
ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం : మద్యం మత్తులో ముక్కు పచ్చలారని శిశువుపై కన్నతండ్రి దాడికి తెగబడ్డాడు. తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ చిన్నారి ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన కేరళలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూన్ 19వ తేదీన కేరళకు చెందిన 40 ఏళ్ల షైజు థామస్ అనే వ్యక్తి మద్యం మత్తులో 54 రోజుల సొంతబిడ్డపై దాడికి పాల్పడ్డాడు. విపరీతంగా కొట్టి, మంచంపై పడేశాడు. దీంతో చిన్నారి తీవ్రగాయాలపాలైంది. ( భర్తకు తెలియకుండా అప్పులు.. ఆపై సొంతింట్లోనే..)
ఆ తర్వాత తన కూతురు ప్రమాదవశాత్తు మంచంపైనుంచి కింద పడిపోయిందని చెప్పి ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే అతడి మాటలను వైద్యులు విశ్వసించలేదు. వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు థామస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment