
జయలలిత అంతిమ యాత్ర సాగింది ఇలా..
అభిమానులు, సన్నిహితులు, వివిధ పార్టీల నేతల అశ్రునయనాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు నిర్వహించారు.
చెన్నై: అభిమానులు, సన్నిహితులు, వివిధ పార్టీల నేతల అశ్రునయనాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు నిర్వహించారు. చెన్నై మెరీనా బీచ్ లోని ఎమ్జీఆర్ స్మారక వనంలో జయ రాజకీయ గురువు ఎంజీఆర్ సమాధికి 20 మీటర్ల దూరంలో ‘పురచ్చి తలైవీ’కి కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. జయ నెచ్చెలి శశికళ నటరాజన్ తన ప్రాణ స్నేహితురాలికి అశ్రునయనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించి తుది వీడ్కోలు పలికింది. అమ్మ అంత్యక్రియలను చూసేందుకు, తుది వీడ్కోలు పలికేందుకు పార్టీ నేతలు, అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు.
5:10 - శశికళతో కలిసి జయలలిత అంతిమయాత్రలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్
5:14 - చెపాక్ స్టేడియానికి చేరుకున్న జయ అంతిమయాత్ర. అక్కడి నుంచి బీచ్ రోడ్డు వైపునకు కొనసాగుతున్న కార్యక్రమం
5:19 - ఎంజీఆర్ స్మారకవనానికి చేరుకున్న వైకో
5:22 - చెన్నైలోని మెరీనా బీచ్‌కు చేరిన అమ్మ అంతిమ యాత్ర
5:32 - మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ స్మారక వనానికి జయ భౌతికకాయం
5:35 - అంతిమ సంస్కారాలు జరిపే చోటుకు చేరిన జయలలిత భౌతికకాయం
5:37 - అంత్యక్రియలు నిర్వహించే స్థలానికి చేరిన జయ శవపేటిక
5:39 - శవపేటిక నుంచి 'అమ్మ' భౌతికకాయాన్ని బయటకు తీశారు
5:44 - జయ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించిన తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు
5:46 - ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సీఎం జయలలిత అంతిమ సంస్కారాల కార్యక్రమాలు ప్రారంభం
5:48 - అమ్మ వీర విధేయుడు ఓ పన్నీర్ సెల్వంతో పాటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాధాక్రిష్ణన్ జయలలితకు అంతిమ నివాళి
5:51 - తంబిదురై, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, ఇతర కీలక నేతలు జయకు నివాళులు
5:53 - కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు జయకు నివాళులర్పించిన ఆ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్
5:53 - అన్నాడీఎంకే నేత జయకు అంతిమ సంస్కారాలు నిర్వహించే ప్రదేశం వద్ద కూర్చున్న శశికళ, ఆమె కుటుంబ సభ్యులు
5:54 - ఓ పూజారి జయ భౌతికకాయం వద్దకు వచ్చి కార్యక్రమం నిర్వహించారు.
5:56 - జయలలిత భౌతికకాయంపై ఉన్న జాతీయ పతాకాన్ని శశికళకు అప్పగింత. సాధారణంగా కుటుంసభ్యులకు ఇలా అందజేయడం ఆనవాయితీ
5:57 - మరో వ్యక్తితో కలిసి జయలలిత అంత్యక్రియల్లో పాల్గొన్న నెచ్చెలి శశికళ
6:02 - సందర్శనార్థం జయలలిత భౌతికకాయాన్ని ఉంచిన చందనపు శవపేటికను మూసివేత. జయ కడసారి చూపు ఇంతటితో ముగిసింది. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేసిన జయ నెచ్చెలి శశికళ, ఆమె కుటుంబ సభ్యులు.
[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]