చెన్నై: గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్టైన ఇద్దరి నుండి స్వాధీనం చేసుకున్న మొత్తం 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేయడంతో సాక్ష్యాధారాలు లేని కారణంగా వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
2022లో రాజగోపాల్, నాగేశ్వర రావు అనే ఇద్దరు వ్యక్తులు మారీనా బీచ్ సమీపంలో గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మరీనా పోలీసులు వీరి నుండి 22కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అందులోనుంచి 50 గ్రాములను మాత్రం పరీక్షల నిమిత్తం నార్కోటిక్ విభాగానికి పంపించారు. మిగిలిన మొత్తాన్ని వారి స్వాధీనంలోని ఉంచి నిందితులిద్దరినీ రిమాండుకు తరలించారు.
ఈ కేసులో మరీనా పోలీసులు ఇప్పటికే ఛార్జిషీటు కూడా దాఖలు చేయగా అప్పటి నుంచి చెన్నై హైకోర్టులోని మాదకద్రవ్య నియంత్రణ విభగంలో న్యాయవిచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా మంగళవారం కోర్టు పోలీసులను సాక్ష్యం సేకరించిన గంజాయిని కోర్టుకు చూపించమని కోరగా ఆ మొత్తాన్ని ఎలుకలు ఖాళీ చేసేశాయని చెప్పారు.
దీంతో విచారణ సమయంలో సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు రాజగోపాల్, నాగేశ్వర రావులను చెన్నై కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
ఇది కూడా చదవండి: ఏసీ వార్డు కోసం రచ్చ.. కయ్యానికి దిగిన వియ్యంకులు
Comments
Please login to add a commentAdd a comment