ఆ పాపకు చిన్నమ్మ పెట్టిన పేరేంటో తెలుసా?
చెన్నై : ఎంతో మంది ప్రజల మన్ననలు పొంది, అసువులు బాసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై అభిమానంతో అప్పుడే పుట్టిన ఓ చిన్నారికి 'జయలలిత' అనే పేరును అమ్మ నెచ్చెలి శశికళ పెట్టారు. అమ్మకు గుర్తుగా ఈ పేరును పెట్టినట్టు తెలిసింది. అన్నాడీఎంకే కార్యకర్త అయిన సెంతిల్‌కుమార్, గాయత్రీలకు ఇటీవలే ఆడపిల్ల జన్మించింది. థేని జిల్లాకు చెందిన సెంతిల్ అమ్మకు అభిమాని. ఆయన ఆటో నడుపుతూ తన జీవనం సాగిస్తున్నాడు.
జయలలిత మరణించిన తర్వాత అమ్మపై ఉన్న ప్రేమతో తమ కూతురికి అమ్మ పేరు పెట్టాలని పాపను పోయెస్ గార్డెన్కు తీసుకుని వచ్చాడు. వారి అభిమానికి మురిసిపోయిన అమ్మ నెచ్చెలి శశికళ, ఆ చిన్నారికి జయలలిత అని నామకరణం చేశారు. జయలలిత మరణించిన అనంతరం అన్నాడీఎంకే చీఫ్గా శశికళ నటరాజన్ నియమితులైన సంగతి తెలిసిందే. శశికళ ప్రస్తుతం పోయెస్ గార్డెన్‌లో ఉంటున్నారు.