూ.1500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టి ఉండటం, రూ. 1200 కోట్ల మేరకు ఆస్తుల రికార్డుల్ని ఐటీ వర్గాలు చేజిక్కించుకున్నట్లు సమాచారం. అలాగే, ఆరు కోట్ల మేరకు నగదు, రూ. 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 150 బ్యాంక్ ఖాతాల్ని సీజ్ చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక, నీలగిరి జిల్లా కొడనాడు, గ్రీన్ టీ ఎస్టేట్లలో పనిచేస్తున్న కార్మికులు 800 మంది ఖాతాల్లో పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ. రెండు లక్షలు చొప్పున 16 కోట్లు డిపాజిట్ చేసి, నగదును ఉంచినట్లు ఐటీ వర్గాలు గుర్తించాయి. అలాగే, దివంగత సీఎం జయలలిత ఆస్తులకు సంబంధించిన వీలునామ ఎక్కడ ఉందన్న అనుమానాలు బయలు దేరాయి. జయలలిత పేరిట కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్న విషయం తెలిసిందే. అయితే, వాటికి సంబంధించిన ఒరిజినల్ దస్తావేజులు ఈ దాడుల్లో తమ చేతికి చిక్కని దృష్ట్యా, వాటిని ఎక్కడ దాచి పెట్టి ఉన్నారో అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. ప్రధానంగా శశికళ భర్త నటరాజన్, అక్కవణితా మని కుమారుడు దినకరన్ మినహా తక్కిన కుటుంబ సభ్యులు, బంధువులు దివాకరన్, వివేక్, కృష్ణప్రియ, సఖిల, భాస్కర్, ఆడిటర్ సెల్వం, న్యాయవాది సెంథిల్, జ్యోతిష్యుడు చంద్రశేఖర్, శ్రీలక్షి జువెల్లరీ మేనేజింగ్ డైరెక్టర్ తెన్నరసు, కోయంబత్తూరులోని కాంట్రాక్టర్ ఆర్ముగ స్వామిలను ఐటీ వర్గాలు వారి వారి ఇళ్లలోనే విచారిస్తున్నాయి. అలాగే, చెన్నై వెలచ్చేరి ఫీనిక్స్ మాల్లోని 11 స్కీన్లతో కూడిన జాస్ సినిమాస్ ను రూ. వెయ్యి కోట్లు పెట్టి ఎలా కొన్నారో అన్న అంశంపై వివేక్‌ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు తెలిసింది. ఇక, సమగ్ర వివరాలతో సీబీఐ, ఈడీలకు నివేదికల్ని అందించేందుకు ఐటీ వర్గాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
శశికళ మళ్లీ బయటకు.. డౌటే?
సాక్షి, చెన్నై : పెరోల్ గడువు ముగియటంతో అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ నటరాజన్ తిరిగి జైలుకు పయనం అయ్యారు. భర్త నటరాజన్ అనారోగ్యం దృష్ట్యా బెంగళూరు కోర్టు ఆమెకు ఐదు రోజుల పెరోల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం తన మద్ధతుదారులకు, కార్యకర్తలకు అభివాదం చేసి అనంతరం ఆమె బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు బయలుదేరారు. సాయంత్రానికి ఆమె పరప్పన అగ్రహార జైల్లో రిపోర్టు చేయనున్నారు. కాగా, పెరోల్‌ను వ్యక్తిగత కారణాలకు మాత్రమే వినియోగించుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలపై చర్చలు జరపొద్దని నిబంధన విధించిన విషయం తెలిసిందే. అయితే ఆమె వాటిని అతిక్రమించినట్టు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఐదు రోజుల్లో ఆమె కేవలం రెండు రోజులు మాత్రమే ఆస్పత్రికి వెళ్లి భర్తను పరామర్శించారని.. అక్కడ కూడా ఐదారు గంటల కంటే ఎక్కువ సేపు లేదని ఆరోపణలు వినిపించాయి. ఇక మిగతా సమయమంతా పార్టీ కార్యకలాపాల్లోనే ఆమె మునిగి తేలిందని.. దినకరన్, న్యాయ నిపుణులతో పార్టీపై పట్టు కోసం చర్చలు జరిపిందన్న వార్తలు వచ్చాయి. దీంతో పరప్పన అగ్రహార జైలు ఆ అంశంను పరిశీలించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆమెకు పెరోల్ మంజూరు అవుతుందా? అన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. -
శశికళకు పెరోల్.. దినకరన్‌కు మరో షాక్
-
జైలు నుంచి చెన్నైకి శశికళ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీఎస్ శశికళ నటరాజన్ కు ఎట్టకేలకు పెరోల్ మంజూరు కావడంతో శుక్రవారం బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి విడుదల అయ్యారు. ఆమెకు జైలు వద్ద దినకరన్‌తో పాటు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఆమె భర్త నటరాజన్ అనారోగ్యం కారణంగా అయిదురోజుల పాటు పెరోల్ లభించిన విషయం తెలిసిందే. కాగా ఆమె వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితం కావాలని జైళ్లశాఖ సూచించింది. అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకునేందుకు తనను పెరోల్ పై విడుదల చేయాల్సిందిగా శశికళ కర్నాటక జైళ్ల శాఖను తొలుత కోరగా.. వారు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆమె కర్ణాటక కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఇరు రాష్ట్రాల స్పందనను కోరగా.. అభ్యంతరం లేదని తమిళనాడు ప్రభుత్వం, కర్నాటక ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. దీంతో జైళ్ల శాఖ ఆమెకు పెరోల్ ఇచ్చింది. నిజానికి ఆమె 15 రోజుల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఐదు రోజులకు మాత్రమే ఆమెకు కోర్టు పెరోల్ మంజూరు చేసింది. అదే సమయంలో వ్యక్తిగత అవసరాల కోసమే పెరోల్ ను వినియోగించుకోవాలని... రాజకీయ కార్యక్రమాలను హాజరు కావొద్దని ఆమెను కోర్టు ఆదేశించింది. కాగా, అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన శశికళ ప్రస్తుతం కర్నాటక లోని పరప్పన అగ్రహారం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆయనకు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. రెండాకుల గుర్తు కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తక్షణమే విచారణ ప్రారంభించాలని ఈసీని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. కాగా రెండాకుల గుర్తుల అంశాన్ని కొంత కాలం వాయిదా వేయాలంటూ దినకరన్ దాఖలు చేసిన అభ్యర్థనను గురువారం మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ గుర్తు విషయంలో సెప్టెంబర్ 15న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు త్వరగతిన తేల్చేందుకు ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువు విధించాలని దినకరన్ కోరగా.. అందుకు మధురై బెంచ్ న్యాయమూర్తులు వేణుగోపాల్, అబ్దుల్ ఖుద్ధోష్లు నిరాకరించారు. ముందుగా చెప్పినట్లు అక్టోబర్ 31లోగా ఈ వ్యవహారాన్ని తేల్చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది కూడా. దీంతో దినకరన్ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఆగ్రహంతో రగిలిపోతున్న శశికళ!
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ భవిష్యత్తు ఏమిటో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. శశికళ ఎంపిక చెల్లదంటూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేసిన ఫిర్యాదుపై ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఈనెల 20వ తేదీన తీర్పు చెప్పనున్నట్లు విశ్వసనీయ సమాచారం. శశికళ పదవి ఉండేనా ఊడేనా అనే చర్చతో అన్నాడీఎంకేలోని ఇరువర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఆ తరువాత పన్నీర్‌సెల్వం, శశికళ మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో పార్టీ రెండుగా చీలిపోయింది. చీలిక వర్గానికి సారథ్యం వహిస్తున్న పన్నీర్‌సెల్వం తన వర్గ ఎంపీల ద్వారా శశికళ ఎంపికపై సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఐదేళ్ల పాటు నిరంతరాయంగా సభ్యత్వంలేని శశికళ ప్రధాన కార్యదర్శి పదవికి అర్హురాలు కాదని పన్నీర్‌వర్గం వాదించింది. దీంతో ఆమెను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నామని శశికళ వర్గీయులు సమర్థించుకున్నారు. పార్టీలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అనే విధానమే లేదు, పార్టీ నియమావళిని సవరించే హక్కు ఎవరికీ లేదని పన్నీర్ వర్గం వాదించింది. ఇదే వాదనను సీఈసీ ముందుంచి శశికళను అనర్హురాలిగా ప్రకటించాలని ఫిర్యాదు చేసింది. పన్నీర్ ఇచ్చిన ఫిర్యాదుకు బదులివ్వాల్సిందిగా సీఈసీ శశికళకు నోటీసులు జారీచేసింది. అయితే శశికళకు బదులుగా ఆమె అక్క కుమారుడు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బదులిచ్చారు. దినకరన్ ఇచ్చిన వివరణను స్వీకరించేందుకు నిరాకరించిన సీఈసీ శశికళ నుంచి జవాబును రాబట్టింది. శశికళ ఇచ్చిన జవాబుపై పన్నీర్‌సెల్వం మరోసారి సీఈసీకి వివరణ ఇచ్చారు. పన్నీర్‌సెల్వం వివరణను శశికళ మరోసారి ఖండిస్తూ సీఈసీకి లేఖ రాసింది. ఇలా సీఈసీ కేంద్రంగా ఇరు వర్గాల మధ్య సుమారు నెలరోజులపాటు ఉత్తరాల పరంపర సాగి రెండు రోజుల క్రితం ముగిసింది. 24లోగా తీర్పు: ఇరుపక్షాల వాదనలపై సీఈసీ అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఆర్కేనగర్లో ఉప ఎన్నికలు జరుగుతుండగా అభ్యర్థులకు ఈనెల 24వ తేదీలోగా బీఫారం అందజేయాల్సి ఉంటుంది. బీఫారం అందజేసిన వారికి ఎన్నికల కమిషన్ ఎన్నికల చిహ్నాన్ని కేటాయిస్తుంది. అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నం రెండాకులు తమదేనంటూ శశికళ, పన్నీర్‌వర్గాలు వాదించుకుంటున్నాయి. అర్కేనగర్ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి అత్యవసర పరిస్థితులు నెలకొని ఉన్నందున ఈనెల 20వ తేదీన సీఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం వర్గీయుడైన పార్లమెంటు సభ్యుడు మైత్రేయన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, శశికళను అనర్హురాలిగా ప్రకటించడం, రెండాకుల చిహ్నం తమకు దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బలమైన ఆధారాలతో కూడిన వినతిపత్రాన్ని సీఈసీకి అందజేసినందున తమకే దక్కుతుందని విశ్వాసం ఉన్నట్లు చెప్పారు. పార్టీలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి విధానమే లేనపుడు శశికళ ఎంపిక ఎలా చెల్లుతుందని ఆయన అన్నారు. శశికళ ఎంపిక చెల్లదని సీఈసీ ప్రకటించగానే ఆమె చేసిన నియామకాలు రద్దు కాగలవు, పార్టీ తమ చేతుల్లోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అగ్రహార జైలులో శశికళ ఆగ్రహం: బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళ ఆగ్రహంతో రగలిపోతున్నట్లు సమాచారం. ఆస్తుల కేసులో శశికళ జైలు జీవితానికి నెలరోజులు పూర్తయ్యాయి. జైలుకు వెళ్లిన తొలి దినాల్లో పరామర్శకు వచ్చిన నేతలు క్రమేణా కనుమరుగయ్యారని ఆమె కోపంతో ఉన్నారు. నెలరోజుల్లో మంత్రులు సెంగొట్టయ్యన్, దిండుగల్లు శ్రీనివాసన్, సెల్లూరు రాజా, ఆర్ కామరాజ్ శశికళను చూసి వచ్చారు. ఆ తరువాత మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ బెంగళూరులో కలిశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎడపాడి పళనిస్వామి, కొందరు మంత్రులు బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే విశ్వాసపరీక్షలో నెగ్గిన తరువాత రావాల్సిందిగా చిన్నమ్మ ఆదేశించడంతో ఆగిపోయారు. అయితే విశ్వాసపరీక్షలో నెగ్గిన తరువాత సీఎం ఎడపాడి చిన్నమ్మను మరిచిపోయారు. ఇప్పటి వరకు బెంగళూరు వెళ్లకపోవడం శశికళ ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. సీఎం మాత్రమే కాదు కొన్ని రోజులుగా ఎవ్వరూ తనను చూసేందుకు రాకపోవడంపై శశికళ ఆసంతృప్తితో రగిలిపోతున్నారు. -
అనారోగ్యంతోనే జయ మృతి
► నివేదిక సమర్పించిన ఎయిమ్స్ ► తమిళనాడు ప్రభుత్వం వెల్లడి సాక్షిప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం జయలలిత అనారోగ్య కారణాలతోనే చనిపోయారని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధా రమైనవంది. జయకు జరిగిన చికిత్స వివరాలను బహిరంగంగా వెల్లడించ కూడదనే నిబంధన ఉన్నా అనవసర వదంతులకు తావివ్వకూడదనే కారణంతో ప్రకటన విడుదల చేసినట్లు ప్రభుత్వ వైద్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ మీడియాకు చెప్పారు. జయ మరణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఈ నెల 8న నిరాహారదీక్షకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో జయకు చికిత్సలో భాగస్వామ్యులైన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులు తమిళనాడు ప్రభుత్వానికి సోమవారం నివేదిక పంపారు. దీనిపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ‘గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీ రాత్రి జయలలిత శ్వాసకోశ ఇబ్బందితో స్పృహ కోల్పోయిన స్థితిలో అపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించినపుడు డీహైడ్రేషన్, జ్వరం, ఇన్ ఫెక్షన్ తో బాధ పడుతున్నట్లు తేలింది. ఆమెను వెంటనే క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలించి అంతర్జాతీయస్థాయి వైద్యాన్ని ప్రారంభిం చాం. డిసెంబరు 3న జయను పరీక్షించిన ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స చేసిన వైద్యులను అభినందించారు. అయితే 4న ఆమె తీవ్ర గుండెపోటుకు గురికాగా ఎక్మో చికిత్స అందజేశాం. అయినా దుర దృష్టవశాత్తూ 5వ తేదీ రాత్రి 11.30 గంట లకు జయ తుదిశ్వాస విడిచారు’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది. -
జయ వైద్య నివేదికల వెల్లడి!
-
పన్నీర్ వర్సెస్ పళని
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో తమిళ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. తన ఆశలపై సర్వోన్నత న్యాయస్థానం నీళ్లు చల్లడంతో పళనిస్వామిని శశికళ తెరపైకి తెచ్చారు. తన ప్రత్యర్థి పన్నీర్ సెల్వంకు పోటీగా పళనిస్వామిని నిలిపారు. ఇప్పటివరకు సీఎం పీఠం కోసం శశికళ, సెల్వం మధ్య జరిగిన పోరు ఇప్పుడు పన్నీర్ వర్సెస్ పళనిగా మారింది. తనను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్న పన్నీర్ సెల్వంను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించిన ‘చిన్నమ్మ’... వెంటనే పళనిస్వామిని శాసనసభా పక్ష నేతగా ఎన్నికయేలా చేశారు. తనకు అడ్డుపడిన సెల్వంకు సీఎంగా మరోసారి అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదలతో శశికళ పావులు కదుపుతున్నారు. శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలు ఏకగ్రీంగా తనను నాయకుడిగా ఎన్నుకున్నారని పళని ప్రకటించారు. అంతేకాదు పార్టీతో పన్నీర్ కు ఇక ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వం స్వరం మార్చారు. విభేదాలు మర్చిపోయి, ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ చీలిపోకుండా చూసుకుందామంటూ బుజ్జగింపులకు దిగారు. మరోవైపు పళనిస్వామికి మార్గం సుగమం చేసేందుకు శశి వర్గం ప్రయత్నిస్తోంది. గవర్నర్ తో భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరేందుకు సిద్ధమయింది. పన్నీర్, పళని పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే. -
నేనేంటో అసెంబ్లీలో చూపిస్తా: సెల్వం
చెన్నై: రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వారు పడుతున్న బాధలను తమ వద్ద వాపోతున్నారని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే వద్ద నలుగురు గూండాలు కాపలా ఉన్నారని వెల్లడించారు. తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మొసలి కన్నీరుతో ప్రజలను దృష్టిని మరల్చాలని శశికళ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన బలమేంటే అసెంబ్లీలో చూపిస్తానని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తమిళ పౌరుడు శశికళ సీఎం కాకూడదని కోరుకుంటున్నారని చెప్పారు. చెన్నైలోనే కాదు.. దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయన్నారు. జయలలిత భౌతిక కాయాన్ని చూడడానికి ఆమె మేనకోడలు దీపను కూడా అనుమతించలేదని వాపోయారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నానని, పాలన సవ్యంగానే నడుస్తోందని పన్నీర్ సెల్వం చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో మీడియాలో నాలుగో స్తంభం అని, రిసార్టులో ఏం జరుగుతుందో ప్రజలకు చూపాలని ఆయన కోరారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
ఇది మన ప్రతిజ్ఞ: శశికళ ఉద్వేగం
చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుతో అన్నాడీఏంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ఖిన్నురాలయ్యారు. ఎమ్మెల్యేల సమావేశంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. మన పార్టీని, ప్రభుత్వాన్ని ఎవరూ కదపలేరంటూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. సంక్షోభానికి పన్నీర్ సెల్వమే కారణమని, మన వేళ్లతో మన కంటినే పొడుస్తున్నారని వాపోయారు. పార్టీని చీల్చడానికి నానా కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కచ్చితంగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత అమ్మ సమాధి వద్ద ఫొటో దిగి ప్రపంచానికి చూపిద్దాం. ఇది మన ప్రతిజ్ఞ. మీరంతా కుటుంబంలా నాకు అండగా ఉంటే అన్నిటినీ సాధిస్తా. అమ్మ నాతో ఉన్నంత వరకు వెనుకడుగ వేసేది లేదు. 129 ఎమ్మెల్యేల మద్దతు నాకు ఉంది. విజయం సాధించాక దాన్ని అమ్మకు అంకితం ఇద్దాం. డీఎంకే కుట్రలను గెలిపించొద్దు. నేను మహిళను కాబట్టి నన్ను భయపెట్టాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవ’ని శశికళ పేర్కొన్నారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
శశికళ కేసు పూర్వాపరాలివి..
చెన్నై: సీఎం పీఠంపై కూర్చోవాలని ఆశపడిన జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ పిలవాలని కోరుతున్న ఆమెకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో ఆమె రాజకీయ జీవితం శూన్యమైంది. జయలలిత 1991-96 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆదాయానికి మించి రూ. 66 కోట్లకు పైగా ఆస్తులు సమీకరించుకున్నారనేది అసలు కేసు. ఇందులో జయలలితతో పాటు.. ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె బందువులు ఇళవరశి, వి.ఎన్.సుధాకరన్‌లు కూడా నిందితులుగా ఉన్నారు. ఆ కేసు పూర్వాపరాలివీ... * 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయి, డీఎంకే అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది జూన్ 14న సుబ్రమణ్యం స్వామి (ప్రస్తుతం బీజేపీ ఎంపీ) జయలలితపై ఫిర్యాదు చేశారు. డీఎంకే ప్రభుత్వం జయలలితపై కేసు నమోదు చేసింది. ఏడాది తర్వాత జయలలిత, శశికళ, ఇళవరశి, సుధాకరన్‌లపై ప్రత్యేక కోర్టు చార్జిషీటు నమోదు చేశారు. * జయలలితకు చెందిన చెన్నైలోని ఫామ్‌హౌస్‌లు, బంగళాలు, తమిళనాడులో వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో ఒక ఫామ్‌హౌస్, నీలగరి కొండల్లో ఒక టీ ఎస్టేట్, విలువైన ఆభరణాలు, పారిశ్రామిక షెడ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, పెట్టుబడులు, లగ్జరీ కార్ల శ్రేణి తదితర ఆస్తులు ఈ కేసు పరిధిలో ఉన్నాయి. * 1997లో జయలలిత నివాసంలో సోదాలు జరిపి 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 750 జతల చెప్పులు, 10,500 చీరలు, 91 వాచీలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని చెన్నైలోని రిజర్వు బ్యాంకు వాల్ట్ లో ఉంచారు. 2014లో వీటిని బెంగళూరుకు తరలించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. * 2001 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయి అన్నా డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడంతో.. కేసు విచారణను తమిళనాడు వెలుపలకు బదిలీ చేయాలని 2003లో సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసును కర్ణాటకకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. * 2014 సెప్టెంబర్ 27న తీర్పు చెప్పిన కర్ణాటక ప్రత్యేక కోర్టు.. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)ఇ, 13(2) సెక్షన్ల కింద జయలలితను దోషిగా ప్రకటించింది. శశికళ, మిగతా ఇద్దరిని ఐపీసీలోని 120బి, 109 సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించింది. నలుగురికీ నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. జయలలితపై రూ. 100 కోట్లు, మిగతా ముగ్గురిపై తలా రూ. 10 కోట్ల చొప్పున జరిమానా కూడా విధించింది. * ఆ తీర్పు వచ్చేటప్పటికి జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని దోషిగా నిర్ధారించి, జైలు శిక్ష వేయడం ఇదే తొలిసారి. ఈ తీర్పు ఫలితంగా జయ.. ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికీ అనర్హురాలయ్యారు. ఆ పదవులు కోల్పోయారు. కోర్టుకు హాజరైన జయలలితను తీర్పు వెలువడిన వెంటనే పారప్పణ అగ్రహార జైలుకు తరలించారు. శశికళ సహా మిగతా ముగ్గురినీ ఇతర జైళ్లకు పంపారు. * ప్రత్యేక కోర్టు తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసిన జయ తదితరులు.. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 2014 అక్టోబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు నలుగురికీ బెయిల్ మంజూరు చేసింది. 2015 మే 11వ తేదీన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి సి.ఆర్.కుమారస్వామి.. విచారణ కోర్టు తీర్పును కొట్టివేశారు. జయలలిత, శశికళ సహా మిగతా ఇద్దరిపైనా అభియోగాలను రద్దుచేశారు. దీంతో.. జయలలిత అదే నెల 23వ తేదీన మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. * జయ తదితరులను నిర్దోషులుగా విడుదల చేసిన కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును వేగంగా విచారించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. జయలలిత 2016 డిసెంబర్ 5వ తేదీన మరణించారు. శశికళ సహా మిగతా ముగ్గిరిపై కేసును కొనసాగించిన సుప్రీంకోర్టు తన సంచలన తీర్పును మంగళవారం ప్రకటించింది. (సాక్షీ నాలెడ్జ్ సెంటర్) శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ -
శశికళకు కారాగారమా? అధికారమా?
-
శశికళకు కారాగారమా? అధికారమా?
శశికళ భవితవ్యంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు (సాక్షి నాలెడ్జ్ సెంటర్): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ రాజకీయ భవిష్యత్తుపై సుప్రీంకోర్టు మంగళవారం ‘తీర్పు’ ఇవ్వనుంది. తమిళనాడులో నెలకొన్న ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని.. 20 ఏళ్ల నాటి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇవ్వబోయే ఈ తీర్పు మరో మలుపు తిప్పనుంది. జయలలిత 1991-96 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆదాయానికి మించి రూ. 66 కోట్లకు పైగా ఆస్తులు సమీకరించుకున్నారనేది అసలు కేసు. ఇందులో జయలలితతో పాటు.. ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె బందువులు ఇళవరశి, వి.ఎన్.సుధాకరన్‌లు కూడా నిందితులుగా ఉన్నారు. ఆ కేసు పూర్వాపరాలివీ... * 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయి, డీఎంకే అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది జూన్ 14న సుబ్రమణ్యం స్వామి (ప్రస్తుతం బీజేపీ ఎంపీ) జయలలితపై ఫిర్యాదు చేశారు. డీఎంకే ప్రభుత్వం జయలలితపై కేసు నమోదు చేసింది. ఏడాది తర్వాత జయలలిత, శశికళ, ఇళవరశి, సుధాకరన్‌లపై ప్రత్యేక కోర్టు చార్జిషీటు నమోదు చేశారు. * జయలలితకు చెందిన చెన్నైలోని ఫామ్‌హౌస్‌లు, బంగళాలు, తమిళనాడులో వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో ఒక ఫామ్‌హౌస్, నీలగరి కొండల్లో ఒక టీ ఎస్టేట్, విలువైన ఆభరణాలు, పారిశ్రామిక షెడ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, పెట్టుబడులు, లగ్జరీ కార్ల శ్రేణి తదితర ఆస్తులు ఈ కేసు పరిధిలో ఉన్నాయి. * 1997లో జయలలిత నివాసంలో సోదాలు జరిపి 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 750 జతల చెప్పులు, 10,500 చీరలు, 91 వాచీలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని చెన్నైలోని రిజర్వు బ్యాంకు వాల్ట్ లో ఉంచారు. 2014లో వీటిని బెంగళూరుకు తరలించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. * 2001 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయి అన్నా డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడంతో.. కేసు విచారణను తమిళనాడు వెలుపలకు బదిలీ చేయాలని 2003లో సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసును కర్ణాటకకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. * 2014 సెప్టెంబర్ 27న తీర్పు చెప్పిన కర్ణాటక ప్రత్యేక కోర్టు.. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)ఇ, 13(2) సెక్షన్ల కింద జయలలితను దోషిగా ప్రకటించింది. శశికళ, మిగతా ఇద్దరిని ఐపీసీలోని 120బి, 109 సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించింది. నలుగురికీ నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. జయలలితపై రూ. 100 కోట్లు, మిగతా ముగ్గురిపై తలా రూ. 10 కోట్ల చొప్పున జరిమానా కూడా విధించింది. * ఆ తీర్పు వచ్చేటప్పటికి జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని దోషిగా నిర్ధారించి, జైలు శిక్ష వేయడం ఇదే తొలిసారి. ఈ తీర్పు ఫలితంగా జయ.. ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికీ అనర్హురాలయ్యారు. ఆ పదవులు కోల్పోయారు. కోర్టుకు హాజరైన జయలలితను తీర్పు వెలువడిన వెంటనే పారప్పణ అగ్రహార జైలుకు తరలించారు. శశికళ సహా మిగతా ముగ్గురినీ ఇతర జైళ్లకు పంపారు. * ప్రత్యేక కోర్టు తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసిన జయ తదితరులు.. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 2014 అక్టోబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు నలుగురికీ బెయిల్ మంజూరు చేసింది. 2015 మే 11వ తేదీన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి సి.ఆర్.కుమారస్వామి.. విచారణ కోర్టు తీర్పును కొట్టివేశారు. జయలలిత, శశికళ సహా మిగతా ఇద్దరిపైనా అభియోగాలను రద్దుచేశారు. దీంతో.. జయలలిత అదే నెల 23వ తేదీన మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. * జయ తదితరులను నిర్దోషులుగా విడుదల చేసిన కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును వేగంగా విచారించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. జయలలిత 2016 డిసెంబర్ 5వ తేదీన మరణించారు. శశికళ సహా మిగతా ముగ్గిరిపై కేసును కొనసాగించిన సుప్రీంకోర్టు తన తీర్పును మంగళవారం ప్రకటించనుంది. తమిళనాడు కథనాలు చదవండి... గవర్నర్‌కు సలహా.. సెల్వంకు ఫస్ట్ ఛాన్స్? శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
శశికళకు సెల్వం స్ట్రాంగ్ వార్నింగ్
చెన్నై: శశికళ నటరాజన్ పై విమర్శల ధాటిని పన్నీర్ సెల్వం పెంచారు. తన మద్దతుదారులతో కలిసి మరోసారి మీడియా ముందుకు వచ్చిన సెల్వం తీవ్రస్థాయిలో శశికళపై విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకేను ఎవరూ హైజాక్ చేయలేరని, పార్టీని చీల్చే కుట్రలను సాగనివ్వబోమని గర్జించారు. త్వరలోనే శుభవార్త వింటారని పునరుద్ఘాటించారు. తనకు మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తమిళ ప్రజలపై నాకు గౌరవం ఉందని చెప్పారు. ఎంజీఆర్, జయలలిత బాటలో నడుస్తానని అన్నారు. లక్షల కష్టాలు వచ్చినా ప్రజలు మేలు చేయాలన్నదే 'అమ్మ' అభిమతమన్నారు. పార్టీ నుంచి శశికళను బహిష్కరిస్తామని హెచ్చరించారు. పార్టీ తనను బహిష్కరించడానికి శశికళ ఎవరని ప్రశ్నించారు. వేద నిలయం నుంచి శశికళను ప్రజలు తరిమికొడతారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. -
సీఎంగా శశికళ ఎన్నికపై అనుమానాలు!
-
శశికళ సీఎం అయ్యే అవకాశాల్లేవా?
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్న శశికళకు ఇంకా ఏమైనా అడ్డంకులున్నాయా? సుమారు వంద మంది వరకు ఎమ్మెల్యేలు ఆమె వెంట ఉన్నట్లుగా ఇప్పటికి తెలుస్తున్నా, ఇంకా అభ్యంతరాలు ఏవైనా వస్తాయా? అవును.. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు కొన్ని కంపెనీలలో వాటాలున్నాయి. ఆ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో వ్యాపారం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆమె ముఖ్యమంత్రి అయితే, ఆ కంపెనీలకు లబ్ధి కలిగించాలన్న 'స్వామిభక్తి' అధికారుల్లో సహజంగానే ఉంటుంది కాబట్టి 'ప్రయోజనాల మధ్య వైరుధ్యం' కింద శశికళకు ముఖ్యమంత్రి పదవి అందకుండా పోయే అవకాశం లేకపోలేదన్నది నిపుణుల వాదన. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత 'ట్రంప్ ఎంపైర్'కు దూరం కావాల్సి వచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇలాంటి పరిస్థితే చిన్నమ్మకు కూడా ఎదురవుతుందని అంటున్నారు. మరోవైపు గవర్నర్ విద్యాసాగర్ రావు మళ్లీ ఎప్పుడు తన కార్యాలయానికి వచ్చి బాధ్యతలు చేపడతారో ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన వచ్చేసరికల్లా ప్రతిపక్షాలు శశికళ వ్యాపార ప్రయోజనాలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లిక్కర్ రీటైలింగ్ సంస్థ టాస్మాక్‌కు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని సరఫరా చేసే మిడాస్ డిస్టిలరీస్‌లో శశికళ ప్రధాన వాటాదారు. ఈ విషయాన్ని పలువురు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు కూడా తప్పుపడుతున్నారు. ఈ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న పత్రాలు పరిశీలించి ఏ విషయమూ తేలుస్తామని ఒక సంస్థ ప్రతినిధి వెంకటేశన్ చెప్పారు. 2003లో స్థాపించిన మిడాస్ సంస్థకు 2009-11 సంవత్సరాల మధ్య రూ. 360 కోట్ల టర్నోవర్ ఉంది. కానీ ఒక్కసారిగా 2014-15 నాటికి ఆ సంస్థ టర్నోవర్ రూ. 1400 కోట్లకు పెరిగిపోయింది. జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాతకు, అంతకంటే ముందు నాటికి ఈ సంస్థ వ్యాపారంలో అనూహ్య వృద్ధి కనిపించడాన్నే అనుమానంగా చూస్తున్నారు. అమ్మచాటు చిన్నమ్మగా ఉన్నప్పుడే వ్యాపారాలు ఇలా ఉంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇంకెలా ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవే తరహా ప్రశ్నలను కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా లేవనెత్తుతున్నారు. శశికళపై కొన్ని సీరియస్ కేసులు ఉన్నాయని, ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులు తమిళనాడు ప్రభుత్వంతో వ్యాపారం చేస్తున్నారని, అలాంటప్పుడు అది ప్రత్యక్షంగానే ప్రయోజన వైరుధ్యం అవుతుందని ఆయన చెప్పారు. పైగా ఇటీవలే శశికళ సన్నిహిత బంధువు ఒకరు 'జాజ్ సినిమాస్' సంస్థను టేకోవర్ చేశారని, దాంతోపాటు ఈ వ్యక్తి అనేక వెంచర్లలో ఉన్నారని, ఇదే కాక.. ఒకప్పుడు వీడియో క్యాసెట్లు అద్దెకు ఇస్తూ ఉన్న వ్యక్తి ఇంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగారన్న విషయం మీద కూడా దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష డీఎంకే వాదిస్తోంది. ఇవన్నీ పక్కన పెట్టినా.. మరో నాలుగైదు రోజుల్లో జయలలిత ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. ఆ కేసులో శశికళ ఎ2గా ఉన్నారు. దాంట్లో శిక్ష పడితే మాత్రం.. ఇక ఇప్పట్లో ముఖ్యమంత్రి పదవి మీద ఆశలను ఆమె వదులుకోవాల్సిందే. -
సీఎంగా శశికళ ఎన్నికపై అనుమానాలు!
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళా నటరాజన్‌ను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకోవడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ, నేడు పార్టీ నేతలతో కీలక భేటీ అనంతరం ఆమెను సీఎంగా ఎన్నుకున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో మురళీధర్ రావు మీడియాతో మాట్లాడారు. శశికళ ఎన్నిక విషయంలో ఎన్నో అనుమానాలున్నాయని, అన్ని అంశాలను ఇంఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పరిశీలిస్తున్నారని చెప్పారు. తమిళనాడు అధికార పార్టీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలన్నది తమ అభిమతం కాదని మురళీధర్ రావు తెలిపారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా విషయంలో, ఆయన తిరుగుబాటు చేయడంలో బీజేపీ పాత్ర ఉందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. -
తమిళనాట పరిణామాలపై కాంగ్రెస్ నేత దిగ్భ్రాంతి!
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఎన్నికకావడంపై కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులోని ప్రస్తుత పరిస్థితులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. శశికళకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదని, ముఖ్యమంత్రి కావడానికి ఆమెకు అర్హత లేదని ఆయన వ్యాఖ్యానించారు. శశికళపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. శశికళను ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నప్పటికీ, ఆమె ప్రమాణస్వీకారంపై అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో చిన్నమ్మ ప్రమాణం ఎప్పుడనేది ఇంకా తేలడం లేదు. -
శశికళ రాజకీయ చతురత!
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ మరోసారి తన రాజకీయ చతురత ప్రదర్శించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తాను పెట్టుకున్న ముహుర్తానికి కేంద్రం పరోక్షంగా ఆటంకాలు కల్పించినా ఆమె నిబ్బరం కోల్పోలేదు. రాజకీయ వర్గాలు శశికళ ప్రమాణస్వీకార ముహుర్తం గురించి చర్చోపచర్చలు జరుపుతుంటే ఆమె మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రం సంధించారు. రాజకీయాలకు సంబంధం లేని అంశం మీద లేఖ రాసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. శ్రీలంక అదుపులోకి తీసుకున్న 35 మంది తమిళ మత్స్యకారులు, 120 పడవలను వెంటనే విడిపించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమె లేఖ రాశారు. తమిళ రాజకీయమంతా తన చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో శశికళ విభిన్నంగా స్పందించడం ఆమె విలక్షణతను చాటిచెబుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జల్లికట్టు నిషేధం ఎత్తివేయాలని కోరుతూ ఇంతకుముందు ప్రధాని మోదీకి శశికళ లేఖ రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని ఆమె ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని జోక్యం కోరాలని భావిస్తున్నారు. శశికళ ముఖ్యమంత్రి కాకుండా చూడాలని కోరుతూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
శశికళ.. నా ఓటు నీకు కాదు..!
చిన్నమ్మ తీరుపై ఆగ్రహంతో ర్యాపర్ పాట.. 'ప్రజాస్వామ్యం చచ్చిపోయింది'.. 'నా ఓటు నీకు కాదు' అంటూ పరోక్షంగా శశికళను ఎత్తిచూపుతూ సోఫియా అష్రఫ్ పాడిన పాట ఇప్పుడు సోషల్‌మీడియాలో దుమారం రేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ఎన్నిక కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అర్ధరాత్రి చెన్నైలోని బిన్నీరోడ్డులో ఆమె తన బృందంతో పాడిన ఈ సాంగ్ వైరల్‌గా మారిపోయింది. 'ఓట్ల కోసమే ప్రకటనలు.. విశ్వసనీయత లేని హామీలు. ఎవరూ మంచి వారు కారు.. నా ఓటు నీకు కాదు..' అంటూ సూటిగా ఆమె పాడిన పాట నెటిజన్లను కదిలిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పార్టీ నేతలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను ఎన్నుకున్న నేపథ్యంలో ఈ పాటను సోఫియా రూపొందించారు. బిన్నీరోడ్డు పరిసరాల్లో తిరుగుతూ పాడిన ఈ పాటను చిత్రీకరించి.. సోషల్‌మీడియాలో పెట్టగా.. ఆ వీడియోను ఇప్పటికే నాలుగువేలకుపైగా లైక్ చేశారు. ఒక లక్ష 95వేల మంది వీక్షించారు. 3.6వేల మంది షేర్ చేసుకున్నారు. దోపిడీదారులు, లంచగొండులు, ద్రోహులు, పార్టీ మారే ఊసరవెల్లులు అంటూ సాగే ఈ పాటలో రాజకీయ నాయకులు ఇస్తున్న ఉచిత హామీల ఔచిత్యాన్ని ప్రశ్నించారు. నేనేమైనా సాయమడిగానా? నేనేమైనా నీ సీటు అడిగానా? అంటూ కడిగిపారేశారు. చివరకు 'ప్రజాస్వామ్యం చచ్చిపోయింది' అంటూ ఆవేదనగా పాటను ముగించారు. -
చిన్నమ్మ ముహూర్తం పెట్టుకున్నా..!
జయలలితకు అనునిత్యం నీడలా వెన్నంటి ఉంటూ.. ఆమె మరణం తర్వాత కూడా అంతా తానై వ్యవహరించిన చిన్నమ్మ శశికళకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నక్షత్రం, జాతకాలను బట్టి మంగళవారం ఉదయం 8.45-9.30 మధ్యలో ప్రమాణస్వీకారం చేయించాలని ముందు అనుకున్నారు. ఇందుకోసం మద్రాస్ యూనివర్సిటీలో భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిపోయి అక్కడే ఉండిపోయారు. ఆయన చెన్నై రాకపోవడంతో ఇక ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో చిన్నమ్మ శశికళ ప్రమాణాన్ని వాయిదా వేస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. (చదవండి: శశికళ ప్రమాణంపై సందిగ్ధత) ఒకవైపు సెంథిల్ కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడంతో పాటు జయలలిత-శశికళ మీద ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు చెప్పడం లాంటి పరిణామాల నేపథ్యంలో గవర్నర్ న్యాయసలహాకు వెళ్లారు. ఒకవైపు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామాను ఆమోదించిన గవర్నర్, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను, సొలిసిటర్ జనరల్ తదితరులను కలివారు. వాళ్ల సలహా తీసుకున్నప్పుడు ఇప్పటికిప్పుడు హడావుడిగా ప్రమాణస్వీకారం చేయించకపోవడమే మంచిదన్న అభిప్రాయం వచ్చినట్లు తెలిసింది. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు శశికళకు వ్యతిరేకంగా వచ్చి, శిక్ష పడితే ఆమె వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుందని.. అది అంత మంచి పరిణామం కాదు కాబట్టి కొన్నాళ్లు వేచి ఉంటేనే మంచిదని సూచించారంటున్నారు. దాంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో గవర్నర్ విద్యాసాగర్ రావు ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిపోయారు. ఢిల్లీకి స్టాలిన్.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్ ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న ప్రతిపక్ష డీఎంకే కూడా వేగంగా పావులు కదుపుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ హుటాహుటిన బయల్దేరి ఢిల్లీ వెళ్లారు. ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఉన్నందున రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నందున శశికళకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వకూడదని కూడా ఆయన అంటున్నారు. -
చిన్నమ్మ ముహూర్తం పెట్టుకున్నా..!
-
ఢిల్లీకి స్టాలిన్.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్
-
సీఎంగా శశికళ ప్రమాణాన్ని అడ్డుకోండి
సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అక్రమాస్తుల కేసులో జయలలితతోపాటు శశికళ కూడా నిందితురాలుగా ఉన్నారని, ఈ కేసులో వారంలోగా తీర్పు రానున్న నేపథ్యంలో అంతవరకు ఆమె సీఎంగా ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వం చేసిన అప్పీల్‌పై వారంలోగా తీర్పు వెలువరించే అవకాశముందని సుప్రీంకోర్టు సంకేతాలు ఇచ్చిన వెంటనే.. సత్తా పంచాయత్ ల్యాకం స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి అయిన సెంథిల్ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు వాదనలు వినే అవకాశముంది. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళా నటరాజన్ కూడా సహ నిందితురాలు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో తీర్పు మరో వారం రోజుల్లో వెలువడే అవకాశముంది. ప్రత్యేక కోర్టు ఈ కేసులో జయలలిత, శశికళలను దోషులుగా నిర్ధారించగా, కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టేసి.. ఇద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ కేసులోనే ఇప్పుడు త్వరలో తీర్పు వెలువడబోతోంది. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన సమయంలో జయలలిత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శశికళ మంగళవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది. ఆ తీర్పు గనక శశికళకు వ్యతిరేకంగా ఉండి, ఆమెను దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తే మాత్రం ఆమె సైతం తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. -
శశికళ పదవికి సుప్రీం తీర్పు గండం?
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళా నటరాజన్ కూడా సహ నిందితురాలు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో తీర్పు మరో వారం రోజుల్లో వెలువడబోతోంది. ప్రత్యేక కోర్టు ఈ కేసులో జయలలిత, శశికళలను దోషులుగా నిర్ధారించగా, కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టేసి.. ఇద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ కేసులోనే ఇప్పుడు త్వరలో తీర్పు వెలువడబోతోంది. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన సమయంలో జయలలిత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈనెల తొమ్మిదో తేదీన శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది. ఆ తీర్పు గనక శశికళకు వ్యతిరేకంగా ఉండి, ఆమెను దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తే మాత్రం ఆమె సైతం తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆమె చేపట్టే పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయి, మరోసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం తెరమీదకు వచ్చే అవకాశాలు లేకపోలేవని అంటున్నారు. -
క్రిమినల్‌ను సీఎంగా ఎలా చేస్తారు?
నేర చరిత్ర ఉన్న శశికళా నటరాజన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎలా చేస్తారంటూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈనెల ఐదో తేదీన రాసిన లేఖలో శశికళకు ఉన్న క్రిమినల్ నేపథ్యం మొత్తాన్ని ఆమె ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం, అన్నాడీఎంకే నాయకులంతా ఏకగ్రీవంగా శశికళా నటరాజన్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం తెలిసిందే. దాంతో చిన్నమ్మ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి మార్గం మొత్తం సుగమమైంది. దాంతో ఆమె తమిళనాడుకు మూడో మహిళా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఈనెల 9వ తేదీని ముహూర్తంగా కూడా పెట్టుకున్నారు. జయలలిత అక్రమాస్తులకు సంబంధించిన కేసు సహా పలు కేసులలో శశికళ పేరు ఉంది. ఆ కేసులో జయలలిత నిర్దోషి అని కోర్టు తేల్చిన విషయం తెలిసిందే. కానీ, మిగిలిన కేసులు మాత్రం చిన్నమ్మ మీద బాగానే ఉన్నాయని శశికళా పుష్ప అంటున్నారు. ఆమెను ముఖ్యమంత్రి చేస్తే.. రాజకీయ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని లేఖలో పేర్కొన్నారు. శశికళ అసలు పార్టీకి ఎలాంటి పని చేయలేదని, జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా శశికళను ఆమె ముఖ్యమంత్రి పదవికి సూచించకుండా.. పన్నీర్ సెల్వానికి బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. శశికళ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఎక్కువవుతాయని, రాజకీయాల్లో నేరచరిత్ర పెచ్చుమీరుతుందని అన్నారు. దానివల్ల రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందని కూడా చెప్పారు. అందువల్ల శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆహ్వానించవద్దని ప్రధానమంత్రితో పాటు తమిళనాడు గవర్నర్‌ను కూడా తాను గట్టిగా కోరతున్నట్లు ఆమె చెప్పారు. -
సీఎం కోరిక మేరకే: శశికళ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం విన్నపం మేరకు ఆయన స్థానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నట్టు అన్నా డీఎంకేం ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ప్రకటించారు. జయలలిత మరణించిన తర్వాత పార్టీ పగ్గాలు స్వీకరించాలని తొలుత పన్నీరు సెల్వం తనను కోరారని, ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి కావాలని కోరిన తొలుత వ్యక్తి కూడా ఆయనేనని చెప్పారు. ఆదివారం జరిగిన అన్నా డీఎంకే శాసనసభ పక్ష సమావేశంలో శశికళను నాయకురాలిగా ఎన్నుకోగా, ముఖ్యమంత్రి పదవికి సెల్వం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు. అమ్మ అడుగుజాడల్లో నడుస్తానని పేర్కొన్నారు. తమిళనాడు మూడో మహిళా ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టబోతున్నారు. -
సీఎం అయ్యేందుకు ఏ అర్హత ఉంది?
-
సీఎం అయ్యేందుకు ఏ అర్హత ఉంది?
చెన్నై: తమిళనాడులో అధికార అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏ అర్హత ఉందని ప్రతిపక్ష డీఎంకే నాయకులు విమర్శించారు. శశికళకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదని, కనీసం ఎమ్మెల్యే కూడా కాదని, ఆమె విధానాలు ఏంటో తెలియవని, ఆమె ముఖ్యమంత్రిగా ఎలా బాధ్యతలు చేపడుతారని డీఎంకే సీనియర్ నేత అన్నారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా శశికళను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె ముఖ్యమంత్రి అయ్యేందకు వీలుగా ప్రస్తుతం సీఎం పన్నీరు సెల్వం రాజీనామా చేశారు. అన్నాడీఎంకే నిర్ణయాలను డీఎంకే తప్పుపట్టింది. తమిళనాడుకు ఇది చీకటి దినమని పేర్కొంది. అంతకుముందు ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెండ్ స్టాలిన్ స్పందిస్తూ.. జయలలిత కుటుంబ సభ్యులకు, ఆమె ఇంట్లో ఉన్న వాళ్ల కోసం ప్రజలు ఓట్లు వేయలేదని అన్నారు. ప్రస్తుత అన్నా డీఎంకే ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వర్గాలుగా చీలిపోయారని పేర్కొన్నారు. -
డేట్ ఫిక్స్ చేసిన చిన్నమ్మ
-
డేట్ ఫిక్స్ చేసిన చిన్నమ్మ
చెన్నై: ఊహాగానాలు నిజమయ్యాయి. తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారాయి. జయలలిత నెచ్చెలి, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 9:30 గంటలకు తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణం చేయనున్నారు. తమిళనాడుకు మూడో మహిళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తానని శశికళ అన్నారు. ఆదివారం పోయెస్ గార్డెన్లో జరిగిన అన్నా డీఎంకే శాసనసభ పక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే చిన్నమ్మ సీఎం అయ్యేందుకు వీలుగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవికి శశికళ పేరును పన్నీరు సెల్వం ప్రతిపాదించగా, మంత్రులు, ఎమ్మల్యేలందరూ మద్దతు పలికారు. శాసనసభ పక్ష నిర్ణయాన్ని తెలియజేసేందుకు ఎమ్మెల్యేలు.. గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించి నేటికి 60 రోజులయ్యింది. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 5న జయలలిత మరణించారు. ఆ తర్వాత సీఎంగా పన్నీరు సెల్వం, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. 60 రోజుల తర్వాత అన్నా డీఎంకే రాజకీయాలు మారిపోయాయి. పార్టీని పూర్తిగా తన ఆధిపత్యంలోకి తెచ్చుకున్న శశికళ.. ఇప్పుడు తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. -
సీఎం రాజీనామా, చిన్నమ్మకు లైన్ క్లియర్
చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఇటీవల ప్రచారం జరిగినట్టుగా అధికార అన్నా డీఎంకేలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి, జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా సీఎం పన్నీరు సెల్వం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఆదివారం చెన్నై పోయెస్ గార్డెన్లో జరిగిన అన్నా డీఎంకే శాసనసభ పక్ష సమావేశంలో పన్నీరు సెల్వం రాజీనామా లేఖను శశికళకు అందజేశారు. ఈ సమావేశంలో పార్టీ శాసనసభ పక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం పదవికి శశికళను పేరును పన్నీరు సెల్వం ప్రతిపాదించగా, మంత్రులు, అన్నా డీఎంకే ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారు. దీంతో శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రెండు, మూడు రోజుల్లో శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం పన్నీరు సెల్వం, శశికళ అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. జయలలిత మరణించిన తర్వాత తమిళనాడు సీఎంగా పన్నీరు సెల్వం, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత శశికళ సీఎం పీఠంపై కూర్చునేందుకు పావులు కదుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా తన సన్నిహితులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. అలాగే ఆమె ఆదేశాల మేరకు జయలలితకు సన్నిహితులైన అధికారులు వైదొలిగారు. శశికళను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునేందుకే ఈ రోజు అన్నా డీఎంకే శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారన్న ఊహాగానాలు నిజమయ్యాయి. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు పన్నీరు సెల్వం నిరాకరిస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా రాజీనామా చేసినట్టు సమాచారం. -
సీఎం రాజీనామా! చిన్నమ్మకు లైన్ క్లియర్
-
జనం ఓట్లేసింది జయకు.. ఆమె ఫ్యామిలీకి కాదు
- శశికళను ప్రజలు సీఎంగా అంగీకరించరు - డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కామెంట్స్ చెన్నై: తమిళనాడు అధికార పార్టీ ఏఐఏడీఎంకేలో గంటగంటకూ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అజెండా ప్రకటించకుండా శాసనసభా పక్ష సమావేశానికి పిలుపునివ్వడంతో మొదలైన అలజడి.. శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారన్న వార్తలతో పతాకస్థాయికి చేరింది. ఎమ్మెల్యేలను చీల్చడంద్వారా సీఎం పన్నీర్ సెల్వం శశికళకు షాకిచ్చారని, జయ మేనకొడలు దీపకు కూడా కొందరు ఎమ్మెల్యేల మద్దతు ఉంన్నదని, రెండాకుల పార్టీ మూడు ముక్కలైందని.. ఆదివారం ఉదయం నుంచి రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాలపై విపక్ష డీఎంకే ఘాటుగా స్పందించింది. తమిళనాడు ప్రతిపక్షనేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏఐడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామన్న స్టాలిన్.. శశికళనుకానీ, జయలలిత ఇతర కుటుంబసభ్యులనుకానీ ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరించరని అభిప్రాయపడ్డారు. ‘గత ఎన్నికల్లో తమిళ ప్రజలు ఓటేసింది జయలలితకేకానీ, ఆమె కుటుంబసభ్యులకు కాదు. కాబట్టి శశికళనో, మరొకరినో సీఎంగా ప్రజలు ఒప్పుకోరు’అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
పెటాను నిషేధిస్తాం: అన్నా డీఎంకే చీఫ్ శశికళ
- జల్లికట్టు కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం చెన్నై: జల్లికట్టు అంశంపై తమిళనాడు రగిలిపోతోంది. సాంప్రదాయ క్రీడపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలనే డిమాండ్‌చేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహిస్తున్నారు. బుధవారం చెన్నై నగరంలోని మెరీనా బీచ్‌కు లక్షల సంఖ్యలో చేరుకున్న ప్రజలు జల్లికట్టును పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోనూ నిరసనలు మిన్నంటాయి. ప్రజల అభ్యర్థన మేరకు జల్లికట్టుపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, సుప్రీం ఉత్తర్వులను నిలుపుదలచేసేలా ఆర్డినెన్స్ జారీచేయాలని అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళా నటరాజన్ కోరారు. జల్లికట్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి, నిషేధానికి కారణమైన జంతు కారుణ్య సంస్థ 'పెటా'ను తమిళనాడులో నిషేధిస్తామని, ఆ మేరకు అవసరమైన న్యాయప్రక్రియను ప్రారంభించామని శశికళ పేర్కొన్నారు. తమిళనాడు వ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనలపై ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అధికారులతో చర్చించారు. ఆందోళనలు విరమించాలని ప్రజలను కోరారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేతే ప్రధాన ఎజెండాగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్న నేపథ్యంలో సీఎం ఈ ప్రకటన చేశారు. ఇదిలాఉంటే, జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించనుంది. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాల తేదీలు వెల్లడయ్యేఅవకాశంఉంది. (జల్లికట్టు వేండమా, నిషేధం వేండమా?) -
చిన్నమ్మకు వణుకు పుట్టిస్తోంది
చెన్నై: జయలలిత వారసురాలిగా చక్రం తిప్పాలని ఆశిస్తున్న అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్‌కు జయ మేనకోడలు దీపా జయకుమార్ వణుకు పుట్టిస్తున్నారు. తానే జయలలితకు అసలైన వారసురాలినంటూ చిన్నమ్మకు సవాల్ విసురుతున్నారు. దీపకు పెరుగుతున్న జనాదరణను చూసి శశికళ వర్గీయులు షాకవుతున్నారు. అన్నా డీఎంకే రాజకీయాలు శశికళ వర్సెస్ దీప అన్నట్టుగా మారాయి. దివంగత నేత ఎంజీఆర్ శతజయంతి వేడుకలు ఇరు వర్గాల బలప్రదర్శనకు వేదికయ్యాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, జయలలిత రాజకీయ గురువు ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా మంగళవారం ఉదయం చెన్నై మెరీనా బీచ్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు అన్నా డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. దీప మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీపకు మద్దతుగా నినాదాలు చేస్తూ, జయ వారసురాలు ఆమేనంటూ బలప్రదర్శనకు దిగినంత పనిచేశారు. దీంతో శశికళ వర్గం ఖంగుతింది. ఎంజీఆర్ సమాధి వద్దకు తరలి వచ్చిన శశికళ వర్గీయులు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేయడంతో మెరీనా బీచ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎంజీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన దీప చుట్టూ భారీ సంఖ్యలో మద్దతుదారులు గుమిగూడారు. అభిమానుల తాకిడి వల్ల ఆమె సమాధి దగ్గరకు వెళ్లడానికి చాలా సమయం పట్టింది. ఈ రోజు దీప రాజకీయ ప్రకటన చేస్తారని వార్తలు రావడంతో అన్నా డీఎంకే శ్రేణులు ఆసక్తి చూపాయి. శశికళను వ్యతిరేకిస్తున్న నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు.. దీపకు మద్దతు తెలుపుతున్నారు. రాజకీయాల్లోకి రావాలంటూ దీపపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం దీప రాజకీయ ప్రకటన చేస్తారు. తాజా పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మకు దీప సవాల్‌గా మారారు. అన్నా డీఎంకే రాజకీయాలు ఎటు దారితీస్తాయి? జయ వారసురాలిగా ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? శశికళ, దీప రాజకీయ భవితవ్యం ఏమిటన్నది కాలమే నిర్ణయిస్తుంది. -
ప్రధాని మోదీకి శశికళ లేఖ
చెన్నై: జల్లికట్టును అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ కోరారు. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం ఆమె లేఖ రాశారు. ప్రధాని వెంటనే జోక్యం చేసుకుని అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జల్లికట్టు తమిళనాడులు సంప్రదాయ క్రీడ, సంక్రాంతికి గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని నిర్వహించడం పండగలో భాగంగా పరిగణిస్తారని లేఖలో శశికళ పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ఈ విషయంపై ఇంతకుముందే ప్రధాని మోదీకి లేఖ రాశారు. అన్నాడీఎంకే ఎంపీలు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్ దవేను కలిసి జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో పొంగల్‌ను తప్పనిసరి సెలవుగా ప్రకటించాలని కోరుతూ అన్నాడీఎంకే చేసిన అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పొంగల్‌ను తప్పనిసరి సెలవుగా మోదీ సర్కారు ప్రకటించింది. -
పోయెస్ గార్డెన్ వద్ద భద్రత పెంపు
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న నేపథ్యంలో.. పోయెస్ గార్డెన్‌లోని దివంగత జయలలిత నివాసానికి పోలీసు భద్రత పెంచారు. గతంలో జయలలితకు బెదిరింపులు ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఆమెకు జడ్ ప్లస్ భద్రతను కల్పించింది. అదే సమయంలో ఆమె ఇంటికి పోలీసు భద్రతను కూడా అధికంగానే కల్పించారు. జయలలిత మరణించిన తర్వాత జడ్ ప్లస్ భద్రతను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ భద్రతా ఏర్పాట్లలో ఉన్న పోలీసు బలగాలను తగ్గించారు. ఈ నేపథ్యంలో మళ్లీ శశికళ ముఖ్యమంత్రి పదవి స్వీకరించాలంటూ అన్నాడీఎంకే వర్గీయులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పోయెస్ గార్డెన్లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. పాదచారులు, వాహన చోదకులను తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తున్నారు. -
తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్
చెన్నై : జయలలిత మరణం, పన్నీర్ సెల్వం సీఎం గద్దెనెక్కడం, శశికళ నటరాజన్ అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడం తదితర పరిణామాల నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బలనిరూపణకు సిద్ధపడాలని ప్రతిపక్ష పార్టీ డీఎంకే డిమాండ్ చేసింది. వెంటనే శాసనసభను సమావేశపరచాలని సూచనలు చేసింది. కాగా ముఖ్యమంత్రి పీఠం మీద జయలలిత నిచ్చెలి శశికళ నటరాజన్‌ను కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం నుంచి పన్నీర్ సెల్వాన్ని తొలగించి ఆయన స్థానంలో శశికళను సీఎం చేయాలన్న డిమాండ్ రోజురోజుకు ఊపందుకుంటోంది. తాజాగా ఐదుగురు మంత్రులు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఇక జయలలిత మరణం తర్వాత ఆమె స్థానంలో అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ పదవిని చేపట్టడంతో.. ఇదే అదనుగా ఆమెకే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కట్టబెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం కూడా ముఖ్యమంత్రి బలనిరూపణకు సిద్ధం కావాలని డిమాండ్ చేయటం తమిళ రాజకీయాలు ఏ క్షణంలో ఏవిధంగా మలుపు తిరుగుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేంద్రం మద్దతు తనకే ఉందని బలంగా నమ్ముతున్న పన్నీరు సెల్వం రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా తన సీఎం సీటును కాపాడుకోవడానికి లోలోపల ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆయన ప్రధాని మోదీనికి కూడా కలిశారు. రాష్ట్రానికి వరద సాయం అందించాలంటూ, అలాగే జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ పన్నీరు సెల్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
జయ కారులోనే శశికళ..!
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తమిళులందరికీ అమ్మ జయలలిత ఆరాధ్యదైవం అని పేర్కొన్నారు. అయితే, అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టేందుకు ఆమె పోయెస్ గార్డెన్ నుంచి పార్టీ కార్యాలయానికి జయలలిత వాడిన కారులోనే రావడం విశేషం. శశికళ పార్టీ పగ్గాలు చేపడుతున్న సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి 'చిన్నమ్మ', 'చిన్నమ్మ' అంటూ నినాదాలతో హోరెత్తించారు. పలువురు అభిమానులు శశికళ ఫొటోలు, నినాదాలు ఉన్న టీషర్టులు ధరించి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
జయ కారులోనే శశికళ..!
-
అమ్మ అడుగుజాడల్లో.. శశి శకం!
-
అమ్మ అడుగుజాడల్లో.. శశి శకం!
అంతా ఊహించినట్టుగానే దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ నటరాజన్ అధికార అన్నాడీఎంకే పగ్గాలను చేపట్టారు. చెన్నైలో గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే, జయలలిత వారసురాలిగా తనను తాను శశికళ నిరూపించుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్లో ఆమె ఆరితేరాల్సి ఉంటుంది. పార్టీ పగ్గాలు చేపట్టడం కన్నా అసలు సిసలు సవాళ్లను ఇకముందు ఆమె ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది జయలలిత ఎదుర్కొన్న రాజకీయ ప్రస్థానం కన్నా కష్టతరమైనది కావొచ్చు. మొదటగా చెప్పాలంటే జయలలిత తరహాలో శశికి సినీ ఛరిష్మా లేదు. జయకు ఉన్నంత రాజకీయ అనుభవం కూడా లేదు. ఎంజీఆర్ నాయకత్వంలో ఎన్నోఏళ్లు పనిచేసి.. అపారమైన రాజకీయ అనుభవాన్ని జయ పోగేసుకున్నారు. శశికళ విషయానికొస్తే ఎప్పుడూ విషాదగ్రస్తగా కనిపించే ఆమె ఆ స్థాయిలో ప్రజల్ని ఆకట్టుకోగలరా? అన్నది సందేహాస్పదమే. దీనికితోడు కుటుంబసభ్యులనే భారం కూడా ఆమెను వెంటాడుతోంది. అంతేకాకుండా, ఆమె, ఆమె కుటుంబసభ్యులు పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పేరును దుర్వినియోగం చేశారని, ఆర్థిక లబ్ధులు పొందారనే ఆరోపణలతో స్వయంగా జయలలితే శశికళను, ఆమె కుటుంబసభ్యులను పోయెస్‌గార్డెన్ నుంచి తరిమేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు జయలలిత అనుసరించిన రాజకీయ విధానాన్నే ఇప్పుడు శశికళ అనుసరిస్తున్నట్టు కనిపించవచ్చు. 1989లో ఎంజీఆర్ చనిపోయినప్పుడు వారసురాలిగా ఆయన భార్య జానకి ముందుకొచ్చారు. కానీ జయలలిత పార్టీలో చీలిక తీసుకురావడం.. ఎన్నికల్లో జానకి నిలదొక్కుకోలేకపోవడంతో అన్నాడీఎంకే జయలలిత చేతికొచ్చింది. ఇప్పుడు జయలలిత మృతి నేపథ్యంలో అన్నాడీఎంకేను శశికళ తన చేతుల్లోకి తీసుకున్నారు. పార్టీ ప్రభుత్వాన్ని రానున్న నాలుగేళ్లు నడుపడం, పార్టీ చీలిపోకుండా ఐక్యంగా కొనసాగించడం ప్రస్తుతం ఆమె ముందున్న అతిపెద్ద సవాళ్లని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
అన్నాడీఎంకే కీలక తీర్మానాలు
చెన్నై: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అన్నాడీఎంకే కీలక సర్వసభ్య సమావేశం కొనసాగుతోంది. జయలలిత స్నేహితురాలి శశికళ నటరాజన్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. జయలలిత చనిపోయిన తర్వాత తొలిసారిగా జరిగిన సర్వసభ్య సమావేశంలో 14 తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశానికి శశికళ హాజరుకాలేదు. భేటీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పొయెస్ గార్డెన్ కు వెళ్లి శశికళను కలిశారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానం కాపీని ఆమె అందజేశారు. సభ్యుల కోరిక మేరకు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించిన ఆమె తీర్మానం కాపీపై సంతకం చేశారు. అంతకుముందు పన్నీరు సెల్వం మాట్లాడుతూ... ఎంజీఆర్ ను జయలలితలో చూసుకున్నాం, ఇప్పుడు ‘అమ్మ’ను శశికళలో చూసుకుంటున్నామని అన్నారు. సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు శశికళ నటరాజన్ నాయకత్వంలో పనిచేయాలని ఏకగ్రీవ తీర్మానం నిబంధనలు సవరించి ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికల నిర్వహణ జయలలితకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలి పార్లమెంట్ లో జయలలిత కాంస్య విగ్రహం ఏర్పాటుకు విజ్ఞప్తి ‘అమ్మ’ పుట్టినరోజును జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించాలి జయలలితకు నోబెల్ శాంతి పురస్కారం దక్కేలా ప్రయత్నం చేయాలి -
చిన్నమ్మ శశికళకే పట్టం
-
చిన్నమ్మకే పట్టం
చెన్నై: అన్నాడీఎంకేలో అంతా ఊహించినట్టుగానే జరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఎన్నికయ్యారు. గురువారమిక్కడ ప్రారంభమైన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శశికళ నాయకత్వంలో పనిచేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికైనట్టు అన్నాడీఎంకే పార్టీ వెబ్ సైట్ లో అధికారికంగా ప్రకటించారు. శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు సమావేశం ముగిసిన తర్వాత సీఎం పన్నీరు సెల్వం ప్రకటించారు. జనవరి 2న అధికారికంగా శశికళ పార్టీ పగ్గాలు చేపడతారని సమాచారం. పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మధసూదన్ నాయకత్వంలో అన్నాడీఎంకే నేతలు సమావేశమయ్యారు. ముందుగా దివంగత నాయకురాలు జయలలితకు నివాళి అర్పించారు. సమావేశంలో 14 తీర్మానాలు ఆమోదించారు. జయలలిత పుట్టినరోజును జాతీయ రైతుల దినోత్సవంగా ప్రకటించాలని, అమ్మకు భారతరత్న ఇవ్వాలని కూడా తీర్మానాలు ఆమోదించారు. అంతేకాదు మెగసెసె అవార్డు, నోబెల్ శాంతి పురస్కారానికి జయలలిత పేరును ప్రతిపాదించాలని కోరుతూ అన్నాడీఎంకే నేతలు తీర్మానించారు. -
వాడివేడిగా అన్నాడీఎంకే సర్వసభ్య భేటీ
చెన్నై: దేశమంతా ఆసక్తి ఎదురుగా చూస్తున్న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గురువారమిక్కడ ప్రారంభమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఎంపిక జరిగేనా లేదా అనే చర్చ నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీకి 2200 మందిని ఆహ్వానించారు. ఇన్విటేషన్ ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించారు. సమావేశ వేదికపై దివంగత నాయకురాలు జయలలిత కోసం ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారు. దారిపొడవునా జయలలిత, శశికళ ఫ్లెక్సీలు పెట్టారు. ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. పార్టీ సమావేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొనకుండా శశికళ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వ్యతిరేకీయులకు ఆహ్వానాలు పంపకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీచేస్తానని బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్ తిలకన్‌పై అన్నాడీఎంకే శ్రేణులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వల్లనే దాడి చేసినట్లు వారు చెబుతున్నారు. మొత్తం మీద వాడివేడి వాతావరణంలో పార్టీ సర్వ సభ్య సమావేశం జరుగుతోంది. -
శశికళ కూడా నామినేషన్ వేయలేదు!
చెన్నై: జయలలిత మరణం తర్వాత ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(ఏఐఏడీఎంకే) పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టబోయేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో రేపు(గురువారం) జరగబోయే కీలక సమావేశంలో జనరల్ సెక్రటరీని ఎన్నుకుంటామని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సి.పొన్నయ్యన్ బుధవారం మీడియాకు తెలిపారు. జనరల్ సెక్రటరీ పదవికి సంబంధించి ఇప్పటివరకు శశికళ సహా ఏ ఒక్కరూ నామినేషన్ దాఖలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. శశికళను పార్టీ జనరల్ సెక్రటరీగా కాకుండా ఏకంగా ముఖ్యమంత్రిగానే ఎన్నుకోబోతున్నారన్న వార్తలపై పొన్నయ్యన్ ఆచితూచి స్పందించారు. సీఎం మార్పునకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. 'రేపటి సమావేశం జనరల్ సెక్రటరీ ఎన్నిక కోసం మాత్రమే'అని వ్యాఖ్యానించారు. దివంగత జయకు ఆప్తురాలైన శశికళా నటరాజనే పార్టీ పగ్గాలు చేపడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా నిర్వహించబోయే ఎన్నిక ప్రక్రియలో ఏం జరగబోతుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. బుధవారం ఏఐఏడీఎంకే ఆఫీసు వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉన్నాయి. ఏఐఏడీఎంకే బహిషృత ఎంపీ శశికళా పుష్ప పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి పోటీచేస్తానని ఇదివరకే ప్రకటించినట్లు.. బుధవారం తన లాయర్ ద్వారా నామినేషన్ వేసే ప్రయత్నం చేశారు. కానీ శశికళా నటరాజన్ వర్గీయులు.. శశికళా పుష్ప లాయర్‌ను అడ్డుకుని చితకబాదారు. అంతటితో ఆగకుండా కారులో కూర్చున్న శశికళా పుష్ప భర్తను, అతని వెంట వచ్చినవారిపైనా దాడి చేశారు. ఈ గలాటా కారణంగా పార్టీ ఆఫీసు వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా, గురువారం జరగబోయే సమావేశానికి ఎంపీ శశికళా పుష్ప స్వయంగా హాజరవుతారని సమాచారం. అయితే పార్టీ నుంచి బహిష్కృతురాలైన ఆమెను కార్యాలయంలోనికి అనుమతించకుండదని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. సమావేశం ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు నామినేషన్ తంతును నిర్వహించి, శశికళను పార్టీ చీఫ్‌గా ఎన్నుకోనున్నట్లు సమాచారం. (శశికళ పుష్ప లాయర్‌ను చితక్కొట్టారు) -
కీలక పరిణామం.. శశికళతో అజిత్ భేటీ!
తమిళనాడులో కీలక పరిణామం. ప్రముఖ తమిళ హీరో అజిత్ సోమవారం దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ నటరాజన్ తో భేటీ అయినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. జయలలిత మరణం తర్వాత అధికార అన్నాడీఎంకే పగ్గాలు శశికళ చేపట్టాలన్న డిమాండ్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తాను పగ్గాలు చేపట్టే విషయంలో అజిత్ మద్దతు కూడగట్టేందుకే ఈ భేటీ జరిగినట్టు భావిస్తున్నారు. పోయెస్ గార్డెన్ లో శశికళతో అజిత్ సమావేశమైన విషయాన్ని అన్నాడీఎంకే వర్గాలు ధ్రువీకరించాయి. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగినట్టు ఆ వర్గాలు మీడియాకు చెప్పాయి. అయితే, ఈ కథనాలను హీరో అజిత్ ధ్రువీకరించడం లేదని తెలుస్తోంది. తన తాజా చిత్రం షూటింగ్ లో భాగంగా బల్గేరియాలో తీరిక లేకుండా గడుపుతున్న అజిత్ క్రిస్మస్ పండుగను కుటుంబసభ్యులతో జరుపుకొనేందుకు ఇటీవల చెన్నై తిరిగి వచ్చారు. శశికళతో భేటీ కథనాలను అజిత్ తోసిపుచ్చుతుండటంతో నిజానిజాలేమిటన్నది తెలియాల్సి ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జయలలిత రాజకీయ వారసుడిగా అజిత్ పేరు ఆమధ్యకాలంలో తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. జయలలిత గత సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరిన వెంటనే ఆమెను మొదట పరామర్శించింది కూడా అజితే.. ఆమె మరణించిన విషయాన్ని అర్ధరాత్రి ప్రకటించడంతో హుటాహుటిన వచ్చి మెరీనా బీచ్ లో అమ్మకు శ్రద్ధాంజలి ఘటించారు. జయలలితతో అజిత్ ఆత్మీయంగా ఉండేవారని, అతన్ని తన కొడుకుగా జయలలిత భావించేవారని అంటారు. ఈ నేపథ్యంలో అమ్మ వారసత్వం విషయంలో అజిత్ కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్నట్టు కనిపిస్తోంది. -
నేనూ పోటీలో ఉంటా: శశికళ
న్యూఢిల్లీ: అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. పార్టీలోని ప్రతి ప్రాథమిక సభ్యుడికి ఈ హక్కు ఉందని, పార్టీ నుంచి తనను బహిష్కరించలేదని, అన్నా డీఎంకే తరఫున ఎంపీగా కొనసాగుతున్నానని పేర్కొన్నారు. జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌కు వ్యతిరేకంగా శశికళ పుష్ప తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జయలలితను చంపేందుకు శశికళ నటరాజన్ ప్రయత్నించిందని, దీనిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ బాధ్యతలు చేపడుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను పోటీలో ఉన్నట్టు శశికళ పుష్ప ప్రకటించారు. కాగా శుక్రవారం వచ్చే హైకోర్టు తీర్పును బట్టి తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. పార్టీ పగ్గాలు శశికళ నటరాజన్‌కు అప్పగించడానికి పార్టీ కేడర్‌లో దాదాపు 75 శాతం మంది సంతోషంగా లేరని చెప్పారు. అంతేగాక ఆమె పార్టీలో సభ్యురాలు కాదని అన్నారు. -
ఆ పాపకు చిన్నమ్మ పెట్టిన పేరేంటో తెలుసా?
చెన్నై : ఎంతో మంది ప్రజల మన్ననలు పొంది, అసువులు బాసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై అభిమానంతో అప్పుడే పుట్టిన ఓ చిన్నారికి 'జయలలిత' అనే పేరును అమ్మ నెచ్చెలి శశికళ పెట్టారు. అమ్మకు గుర్తుగా ఈ పేరును పెట్టినట్టు తెలిసింది. అన్నాడీఎంకే కార్యకర్త అయిన సెంతిల్‌కుమార్, గాయత్రీలకు ఇటీవలే ఆడపిల్ల జన్మించింది. థేని జిల్లాకు చెందిన సెంతిల్ అమ్మకు అభిమాని. ఆయన ఆటో నడుపుతూ తన జీవనం సాగిస్తున్నాడు. జయలలిత మరణించిన తర్వాత అమ్మపై ఉన్న ప్రేమతో తమ కూతురికి అమ్మ పేరు పెట్టాలని పాపను పోయెస్ గార్డెన్‌కు తీసుకుని వచ్చాడు. వారి అభిమానికి మురిసిపోయిన అమ్మ నెచ్చెలి శశికళ, ఆ చిన్నారికి జయలలిత అని నామకరణం చేశారు. జయలలిత మరణించిన అనంతరం అన్నాడీఎంకే చీఫ్‌గా శశికళ నటరాజన్ నియమితులైన సంగతి తెలిసిందే. శశికళ ప్రస్తుతం పోయెస్ గార్డెన్లో ఉంటున్నారు. -
చిన్నమ్మకే అన్నా డీఎంకే పగ్గాలు
-
చిన్నమ్మకే అన్నా డీఎంకే పగ్గాలు
చెన్నై: అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత స్థానంలో ఎవరు పగ్గాలు చేపడుతారన్న విషయంపై పూర్తిగా స్పష్టత వచ్చింది. జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ పార్టీని నడిపిస్తారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అన్నా డీఎంకే తదుపరి ప్రధాన కార్యదర్శిగా 54 ఏళ్ల శశికళ బాధ్యతలు చేపడుతారని పార్టీ ప్రతినిధి పొన్నయన్ గురువారం ప్రకటించారు. పార్టీ నాయకులందరూ ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అవసరమైతే పార్టీ నిబంధనలను సవరిస్తామని చెప్పారు. జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా రెండు బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జయలలిత మరణానంతరం తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణం చేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమితులవుతారని పార్టీకి చెందిన జయ టీవీ కథనం ప్రసారం చేసింది. సీఎం పన్నీరు సెల్వం, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సహా మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు.. శశికళను కలసి పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కోరారు. దీంతో జయ స్థానంలో శశికళ పార్టీని నడిపిస్తారని వార్తలు వచ్చాయి. ఈ రోజు పార్టీ తరఫున అధికారికంగా ప్రకటించడంతో పూర్తిగా స్పష్టత వచ్చినట్టయ్యింది. జయలలితతో కలసి పోయెస్ గార్డెన్లో ఉన్న శశికళ.. ఆమె మరణానంతరం అక్కడే ఉంటున్నారు. -
‘చిన్నమ్మ’కు పదవి ఖాయం!
-
‘చిన్నమ్మ’కు పదవి ఖాయం!
చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు దివంగత సీఎం జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ నటరాజన్ కు అప్పగించేందుకు రంగం సిద్ధమైన్నట్టు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఆమెకు కట్టబెట్టనున్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ‘చిన్నమ్మ’కు మద్దతు పలకడంతో ఆమె చేతుల్లోకి పార్టీ పగ్గాలు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. శశికళతో తనకు ఎటువంటి విభేదాలు లేవని పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. ‘చిన్నమ్మ’ పార్టీ ప్రధాన కార్యదర్శి కావడం ఎవరికీ అభ్యంతరం లేదని, ఆమె పార్టీ పగ్గాలు చేపట్టాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. అమ్మ తర్వాత అంతటి సమర్థురాలు శశికళేనని, వేరే ప్రత్యామ్నాయం లేదని అన్నాడీఎంకే నేతలు అంటున్నారు. ఈ మేరకు అన్నా డీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు శనివారం పోయెస్ గార్డెన్స్‌లో శశికళను కలసి విన్నవించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టే అర్హత శశికళకు లేదని జయలలిత మేనకోడలు దీప జయకుమార్ గట్టిగా వాదిస్తున్నారు. -
చిన్నమ్మకు షాక్!
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆంతరంగికురాలు శశికళ నటరాజన్ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కానున్నారనే అంచనాలపై పార్టీ బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.అలా జరగడానికి వీల్లే దని ఆమె తెగేసి చెపుతున్నారు. తన ప్రాణం పోయేంత వరకు చిన్నమ్మ(శశికళ) మీద పోరాటం చేస్తానని ఆమె సవాల్ చేశారు. తన చివరి శ్వాస వరకూ ఆమె కుట్రలను సాగనివ్వనని హెచ్చరించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన శశికళ పుష్ప కేవలం శశికళ గ్రూపు కారణంగానే అమ్మకు ఏదో జరిగిందన్న అందరూ నమ్ముతున్న ప్రస్తుత తరుణంలో ఆమె పార్టీ భవిష్యత్ నేత ఎలా అవుతుందని ప్రశ్నించారు. కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేనిశశికళ నటరాజన్ కు కు ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు ఎలా అప్పగిస్తారని పార్టీ సీనియర్లను ప్రశ్నించారు. శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు తీసుకున్న తరువాత ఆ పార్టీని ఆమె భర్త నటరాజన్ నడిపిస్తాడని, అందులో ఎలాంటి డౌట్ లేదని శశికళ పుష్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. శశికళకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మద్దుతుపై ప్రశ్నించినపుడు అన్నాడీఎంకే పార్టీలోని సీనియర్లను శశికళ నటరాజన్ కుటుంబసభ్యులు బెదిరిస్తున్నారని, అందుకే వారు పార్టీ పగ్గాలను ఆమెకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ కుట్రలను తాను అడ్డుకుంటానని అన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని పార్టీకి దిశా నిర్దేశం చేయాలని ఆశిస్తున్నాన్నారు. సీనియర్లకే ఆ పదవి వచ్చేలా చెయ్యాలని, శశికళ నటరాజన్ కుట్రలను అడ్డుకోవాలని శశికళ పుష్ప కోరారు. జయలలితకు శశికళ 35 సంవత్సరాలు సేవ చేసినంత మాత్రాన అన్నాడీఎంకే పార్టీ ప్రధాని కార్యదర్శి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మా ఇంటిలో గత 25 సంవత్సరాల నుంచి ఒకరు పని చేస్తున్నారు అయితే తన పదవిని ఎలా ఇచ్చేస్తానంటూ ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఉండటానికి ఆ పార్టీ కార్యకర్తలు, తమిళనాడు ప్రజలు అంగీకరించరన్నారు. శశికళ నటరాజన్ చేతికి పగ్గాలు ఇస్తే వారి కుటుంబ సభ్యులను రాజ్యసభలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తారని ఆరోపించారు.ఇప్పటికైన పార్టీ లీడర్లు జోక్యం చేసుకుని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకుని కార్యకర్తలకు అండగా నిలవాలన్నారు. కాగా అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సి. పొన్నియన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్లు పోటీ పడుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ,శశికళనే పార్టీ పగ్గాలు చేపడుతారనే సంకేతాలు అందించిన సంగతి తెలిసిందే. -
జయలలిత.. ఇద్దరు శశికళలు
చెన్నై: జయలలిత ఆశీస్సులతో ఇద్దరు మహిళల జీవితాలు అనూహ్యంగా మారిపోయాయి. ఒకరికి ఏకంగా తన ఇంట్లో స్థానం కల్పించగా, మరొకరిని రాజ్యసభకు పంపారు. ఆ ఇద్దరు మహిళలే శశికళ నటరాజన్, శశికళ పుష్ప. కాగా కారణాలేంటో కానీ ఈ ఇద్దరు శశికళలకు అసలు పడటం లేదు. శశికళ నటరాజన్‌తో జయలలిత స్నేహం గురించి అందరికి తెలిసిన విషయమే. అన్నా డీఎంకేలో జయ తర్వాత శశికళే అన్నట్టుగా ఆమెకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక తమిళనాడులోని తుత్తుకుడి మేయర్‌గా ఎన్నికైన శశికళ పుష్ప.. అమ్మ అనుగ్రహంతో 2014లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. జయలలితకు శశికళ పుష్ప వీరవిధేయురాలు. గతంలో పోయెస్ గార్డెన్లో ఈమెకు ప్రవేశం ఉండేది. అయితే గత ఆగస్టులో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డీఎంకే ఎంపీ తిరుచి శివను శశికళ పుష్ప చెంపదెబ్బ కొట్టడం, ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో జయలలిత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో రాజ్యసభలో కంటతడి పెట్టిన శశికళ పుష్ప.. జయలలిత పేరును ప్రస్తావించకుండా తీవ్ర విమర్శలు చేశారు. తనకు తమిళనాడులో ప్రాణభయం ఉందని, రక్షిణ కల్పించాల్సిందిగా కోరారు. కొన్ని రోజుల తర్వాత జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాక ఈ విషయం మరుగనపడింది. శశికళ వర్సెస్ శశికళ: ఇద్దరు శశికళలకు వైరం నడుస్తోంది. అమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాక శశికళ పుష్ప.. శశికళ నటరాజన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జయలలిత పేరు చెప్పి నటరాజన్ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారని, అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ శశికళ నటరాజన్ పేరును ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. జయలలితను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని, అమ్మ ఆరోగ్య పరిస్థితిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల క్రితం జయలలితకు హాని తలపెట్టేందుకు శశికళ నటరాజన్ కుట్రపన్నారని మరో బాంబు పేల్చారు. కాగా శశికళ పుష్ప తీవ్రమైన ఆరోపణలు చేసినా శశికళ నటరాజన్ స్పందించలేదు. ఇద్దరు శశికళలకు మంచి జీవితాన్ని ప్రసాదించిన జయలలిత ఇప్పుడు లేరు కానీ వారి మధ్య శత్రుత్వం మాత్రం ఉంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకేలో శశికళ కుటుంబ సభ్యులు, ఇతర నాయకుల మధ్య నాయకత్వ పోరు జరగనుందని, పార్టీలో చీలిక తప్పదని కొందరు చెబుతున్నారు. -
అమ్మ ఆస్తులు ఎవరికి ?
-
అమ్మ ఆస్తులు ఎవరికి?
చెన్నై: నంబర్ 81, వేదా నిలయం, పోయెస్ గార్డెన్.. తమిళనాట రాజకీయానికి ఈ చిరునామా బలమైన అడ్డా. దాదాపు పాతికేళ్లు తమిళనాడులో అసలైన రాజకీయాలు ఈ చోటు నుంచే ప్రారంభమయ్యాయి. ఎప్పుడో తమిళనాడు ముఖ్యమత్రి జయలలిత తల్లి సంధ్య 1967లో రూ.1.32లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఈ ఆస్తిని తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు జయ ఉపయోగించుకున్నారు. పోస్ గార్డెన్ అనగానే చుట్టుపక్కలవారికి బలమైన రాజకీయ శక్తికి నిలయం అని గుర్తించేలా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల అంచనా ప్రకారం ఈ ఎస్టేట్ విలువ ఇప్పుడు దాదాపు రూ.90కోట్లపై మాట. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన తర్వాత ప్రస్తుత పరిస్థితులు సర్దుమణిగేలా చేసేందుకు పార్టీ పగ్గాలు జయ ప్రాణ స్నేహితురాలు శశికలకు, సీఎం పదవి జయ విశ్వసనీయుడైన పన్నీర్ సెల్వంకు అప్పగించారు. అయితే, అమ్మ ఆస్తులకు ఎవరు వారసులుగా ప్రకటించబడతారనే విషయం పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో ఏనాడు తన తర్వాత ఎవరూ అనే విషయాన్ని జయ ప్రకటించలేదు. ఆమె అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు సైతం ఒక వీలునామా అంటూ రాయలేదు. దీంతో ఇప్పుడు ఆ ఆస్తులు ఎవరికీ కేటాయిస్తారనే అంశం ఉత్కంఠగా మారింది. ప్రధానంగా పరిశీలించినప్పుడు జయ స్నేహితురాలు శశికళ నటరాజన్‌కు వేదా నిలయంలో శాశ్వతంగా ఉండే హక్కు వస్తుందా లేక ఆమె మేనకోడలు దీపా జయకుమార్, సోదరుడు దీపక్ లకు ఈ అవకాశం వస్తుందా అని ఒక ప్రశ్న తలెత్తుతుండగా.. జయ రాజకీయ గురువు ఎంజీ రాంచంద్రన్‌కు రామాపురం, చెన్నైలో ఉన్న ఇళ్ల మాదిరిగానే చట్టపరమైన వివాదాల్లో చిక్కి ఇప్పటికీ ఎవరికీ దక్కనట్లుగానే అలాగే ఉండిపోతుందా అనేది మరో ప్రశ్న. జయలలిత అంతిమ సంస్కారాలను పూర్తి చేసిన శశికళ అనంతరం నేరుగా వేద నిలయానికి వెళ్లారు. వాస్తవానికి పోయెస్ గార్డెన్‌ను జయలలిత, ఆమె తల్లి సంధ్య కలిసి కొనుగోలు చేసినందున తమ నాయనమ్మ ఆస్తిలో వాటా వస్తుందని జయ మేనళ్లుడు, మేనకోడలు అడిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. -
జయ వదిలి వెళ్లిన సంపద ఎంతో తెలుసా?
-
జయలలిత అంతిమ యాత్ర సాగింది ఇలా..
చెన్నై: అభిమానులు, సన్నిహితులు, వివిధ పార్టీల నేతల అశ్రునయనాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు నిర్వహించారు. చెన్నై మెరీనా బీచ్ లోని ఎమ్జీఆర్ స్మారక వనంలో జయ రాజకీయ గురువు ఎంజీఆర్ సమాధికి 20 మీటర్ల దూరంలో ‘పురచ్చి తలైవీ’కి కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. జయ నెచ్చెలి శశికళ నటరాజన్ తన ప్రాణ స్నేహితురాలికి అశ్రునయనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించి తుది వీడ్కోలు పలికింది. అమ్మ అంత్యక్రియలను చూసేందుకు, తుది వీడ్కోలు పలికేందుకు పార్టీ నేతలు, అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. 5:10 - శశికళతో కలిసి జయలలిత అంతిమయాత్రలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ 5:14 - చెపాక్ స్టేడియానికి చేరుకున్న జయ అంతిమయాత్ర. అక్కడి నుంచి బీచ్ రోడ్డు వైపునకు కొనసాగుతున్న కార్యక్రమం 5:19 - ఎంజీఆర్ స్మారకవనానికి చేరుకున్న వైకో 5:22 - చెన్నైలోని మెరీనా బీచ్‌కు చేరిన అమ్మ అంతిమ యాత్ర 5:32 - మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ స్మారక వనానికి జయ భౌతికకాయం 5:35 - అంతిమ సంస్కారాలు జరిపే చోటుకు చేరిన జయలలిత భౌతికకాయం 5:37 - అంత్యక్రియలు నిర్వహించే స్థలానికి చేరిన జయ శవపేటిక 5:39 - శవపేటిక నుంచి 'అమ్మ' భౌతికకాయాన్ని బయటకు తీశారు 5:44 - జయ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించిన తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు 5:46 - ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సీఎం జయలలిత అంతిమ సంస్కారాల కార్యక్రమాలు ప్రారంభం 5:48 - అమ్మ వీర విధేయుడు ఓ పన్నీర్ సెల్వంతో పాటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాధాక్రిష్ణన్ జయలలితకు అంతిమ నివాళి 5:51 - తంబిదురై, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, ఇతర కీలక నేతలు జయకు నివాళులు 5:53 - కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు జయకు నివాళులర్పించిన ఆ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్ 5:53 - అన్నాడీఎంకే నేత జయకు అంతిమ సంస్కారాలు నిర్వహించే ప్రదేశం వద్ద కూర్చున్న శశికళ, ఆమె కుటుంబ సభ్యులు 5:54 - ఓ పూజారి జయ భౌతికకాయం వద్దకు వచ్చి కార్యక్రమం నిర్వహించారు. 5:56 - జయలలిత భౌతికకాయంపై ఉన్న జాతీయ పతాకాన్ని శశికళకు అప్పగింత. సాధారణంగా కుటుంసభ్యులకు ఇలా అందజేయడం ఆనవాయితీ 5:57 - మరో వ్యక్తితో కలిసి జయలలిత అంత్యక్రియల్లో పాల్గొన్న నెచ్చెలి శశికళ 6:02 - సందర్శనార్థం జయలలిత భౌతికకాయాన్ని ఉంచిన చందనపు శవపేటికను మూసివేత. జయ కడసారి చూపు ఇంతటితో ముగిసింది. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేసిన జయ నెచ్చెలి శశికళ, ఆమె కుటుంబ సభ్యులు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
జయకు శశికళ అంతిమ సంస్కారాలు
-
జయకు శశికళ అంతిమ సంస్కారాలు
చెన్నై: అభిమానులు, మద్దతుదారులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు ముగిశాయి. మెరీనా బీచ్ లోని ఎమ్జీఆర్ స్మారక వనంలో ‘పురచ్చి తలైవీ’కి కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ నటరాజన్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జయలలిత మేనల్లుడు ఆమె పక్కనే ఉన్నారు. చందనపు పేటికలో జయ పార్థీవ దేహాన్ని ఉంచి ఖననం చేశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ఎమ్జీఆర్ సమాధికి 20 మీటర్ల దూరంలో జయలలిత భౌతికకాయాన్ని పాతిపెట్టారు. ‘అమ్మ’ అంత్యక్రియలకు నాయకులు, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. ప్రజలందరూ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అనువుగా పెద్ద సంఖ్యలో ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాథాకృష్ణన్, గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం పన్నీరు సెల్వం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్, మాజీ గవర్నర్ రోశయ్య, తదితర ప్రముఖులు చివరిసారిగా ‘అమ్మ’కు వీడ్కోలు పలికారు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
జయ వదిలి వెళ్లిన సంపద ఎంతో తెలుసా?
తమిళనాట రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోతూ అసువులు బాసిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత వదిలి వెళ్లిన సంపద ప్రస్తుతం ఎవరికి దక్కుతుందో అంటే అందరికీ ప్రశ్నార్థకమే. ఎవరిపైనా ఆధారపడని అమ్మ ఇటు రాజకీయ వారసులను, అటు ఆస్తిపై హక్కులను ఎవరికీ కట్టబెట్టనున్నారో ఎన్నడూ వెల్లడించలేదు. జయలలిత మరణంతో పార్టీ పగ్గాలు ఆమె నెచ్చిలి శశికళకు, ముఖ్యమంత్రి పదవి జయమ్మ విధేయుడు పన్నీర్ సెల్వంకు అప్పజెప్పుతూ పార్టీ శ్రేణులు నిర్ణయించారు. కానీ ఆమె ఆస్తులకు ఎవరు వారసురాల్లో ఇంకా వెల్లడికాలేదు. అయితే ఆర్కె నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక సమయంలో అన్నాడీఎంకే అధినేత్రిగా జయలలిత పోటీ చేసేటప్పుడు 2015 జూన్ వరకు తనకు రూ.117.13 కోట్ల ఆస్తులున్నట్టు ఆమెనే ప్రకటించారు. ఆ ఆస్తులో పోయెస్ గార్డెన్‌లోని 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రూ.43.96 కోట్ల జయలలిత నివాస గృహం వేద విలాస్‌కు ప్రస్తుతం శశికళ వారసురాలు కాబోతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ప్రాపర్టీని జయలలిత తల్లి సంధ్య 1967లో రూ.1.32 లక్షలకు కొనుగోలు చేసినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఆమెకున్న ఇతర ఆస్తులు: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాలు, తమిళనాడులో కంచీపురంలో 3.43 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణలో ఉన్న ఈ ప్రాపర్టీని ఆమె తన తల్లి సంధ్యతో కలిసి 1968లో కొనుగోలు చేశారు. కాంచీపురం చెయూర్లోని ప్రాపర్టీని 1981లో కొనుగోలు చేశారు. జయలలితకు మొత్తం నాలుగు వాణిజ్య భవనాలున్నాయి. దానిలో ఒకటి హైదరాబాద్‌లో ఉంది. రిపోర్టుల ప్రకారం దీనిలో ఒక ప్రాపర్టీ తను దత్తత తీసుకున్న శశికళ అన్న కుమారుడు వీఎన్ సుధాకర్‌కు చెందుతున్నట్టు తెలుస్తోంది. కార్లు... రెండు టయోటా ప్రాడో ఎస్‌యూవీలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహింద్రా జీప్, 1980లో తయారు చేసిన అంబాసిడర్ కారు, మహింద్రా బోలెరో, స్వరాజ్ మ్యాక్సీ, 1990 మోడల్ కాంటెస్సాలు జయలలిత దగ్గరుండేవి. ఈ మొత్తం తొమ్మిది వాహనాల ఖరీదు రూ.42,25,000. ఆభరణాలు.... 21280.300 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు తన దగ్గరున్నాయని తమిళనాడు సీఎంగా ఆమెనే ఓ సారి ప్రకటించారు. అక్రమాస్తుల కేసుల్లో ఇవి ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నాయని, ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా రూ.3,12,50,000 విలువ కలిగిన 1,250 కేజీల వెండి ఉన్నట్టు పేర్కొన్నారు. స్థిర, చరాస్తులు... 2016 ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గ తరుఫున పోటీ చేసేటప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు ఆమె తనకు చరాస్తులుగా రూ.41.63 కోట్లున్నాయని, స్థిరాస్తులు రూ.72.09 కోట్లున్నట్టు ప్రకటించారు. పెట్టుబడులు, షేర్లు... అక్రమాస్తుల కేసుల ఆరోపణల నేపథ్యంలో ఆమెకు పలు కంపెనీల్లో ఉన్న డిపాజిట్లను, షేర్లను పోలీసులు సీజ్ చేశారు. 2004 స్పెషల్ సీ.సీ 208 ప్రకారం వాటిని కోర్టు కస్టడీకి తీసుకుంది. పార్టనర్‌గా ఆమె ఐదు సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. వాటి విలువ రూ.27.44 కోట్లు. ఆ ఐదు సంస్థలు శ్రీ జయ పబ్లికేషన్స్, శశి ఎంటర్ప్రైజెస్, కోదండ ఎస్టేట్, రాయల్ వ్యాలీ ఫ్లోరిటెక్ ఎక్స్‌పోర్ట్స్, గ్రీన్ టీ ఎస్టేట్. అయితే ఆమెకు ఎన్ఎస్ఎస్లో కాని, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు వంటి వాటిలో కానీ ఎలాంటి పెట్టుబడులు లేవు. ఎలాంటి వ్యక్తిగత రుణాలు, అడ్వాన్స్‌లు ఎవరికీ, ఏ సంస్థకి జయలలిత ఇవ్వనేలేదట. ఈ విషయాలను ఆమెనే ఓసారి తన అఫిడవిట్లోనే పేర్కొన్నారు. 2015-16 ఏడాదికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను ఆమె దాఖలు చేశారు. 2013-14లో పన్ను చెల్లింపులన్నీ ఆమె పూర్తిచేశారు. చివరి డిక్లరేషన్ కింద ఆమె చేతిలో రూ.41,000 నగదు, రూ.2.04 కోట్ల ఆస్తిపాస్తులున్నట్టు ఆమె వెల్లడించారు. -
ఆమెకు ఇక తోడెవరు?
అమ్మ అధికారంలో ఉన్నా.. జైల్లో ఉన్నా.. చివరకు ఆస్పత్రిలో అచేతన స్థితిలో ఉన్నా కూడా నిరంతరం ఆమె వెన్నంటి ఉన్న ఏకైక వ్యక్తి.. శశికళా నటరాజన్. జయలలితకు ఏకైక స్నేహితురాలు. ప్రపంచంలో ఎవరినీ అస్సలు నమ్మని జయలలిత... దాదాపు నిరంతరం నమ్మిన ఏకైక వ్యక్తి శశికళే. మధ్యలో కొన్నాళ్లు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి దూరమైనా, అనతికాలంలోనే మళ్లీ దగ్గరయ్యారు. వీళ్లిద్దరిది విడదీయలేని బంధం. వాస్తవానికి ఇద్దరూ ఎప్పటినుంచి కలిశారన్న విషయం తెలియదు గానీ, తొలిసారిప్రపంచానికి తెలిసింది మాత్రం 1991లోనే. మొదట్లో శశికళ వీడియో క్యాసెట్ల దుకాణం నడిపేవారు. ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత ఆ పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ ప్రచార క్యాసెట్లను శశికళ తీసుకొచ్చి జయలలితకు ఇచ్చేవారు. అప్పుడే ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. కలెక్టర్ చంద్రలేఖ.. జయలలితకు శశికళను పరిచయం చేశారు. అయితే ఒక పట్టాన ఎవరినీ నమ్మని జయలలిత.. ఈ శశికళను మాత్రం ఎలా నమ్మారన్నది అంతుపట్టని విషయం. శశికళ సాధారణంగా అవతలి వాళ్లు మాట్లాడుతుంటే మౌనంగా వింటారే తప్ప మధ్యలో కల్పించుకోరు. అలాగే ప్రచారవ్యూహాలు రచించడంలో కూడా దిట్ట అంటారు. 1991లో తొలిసారిగా జయ ముఖ్యమంత్రి అయ్యారు. పోయెస్‌గార్డెన్‌లో శశికళ బంధువుల పెత్తనం పెరిగింది. శశికళ అన్న కుమారుడు సుధాకరన్ను జయ దత్తత తీసుకున్నారు. 1996లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ అరెస్టుకాగా, ఆమెతో పాటూ శశికళ కూడా అరెస్టయ్యారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా టాన్సీ కుంభకోణం వివాదాల్లో చిక్కుకుని ఉన్నందున జయ సీఎం కాలేకపోయారు. అపుడు పన్నీర్‌సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా పీఠంపై కూర్చోబెట్టింది శశికళే. ఎందుకంటే, ఆయన ఈమెకు కూడా విధేయుడు. ఆ తర్వాత.. 2002లో జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. అప్పట్లో శశిని సీఎం చేయాలనుకున్నా.. వీలుపడలేదు. తర్వాత జయలలిత నిర్దోషిగా బయటపడుతూనే శశికళకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. పార్టీలో కీలక స్థానం కట్టబెట్టారు. 2011 ఎన్నికల్లో శశికళ ప్రాబల్యం బాగా పెరిగింది. చాలాకాలం ఇద్దరూ ఒకే రకమైన చీరలు కట్టుకునేవారు, ఒకే రకమైన ఆభరణాలు ధరించేవారు. చెప్పులు కూడా ఒకే రకంగా ఉండేవి. ఇద్దరూ అచ్చం కవలపిల్లల్లాగే కనిపించేవాళ్లు. 2011 డిసెంబర్ 19న శశికళా నటరాజన్‌ను పార్టీ నుంచే కాకుండా, తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి కూడా జయలలిత బయటకు పంపేశారు. కానీ ఆ విభేదాలు ఎన్నాళ్లో లేవు. నాలుగు నెలల్లోపే ఇద్దరూ మళ్లీ దగ్గరయ్యారు. ఎంతగానంటే.. చివరకు చెన్నై అపోలో ఆస్పత్రిలో వీవీఐపీలు, కేంద్ర మంత్రులు సైతం జయలలిత ఎలా ఉన్నారో చూడలేకపోయినా, శశికళ మాత్రం ఆమె పక్కనే ఉన్నారు. చిట్ట చివరి నిమిషం వరకు సైతం ఆమె తోడుగానే నిలిచారు. ఇప్పుడు జయ లేని లోటును శశికళకు ఎవరు తీరుస్తారో! -
కోర్టుకు నెచ్చెలి
సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ నిమిత్తం ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్ సోమవారం బెంగళూరు కోర్టుకు వెళ్లారు. అక్కడ న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలకు శశికళ సమాధానాలు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ బెంగళూరు ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. కేసు విచారణలో ఉన్న దృష్ట్యా తమిళనాడు ఏసీబీ సీజ్ చేసిన తమ ఆస్తుల్ని తిరిగి ఇవ్వాలంటూ 1998లో జయలిత, ఆమె నెచ్చెలి శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్ చెన్నై ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కోర్టు తోసిపుచ్చడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. పెండింగ్ కేసుల సత్వర విచారణ లక్ష్యంగా హైకోర్టు చర్యలు చేపట్టడంతో 14 ఏళ్ల తర్వాత ఇటీవల జయలలిత అండ్ బృందం దాఖలు చేసుకున్న అప్పీలు పిటిషన్ విచారణకు వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ బెంగళూరు కోర్టులో ఉన్న దృష్ట్యా, అక్కడే తేల్చుకోవాలంటూ మద్రాసు హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఆస్తులు తిరిగి అప్పగింత కేసు విచారణకు సంబంధించిన వాదనలకు ప్రత్యేక న్యాయవాదుల్ని నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది హాజరు కావడం వివాదం రేపింది. దీంతో బెంగళూరు ప్రత్యేక కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విచారణకు హాజరు కావాల్సిందేనని జయలలిత అండ్ బృందానికి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 5వ తేదీన జరిగిన విచారణకు జయలలిత అండ్ బృందం వెళ్లాల్సి ఉంది. జయలలిత ఎన్నికల ప్రచారంలో ఉండడంతో డుమ్మా కొట్టారు. ఇదే విషయాన్ని ఆమె తరపు న్యాయవాదులు బెంగళూరు కోర్టు దృష్టికి తెచ్చారు. శశికళ, ఇలవరసి గైర్హాజరైనా సుధాకరన్ మాత్రం హాజరయ్యారు. శశికళ, ఇలవరసి గైర్హాజరును బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ గున్సా తీవ్రంగా పరిగణించారు. ఏడో తేదీ జరిగే విచారణకు జయలలిత మినహా తక్కిన వాళ్లందరూ హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. దీంతో చెన్నై నుంచి ఉదయాన్నే శశికళ, ఇలవరసి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. సుధాకరన్ వేరుగా వెళ్లారు. విచారణ సందర్భంగా శశికళను న్యాయమూర్తి ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టినట్టు సమాచారం. స్థిర, చర ఆస్తుల అప్పగింతకు సంబంధించి మద్రాసు హైకోర్టులో విచారణ జరుగుతుండడంపై ముందుగా తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని, ప్రభుత్వ న్యాయవాది విచారణకు ఎలా వెళతారంటూ పలు రకాల ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం.