
జయకు శశికళ అంతిమ సంస్కారాలు
అశ్రునయనాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు ముగిశాయి.
చెన్నై: అభిమానులు, మద్దతుదారులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు ముగిశాయి. మెరీనా బీచ్ లోని ఎమ్జీఆర్ స్మారక వనంలో ‘పురచ్చి తలైవీ’కి కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ నటరాజన్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జయలలిత మేనల్లుడు ఆమె పక్కనే ఉన్నారు.
చందనపు పేటికలో జయ పార్థీవ దేహాన్ని ఉంచి ఖననం చేశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ఎమ్జీఆర్ సమాధికి 20 మీటర్ల దూరంలో జయలలిత భౌతికకాయాన్ని పాతిపెట్టారు. ‘అమ్మ’ అంత్యక్రియలకు నాయకులు, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. ప్రజలందరూ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అనువుగా పెద్ద సంఖ్యలో ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు.
అంతకుముందు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాథాకృష్ణన్, గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం పన్నీరు సెల్వం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్, మాజీ గవర్నర్ రోశయ్య, తదితర ప్రముఖులు చివరిసారిగా ‘అమ్మ’కు వీడ్కోలు పలికారు.
[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]