ఊహాగానాలు నిజమయ్యాయి. తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారాయి. జయలలిత నెచ్చెలి, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 9:30 గంటలకు తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణం చేయనున్నారు. తమిళనాడుకు మూడో మహిళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.