అభిమానులు, మద్దతుదారులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు ముగిశాయి. మెరీనా బీచ్ లోని ఎమ్జీఆర్ స్మారక వనంలో ‘పురచ్చి తలైవీ’కి కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ నటరాజన్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జయ పెంపుడు కొడుకు సుధాకరన్ కూడా శశికళ పక్కనే ఉన్నారు.