Marijuana smugglers
-
గంజాయి కుప్పం
కుప్పాన్ని దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్ది, అగ్రపథాన నిలుపుతాం.. ఇవీ పాలకులు గొప్పలు.. అయితే గంజాయి సాగు..దిగుమతి.. విచ్చలవిడిగా విక్రయం..అక్రమ రవాణా.. యువత పెడదోవ.. ఇవీ వాస్తవ పరిస్థితులు. వెరసి దిగజారుతున్న కుప్పం ప్రతిష్ట.. పొరుగున ఉన్న కర్ణాటకతోపాటు సుదూరంలోని కేరళలోనూ కుప్పం ప్రాంతవాసులపై గంజాయి రవాణా కేసులు నమోదే ఇందుకు నిదర్శనం.. ఇదీ నేడు కుప్పం దుస్థితి.శాంతిపురం: కుప్పం నియోజకవర్గంలో గంజాయి సాగు వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు గంజాయి వ్యాపారం, వినియోగం చేస్తున్నారని అధ్యాపకులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నెల రోజుల్లోనే పురోగతిని సాధించారు. రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో రెండు ప్రాంతాల్లో సాగులోని గంజాయి పంటను గుర్తించి నాలుగు కేసులు నమోదు చేశారు. 84 కిలోల పచ్చి గంజాయి, మరో 1.20 కిలోల ఎండిన గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవి ఇవే అయినా అటవీ ప్రాంతాలు, జన సంచారం లేని ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంకా ఎంత మేర గంజాయి సాగు ఉందనే ప్రశ్న తలెత్తుతోంది. గంజాయి ఆకులతో పాటు ద్రవ, సిగరెట్లు, చాక్లెట్ల రూపంలోనూ రవాణా, వినియోగం సాగుతోంది. ప్రశాంతతకు మారుపేరైన కుప్పంలో విస్తరిస్తున్న గంజాయి సంస్కృతిపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరో వైపు పొరుగు రాష్ట్రాల నుంచి డ్రగ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయనే ప్రచారం సాగుతోంది. కొందరు పెద్దల పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడినా గుట్టుగా రిహాబిటేషన్ సెంటర్లలో చేర్చి, చికిత్స అందించారని అంటున్నారు. ప్రధానంగా యువకుల తల్లిదండ్రులు ప్రస్తుత పరిస్థితుల్లో దురలవాట్ల నుంచి తమ పిల్లలను ఎలా రక్షించుకోవాలనన్న ఆవేదనలో ఉన్నా రు. స్వలాభం కోసం కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారాలు ఈ తరం యువతపై తీవ్ర దుష్పరిణామాలు చూపుతున్నాయని అంటున్నారు.విచ్చల విడి వినియోగంయువత, అసంఘటిత రంగాల కార్మికులు లక్ష్యంగా కుప్పం ప్రాంతంలో గంజాయి వ్యా పారం సాగుతోంది. గుడుపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో కొందరు విద్యార్థుల ప్రవర్తనలో తేడా గుర్తించిన అధ్యాపకులు పో లీసులకు సమాచారం ఇవ్వడంతో గంజాయి వ్యాపారం గుట్టు బయటకు వచ్చింది. కొందరు విద్యార్థులు వ్యాపారం చేస్తే మరి కొందరు వినియోగదారులుగా మారారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి సరఫరా చేస్తున్న వారిపై కేసులు పెట్టారు. కానీ గత ఆదివారం రాత్రి కుప్పం పట్టణ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థులు గంజాయి మత్తులో రాత్రి పూట జాతీయ రహదారిపై వీరంగం సృష్టించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా విచ్చల విడిగా గంజాయి సేవించి, రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. తమ ఆశయాలను, విజ్ఞతను, తల్లిదండ్రుల ఆశలను బుగ్గిలో పోసి మత్తులో తేలారు.దిగుమతుల మాటేమిటి ?స్థానికంగా గంజాయి సాగుపై పోలీసులు నిఘా, నియంత్రణ పెంచినా ఇతర ప్రాంతాల నుంచి దిగు మతి అవుతున్న సరుకు సంగతి ఏమిటన్నది ప్రశ్నగా మిగిలింది. కర్ణాటక నుంచి పలమనేరు ప్రాంతం మీదుగా కుప్పానికి గంజాయిని తరలి ముఠాను రెండు నెలల క్రితమే కన్నడ పోలీసులు పట్టుకున్నారు. మరో వైపు గంజాయి రవాణా చేస్తూ కడపల్లి పంచాయతీకి చెందిన వ్యక్తి కేరళ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి జోరుగానే సాగుతున్న విషయం స్పష్టం అవుతోంది. దీనిపైనా అధికార యంత్రాంగం దృష్టి సారించి, రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి గంజాయి సాగు, రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపా ల్సి ఉంది. ఇందుకోసం పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. -
ఖాకీ వనంలో గంజాయి మొక్కలు!
ఖాకీ వనంలో గంజాయి మొక్కలుగా పోలీసులు అవినీతి సొమ్ముకు అలవాటుపడి ఒక్కొక్కరుగా ఏసీబీ అధికారులు విసిరిన ‘వల’లో చిక్కుతున్నారు. కేవలం మూడున్నర మాసాల వ్యవధిలో నలుగురు ఖాకీలు అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడి పోలీస్‌శాఖకు మచ్చతెచ్చారు. మెదక్‌జోన్: జిల్లాలోని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల సమీపంలో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్లో గత మార్చి 19న అవుసులపల్లి వార్డుకు చెందిన ఓవ్యక్తి ఇసుకను గ్రామశివారులోని వాగు నుంచి అక్రమంగా తరలిస్తుండగా రూరల్ పోలీసులు ట్రాక్టర్‌ను సీజ్‌చేశారు. దీంతో ఆ యజమాని మైనింగ్ అధికారులకు జరిమానా చెల్లించి ట్రాక్టర్‌ను విడుదల చేయాల్సిందిగా కోరాడు. అందుకు రూ.25వేలు లంచం ఇస్తేనే ట్రాక్టర్‌ను వదిలిపెడతామని ఓ కానిస్టేబుల్ ట్రాక్టర్ యజమానిని డిమాండ్ చేశాడు. దీంతో విసుగు చెందిన ఆ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో లంచం తీసుకుంటుండగా పోలీస్ రైటర్ బాసిత్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హేండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే స్టేషన్ బయట ఉన్న ఎస్ఐ అమర్ ఫోన్ స్విచ్చ్ఆఫ్ చేసుకుని పారిపోయారు. పది రోజులపాటు ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా పరారైయ్యారు. 15రోజుల అనంతరం ఎస్ఐ డ్యూటీలో చేరిన విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు మళ్లీ విచారణ జరిపారు. లంచం తీసుకున్న కేసులో ఎస్ఐతోపాటు మరో కానిస్టేబుల్ సురేందర్ హస్తం ఉందని నిర్ధారించి ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌తోపాటు ఎస్ఐ అమర్‌ను సస్పెండ్‌చేసి రిమాండ్‌కు తరలించారు.ఏసీబీ ట్రాప్‌లో నలుగురుతాజాగా హవేళిఘణాపూర్ ఎస్ఐ ఆనంద్‌గౌడ్‌తో సహా కేవలం మూడున్నర నెలల వ్యవధిలోనే ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుల్స్ కలిసి మొత్తం నలుగురు ఏసీబీకి పట్టుబడడంతో పోలీసుల అవినీతి బాగోతంపై జిల్లాలో చర్చసాగుతోంది.ఏసీబీ వలలో హవేళి ఎస్ఐహవేళిఘణాపూర్: ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఓ టిప్పర్‌ను వదిలిపెట్టేందుకు మధ్యవర్తి ద్వారా రూ.20వేలు లంచం తీసుకుంటుండగా స్థానిక ఎస్ఐ ఆనంద్ గౌడ్‌ను ఏసీబీ అధికారులు ట్రాప్‌చేసి సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌కు చెందిన పూల గంగాధర్ టిప్పర్ ఈ నెల 29న ఇసుకను తరలిస్తూ పట్టుబడింది. ఈ టిప్పర్‌ను విడిచిపెట్టడానికి ఎస్ఐ ఆనంద్ గౌడ్ రూ.50వేలు డిమాండ్ చేయగా రూ.20వేలకు ఒప్పందం కుదిరింది. ఈ కేసులో గంగాధర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం మధ్యవర్తి మస్తాన్ అనే వ్యక్తి హవేళిఘణాపూర్ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి డబ్బులు తీసుకొనివెళ్లి ఎస్ఐకు ఇవ్వగా పట్టుకొని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ సిబ్బంది రమేశ్, వేణు పాల్గొన్నారు. -
22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు
చెన్నై: గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్టైన ఇద్దరి నుండి స్వాధీనం చేసుకున్న మొత్తం 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేయడంతో సాక్ష్యాధారాలు లేని కారణంగా వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2022లో రాజగోపాల్, నాగేశ్వర రావు అనే ఇద్దరు వ్యక్తులు మారీనా బీచ్ సమీపంలో గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మరీనా పోలీసులు వీరి నుండి 22కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అందులోనుంచి 50 గ్రాములను మాత్రం పరీక్షల నిమిత్తం నార్కోటిక్ విభాగానికి పంపించారు. మిగిలిన మొత్తాన్ని వారి స్వాధీనంలోని ఉంచి నిందితులిద్దరినీ రిమాండుకు తరలించారు. ఈ కేసులో మరీనా పోలీసులు ఇప్పటికే ఛార్జిషీటు కూడా దాఖలు చేయగా అప్పటి నుంచి చెన్నై హైకోర్టులోని మాదకద్రవ్య నియంత్రణ విభగంలో న్యాయవిచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా మంగళవారం కోర్టు పోలీసులను సాక్ష్యం సేకరించిన గంజాయిని కోర్టుకు చూపించమని కోరగా ఆ మొత్తాన్ని ఎలుకలు ఖాళీ చేసేశాయని చెప్పారు. దీంతో విచారణ సమయంలో సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు రాజగోపాల్, నాగేశ్వర రావులను చెన్నై కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఏసీ వార్డు కోసం రచ్చ.. కయ్యానికి దిగిన వియ్యంకులు -
ఔరా.. ఎలుకల మహత్యం!
సాక్షి, చైన్నె: ఎలుకల పుణ్యమా అంటూ గంజాయి కేసు నుంచి ఇద్దరు నిందితులు విడుదలయ్యారు. పట్టుబడ్డ గంజాయిలో సగానికి సగం ఎలుకలు తినేయడం, పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించక పోవడంతో కేసు కొట్టి వేస్తూ నిందితులను మంగళవారం మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. వివరాలు.. రెండేళ్ల క్రితం మెరీనా బీచ్ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లుగా ఆ ప్రాంతానికి చెందిన రాజగోపాల్, నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసు విచారణ చైన్నె హైకోర్టు ఆవరణలోని మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టులో సాగుతూ వచ్చింది. చార్జ్‌షీట్‌లో ఆ ఇద్దరి నుంచి 22 కేజీలు పట్టుకున్నట్లు మెరీనా పోలీసులు కోర్టుకు వివరించారు. ఇందులో కొంత పరిశోధనకు పంపించగా, మిగిలిన 21 కేజీల 900 గ్రామాలను భద్రత పరిచామని పేర్కొన్నారు. అయితే కోర్టుకు విచారణ సమయంలో పట్టుబడ్డ మొత్తం గంజాయి కాకుండా కేవలం 11 కేజీలు మాత్రమే సమర్పించారు. మిగిలిన గంజాయి ఎక్కడఅని కోర్టు ప్రశ్నించగా, ఎలుకలు తినేసినట్టు మెరీనా పోలీసులు సమాధానం ఇవ్వడం ఇటీవల చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లో ఈకేసు తుది విచారణ ముగియడంతో మంగళవారం తీర్పు వెలువడింది. చార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లుగా గంజాయిని కోర్టులో సమర్పించిక పోవడం, ఆధారాలు సరిగ్గా లేక పోవడంతో కేసును కోర్టు కొట్టి వేసింది. ఇద్దరు నిందితులను విడుదల చేసింది. ఎలుకల పుణ్యమా ఈఇద్దరు జైలు శిక్ష నుంచి బయట పడటం గమనార్హం. ఇదిలా ఉండగా ఇటీవల కోయంబేడు పోలీసులు పట్టుకున్న 33 కేజీల గంజాయిలో 19 కేజీలను ఎలుకలు తినేసినట్టుగా కోర్టుకు వివరాలు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు బయటపడ్డారు. అదే సమయంలో పట్టుబడ్డ గంజాయిని భద్ర పరచడంలో పోలీసులు విఫలమయ్యారా? లేక ఎలుకల పేరిట గంజాయిని బయటకు పంపించి సొమ్ము చేసుకున్నారా? అనే పోస్టులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. -
ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు
తిరువళ్లూరు: కేరళ నుంచి రైలులో అక్రమంగా గంజాయిని తరలించి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఐనవరంలో అక్రమంగా గంజాయిని నిల్వ వుంచి విక్రయిస్తున్నట్టు కమిషనర్ సందీప్‌రాయ్ రాథోడ్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు అంబత్తూరు ఇన్స్పెక్టర ధనమ్మాల్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఇంట్లో అక్రమంగా నిల్వ వుంచి గంజాయి విక్రయిస్తున్న అంబత్తూరుకు చెందిన ఉదయకుమార్ భార్య కళావతి(63), శంకర్ భార్య రాణి(59) చైన్నె కొళత్తూరుకు చెందిన కుమార్ కుమారుడు ఆకాష్(23)ను అరెస్టు చేశారు. వారి నుంచి 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పూందమల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
812 కిలోల గంజాయి స్వాధీనం
కోటవురట్ల (అనకాపల్లి జిల్లా): సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లర్లు పోలీసుల ఛేజింగ్ నుంచి తప్పించుకుపోయారు. వారు వదిలిన వాహనాల నుంచి పోలీసులు 812 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాపై పోలీసులకు వచ్చిన సమాచారంతో ఎస్ఐ నారాయణరావు సిబ్బందితో కలిసి పి.కె.పల్లి–ఆక్సాహేబుపేట ప్రాంతంలో నిఘా పెట్టారు. అదే సమయంలో రెండు కార్లు, ఒక బైకు అనుమానాస్పదంగా రావడంతో పోలీసులు వెంబడించారు. అయితే స్మగ్లర్లు అతి వేగంగా పోలీసులకు దొరక్కుండా కార్లు నడుపుతూ రోడ్డుకు ఎగువన ఉన్న ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి అందులో నుంచి దూకేసి పొదల్లో పరుగు తీసి తప్పించుకున్నారు. వాహనాల్లో 812 కిలోల గంజాయి పట్టుబడినట్టు ఎస్ఐ నారాయణరావు చెప్పారు. దీని విలువ రూ.16.24 లక్షలు ఉంటుందన్నారు. -
ఏజెన్సీ టు ఢిల్లీ.. వయా కందుకూరు
కందుకూరు: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మీదుగా ఢిల్లీకి అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.10 లక్షల విలువజేసే 105 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటనలో పరారీలో ఉన్న ఇద్దరిని కందుకూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ కండె శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లాకు చెందిన పాములపాటి శ్రీనివాస్ వృత్తిరీత్యా సెకండ్‌హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తుంటాడు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేసేవాడు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకురావడం.. దేశ రాజధాని ఢిల్లీకి తరలించి అక్కడి ఏజెంట్లకు అప్పజెప్పడం వంటి పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో 2016లో రాజమండ్రి పోలీసులు అరెస్టు చేయడంతో మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. తరువాత 2021లో మరోసారి ఢిల్లీ పోలీసులకు చిక్కి ఇటీవలే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన పాల రవితేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో ఇద్దరూ కలిసి మళ్లీ గంజాయి అక్రమ రవాణాకు తెరతీశారు. కాగా, గత నెల 24వ తేదీ కందుకూరు ఓవీ రోడ్డులోని పలుకూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో కారులో గంజాయి తరలిస్తున్న వీరిద్దరూ పోలీసులను చూసి కారు వదిలేసి పారిపోయారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు పరిశీలించి చూడగా.. కారు సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 51 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కందుకూరులోని శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీనివాస్, రవితేజను సోమవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మరో 20కేజీల గంజాయిని, రూ.20 లక్షల విలువైన మూడు కార్లను, రూ.20వేల విలువజేసే 8 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
గడువు.. రెండు నెలలు
సాక్షి, అనకాపల్లి: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా.. ప్రశాంత వాతావరణంలో జిల్లా ప్రజలు నివసించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపై పోలీస్ అధికారులు దృష్టి సారించాలని ఎస్పీ గౌతమి సాలి ఆదేశించారు. రెండు నెలల్లో జిల్లాలో ఎక్కడా గంజాయి, నాటుసారా అనేది లేకుండా మూలాల్ని నాశనం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఈ క్రతువులో బాగా పనిచేసే సిబ్బందికి రివార్డులతో పాటు పని చెయ్యని వారిపై చర్యలూ ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), జిల్లా పోలీసులతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఈబీ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా గంజాయి, నాటుసారాలపై ఎన్ఫోర్స్మెంట్ చేయాలని ఆదేశించారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా గ్రామాల్లో ముమ్మర దాడులు నిర్వహించి జిల్లా నుంచి సమూలంగా నిర్మూలించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వివిధ నేరాలకు సంబంధించి నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ.. అందులో గంజాయి, నాటుసారా కేసులలో ఉన్న పాత నేరస్తులపై బైండోవర్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. వారు మళ్లీ.. ఈ తరహా కేసుల్లో దొరికితే స్థానిక తహసీల్దార్ కోర్టులో నగదు పూచీతో జరిమానా కట్టించాలని, లేదంటే జైలు శిక్ష అనుభవిం చాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వివరాల్ని ప్రతి గ్రామంలోని ప్రజలకు తెలియజేసే ఏర్పాట్లు చేయాలన్నారు. నల్లబెల్లం ఎక్కడిది.? నాటుసారా తయారీలో ప్రధాన ముడిపదార్థమైన నల్లబెల్లం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. గడిచిన రెండు వారాల్లో దాదాపు 50 వేల లీటర్లకు పైగా బెల్లం పులుపుని ధ్వంసం చేసినా.. ఇంకా పలు చోట్ల పట్టుబడుతుండటంపై ఎస్పీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అసలు ఈ నల్లబెల్లం ఎక్కడి నుంచి వస్తోంది.? నాటుసారా తయారు చేస్తున్నవారు ఎలా కొనుగోలు చేస్తున్నారు.? అనే కోణంలో దర్యాప్తు నిర్వహించి.. సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. అనకాపల్లిలో ఉన్న బెల్లం వ్యాపారులతో ఎస్ఈబీ, స్థానిక పోలీసులు సమావేశాలు ఏర్పాటు చేసి.. నల్లబెల్లం విక్రయాలపై నిఘా పటిష్టం చెయ్యాలని ఎస్పీ సూచించారు. అధికారులకు రివార్డులు జిల్లా నుంచి గంజాయి, నాటుసారా సమూల నిర్మూలనకు చేస్తున్న యుద్ధంలో ప్రతి ఒక్క పోలీస్ అధికారి కీలక భాగస్వామిగా మారాలని ఎస్పీ గౌతమి పిలుపునిచ్చారు. ఎన్ఫోర్స్మెంట్లో ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు ఉంటాయని ప్రకటించారు. అదే సమయంలో అంచనాలకు తగ్గట్లుగా పనిచెయ్యని సిబ్బందిపై చర్యలు కూడా తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్) కె.శ్రావణి, నర్సీపట్నం సబ్ డివిజన్ అదనపు ఎస్పీ మణికంఠ చందోలు, ఎస్ఈబీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రవికుమార్‌తోపాటు జిల్లా సీఐలు, ఎస్ఐలు, ఎస్ఈబీ ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు. గంజాయి రవాణాపై గట్టి నిఘా గొలుగొండ: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వస్తున్న గంజాయిపై దృష్టి సారించాలని, గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ గౌతమి సాలి ఆదేశాలు జారీ చేశారు. ఆమె గురువారం రాత్రి ఏజెన్సీకి ముఖద్వారం అయిన కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. తరువాత భీమవరం చెక్‌పోస్టును తనిఖీ చేశారు. చింతపల్లి, జీకేవీధి నుంచి గంజాయి రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కృష్ణదేవిపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి, రికార్డులు పరిశీలించారు. ఆమె వెంట నర్సీపట్నం ఏఎస్పీ మణీకంఠ చందోల్, సీఐ స్వామినాయుడు, ఎస్ఐ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. -
‘పుష్ప’ను ఫాలో అయ్యి.. పరారయ్యారు!
శృంగవరపుకోట/నర్సీపట్నం: ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో పాల ట్యాంకర్లో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తారు. ఈ ఐడియా ఏదో మనకు పనికొస్తుంది అనుకున్నారో ఏమో.. ఆ గంజాయి స్మగ్లర్లు అచ్చం అదే ఐడియాను అనుసరించారు. ఆయిల్ ట్యాంకర్లో గంజాయి రవాణా చేస్తూ విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసులకు దొరికిపోయారు. అరకు నుంచి ఎస్.కోట వైపు వస్తున్న ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం ఆదివారం ఎస్.కోట ఎస్ఐ తారకేశ్వరరావుకు అందింది. దీంతో తన సిబ్బందితో కలిసి బొడ్డవర చెక్‌పోస్టు వద్ద కాపుకాశారు. ఉదయం 7.30 గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తొలుత తమ లారీలో ఎలాంటి గంజాయి లేదని డ్రైవర్, క్లీనర్లు బుకాయించారు. పోలీసులు ట్యాంకర్ పైకి ఎక్కి నాలుగు కంపార్ట్మెంట్లపై క్యాప్‌లకు ఉన్న నట్లు తీసేందుకు ప్రయత్నించగా వారు అక్కడ నుంచి ఉడాయించారు. ట్యాంకర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి నాలుగు కంపార్ట్మెంట్ల క్యాప్‌లు తెరచి చూడగా.. ముందున్న కంపార్ట్మెంట్, వెనుక ఉన్న రెండు కంపార్ట్మెంట్లను ఖాళీగా వదిలేశారు. మధ్యలోని రెండో కంపార్ట్మెంట్లో లోడ్ చేసిన 780 కిలోల 149 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. నర్సీపట్నంలో రూ.3 లక్షల విలువైన గంజాయి స్వాధీనం లారీలో తరలిస్తున్న 1100 కిలోల గంజాయిని విశాఖ జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ తన సిబ్బందితో కలిసి చింతపల్లి రోడ్డు నెల్లిమెట్ట వద్ద శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసులను గమనించిన డ్రైవర్ కొద్ది దూరంలో లారీ ఆపి పారిపోయాడు. లారీని పోలీసులు తనిఖీ చేయగా సుమారు రూ.3 లక్షల విలువైన గంజాయి బయటపడింది. -
గంజాయి సాగుపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గంజాయి సాగుపై చేపట్టిన జాయింట్ ఆపరేషన్ విజయవంతమైంది. పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), ఐటీడీఏ సంయుక్త భాగస్వామ్యంతో బుధవారం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు. చింతూరు సబ్ డివిజన్ మోతుగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒడియా క్యాంప్‌లో ఈ ఆపరేషన్ చేపట్టారు. అక్కడి క్యాంప్‌లో నివసిస్తున్న సుమారు 130 కుటుంబాల్లో ఎక్కువ మంది చాలాకాలంగా గంజాయి సాగు చేస్తున్నారు. చింతూరు మండలంలోని వలస ఆదివాసీ గ్రామం ఒడియా క్యాంపునకు చెందిన వలస ఆదివాసీలు గంజాయి స్మగ్లర్ల ప్రలోభాలకు లొంగి ఇరురాష్ట్రాల సరిహద్దుల్లోని కొండ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనా«థ్‌బాబు ఆ ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో మోతుగూడెం ఎస్సై సత్తిబాబు ఒడిశా క్యాంప్‌లో 10 ఎకరాల్లో గంజాయి సాగవుతున్నట్టు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు స్వయంగా ఆ గ్రామంంలో పర్యటించి ఆదివాసీలకు ‘పరివర్తన’ పేరిట కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో ఎస్పీతో పాటు ఇతర అధికారులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గంజాయి పండిస్తున్న ప్రాంతానికి కాలి నడకన వాగులు, గుట్టలు దాటుకుంటూ వెళ్లి గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. ఎకరానికి 5 వేల మొక్కల చొప్పున పదెకరాల్లో నాటిన సుమారు రూ 2.50 కోట్ల విలువైన 50 వేల మొక్కలను నరికివేసి నిప్పు పెట్టారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ బి.రమాదేవి, చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ, రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పాటిల్, చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్, ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 60 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం గూడెం కొత్తవీధి: విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ పరిధిలోని రంపుల, తియ్యల మామిడి గ్రామాల్లో గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 60 ఎకరాల్లో సాగు చేస్తున్న తోటలను ధ్వంసం చేసి నిప్పంటించామని సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఎస్ఈబీ, పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి గంజాయి సాగు చేస్తున్న గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ షమీర్, ఆర్ఎస్ఐ నరేంద్ర, ఏఈఎస్ బి.శ్రీనాథుడు, అటవీశాఖ అధికారి భూషణం పాల్గొన్నారు. -
గొడ్డళ్లతో గంజాయి స్మగ్లర్ల దాడి
చింతపల్లి/నర్సీపట్నం/సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. లంబసింగి సమీపంలో గంజాయి స్మగ్లర్లను తరలిస్తున్న తెలంగాణ పోలీసులపై అక్రమ రవాణా ముఠా దాడికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం వారు గాలిలోకి కాల్పులు జరిపినట్లు విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు. నల్లగొండ పోలీసుస్టేషన్లో నమోదైన గంజాయి కేసులో నిందితుల కోసం తెలంగాణ పోలీస్ ప్రత్యేక బృందం విశాఖకు వచ్చిందన్నారు. 15–20 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేస్తుండగా రోడ్డుకు అడ్డంగా టిప్పర్‌ను నిలిపి కత్తులు, గొడ్డళ్లు, రాళ్లతో దాడికి దిగి పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఓ గంజాయి స్మగ్లర్కి గాయాలయ్యాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. చింతపల్లి మండలం తురబాలగెడ్డ సమీపంలో లంబసింగి ఘాట్‌రోడ్డులో ఈ ఘటన జరిగింది. గాలిపాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు గత వారం అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ నల్లగొండ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో ఈ నెల 15వ తేదీన కిల్లో బాలకృష్ణ (30), కిల్లో భీమరాజు (26), నారా లోవ (30) అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వారిపై ఆరా.. ఖాకీల్లో గుబులు..!
సాక్షి, అమరావతిబ్యూరో: గంజాయి మాఫియా ముఠాలతో సంబంధాలున్న పోలీసు శాఖలోని కొంతమందిపై చర్యలు చేపట్టేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు రంగం సిద్ధం చేశారు. బాధ్యతగా ఉండాల్సింది పోయి మామూళ్ల మత్తులో జోగుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు కసరత్తు చేస్తున్నారు. గంజాయి ముఠాలకు పోలీసు శాఖలో ఎవరు సహకరిస్తున్నారనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. విచారణ అనంతరం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని సీపీ భావిస్తున్నట్లు సమాచారం. కింది స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. అక్రమార్జనే ధ్యేయం విజయవాడ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేమాల్సిన పోలీసు అధికారులు గత ప్రభుత్వ పాలనలో అడ్డదారుల్లో పయనించి, అక్రమార్జనే ధ్యేయంగా పనిచేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఇప్పటికీ అదేరీతిలో భక్షకులై చెలరేగిపోతున్నారు. న్యాయం కోసం ఆశ్రయించిన వారిని నయానో.. భయానో తమ దారికి తెచ్చుకుని దోచేస్తున్నారు. నానా తంటాలు పడి పోస్టింగ్ తెచ్చుకున్నాం. ‘ఇప్పుడు కాక మరెప్పుడు..’ సంపాదించుకోవాలనే తరహాలో రీతిలో దందాలు, దోపిడీ మార్గంలో ఉరకలేస్తున్నారు. ఇలా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. ఏకంగా పోలీసు కమిషనరేట్‌లోనే అక్రమాలకు తెరలేపారు. గంజాయి, గుట్కా వ్యాపారులకు అండదండలు అందిస్తూ వారి నుంచి నెలవారీ ముడుపులు దండుకుంటున్నారు. స్టేషన్లకు వచ్చే కేసులనే ఆదాయ వనరులుగా మార్చుకుని దోపిడీకి బరితెగిస్తున్న పోలీసు శాఖలోని పలువురి అధికారులపై పోలీసు బాస్ సీరియస్‌గా ఉన్నారు. అన్నీ నమ్మినబంటుల ద్వారానే.. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, వైట్ కాలర్ పంచాయతీలను చక్కబెట్టడానికి.. గుట్టుచప్పుడు కాకుండా వాటాలను అందజేయానికి అడ్డదారిలో వెళ్తున్న అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిలో ఒకరిద్దరిని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. పోలీసుల్లో పారదర్శకత లోపిస్తున్న విషయంపై ఇంటిలిజెన్స్ వర్గాలు నివేదించడం లేదా? ఈ అక్రమాలు పైస్థాయికి వెళ్లడం లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. అవినీతి పోలీసులపై ఆరా విజయవాడ నగరం వ్యవస్థీకత నేరాలకు అడ్డాగా మారింది. ఇక్కడ నిత్యం భూకబ్జాలు, సివిల్ తగాదాలు, జీరో వ్యాపారం, కాల్‌మనీ, గంజాయి వంటి కేసులతో కొన్ని పోలీసు స్టేషన్లు నిత్యం కిటకిటలాడుతుంటాయి. ఇదే కొందరు పోలీసులకు ఆదాయ వనరుగా మారింది. సివిల్ తగాదాల్లో తలదూర్చి అందినకాడికి దండుకుంటున్నారు. వెండి, బంగారు వ్యాపారులతో కుమ్మక్కై వారు చేసే జీరో వ్యాపారానికి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే కొంత మందికి గంజాయి మాఫియా సభ్యులతో సంబంధాలున్నట్లు తేలినట్లు సమాచారం. గంజాయి స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించేందుకు కసరత్తు చేస్తుండగా, మరోవైపు శాఖాపరమైన చర్యలకు సీపీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. దీంతో గంజాయి స్మగ్లర్లతో సంబంధమున్న పోలీసుల్లో గుబులు మొదలైంది. -
గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు
హైదరాబాద్: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు అంతరాష్ట్ర ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ, మీర్‌పేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 82 కిలోల గంజాయి, ఒక బైక్, రూ.35 వేల నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన కమోజీ కొండల్ (31) నగరంలో మీర్‌పేటలో నివాసం ఉంటూ గంజాయి సరఫరా చేస్తున్నాడు. కొండల్ 2017లో గంజాయి సరఫరా చేస్తూ తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మోతిగూడం పోలీసు స్టేషన్లో పట్టుబడాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపించారు. జైల్లో తూర్పు గోదావరి జిల్లా రామవరం మండలానికి చెందిన ఫంగితెలి తేజ (28) పరిచయమయ్యాడు. జైలు నుంచి వచ్చిన తరువాత వీరిద్దరూ కలిసి గంజాయి సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. తేజ విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి, పాడేరు, ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన రాజు పరిచయమయ్యాడు. ఇతడు కూడా గంజాయి సరఫరా చేస్తుంటాడు. వీరితోపాటు విశాఖ జిల్లాకు చెందిన నాగార్జున, చిన్నబాబులతో కలసి ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని ట్రావెల్ బ్యాగుల ద్యారా నగరానికి తెచ్చేవారు. దీనిని కొండల్ నివాసం వద్ద నిల్వ ఉంచారు. పోలీసులకు పట్టుబడిందిలా.. మంగళవారం ఆసిఫ్ నగర్‌కు చెందిన సుబేడర్ వినోద్ సింగ్ కొండల్ దగ్గర 10 కేజీల గంజాయిని రూ.30 వేలకు కొనుగోలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కొండల్ ఇంటిపై దాడి చేసి 82 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినోద్ సింగ్ కొనుగోలు చేసిన గంజాయిని 100 గ్రాములుగా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మార్చి నగరంలోని విద్యాసంస్థల వద్ద అమ్మతున్నట్లు గుర్తించారు. అనంతరం కొండల్, ఫంగితెలి తేజ, నాగార్జున, చిన్నబాబు, వినోద్ సింగ్‌లను అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన రాజు పరారీలో ఉన్నాడని.. త్వరలో అతడిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. -
వేంపాడు వద్ద గంజాయి పట్టివేత
నక్కపల్లి(పాయకరావుపేట): ముందస్తు సమాచారంతో పోలీసులు దాడిచేసి వేంపాడు వద్ద 35 కిలోల గంజాయిని పట్టుకున్నారు. చింతపల్లి నుంచి గంజాయిని రవాణా చేస్తున్నారన్న సమాచారం తెలియడంతో గురువారం వేకువజామున వేంపాడు టోల్గేట్ వద్ద ఎస్ఐ పి.సింహాచలం, సిబ్బందితో కలిసి దాడి చేశారు. కారులో తరలిస్తున్న సుమారు 35 కిలోల గంజాయి ప్యాకెట్లను, కారు, రూ3,19,500 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు.పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.75వేలు ఉంటుందని అంచనా. గంజాయి రవాణా కేసులో వేంపాడు గ్రామానికి చెందిన ఎం.శ్రీను, నెల్లిపూడి గ్రామానికి చెందిన కె.సతీష్, ఉద్దండపురం గ్రామానికి చెందిన పి.భవానీ, నామవరానికి చెందిన ఇసరపు అప్పలరాజు ,పక్కుర్తి శివలను అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించినట్టు ఎస్ఐ సింహాచలం చెప్పారు. ఈ దాడుల్లో ట్రైనీ ఎస్ఐ నజీర్, హెచ్‌సీలు పరమేశ్, నర్సింగరావు, సిబ్బంది రామకష్ణ, రమణ, దుర్గాభవానీ తదితరులు పాల్గొన్నారు వేంపాడు, టోల్గేట్ పరిసరాలే స్థావరాలు కొంతకాలం నుంచి ఈ ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడుకాకండా గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వేంపాడు,టోల్గేట్ పరిసర ప్రాంతాలను వ్యాపారులు గంజాయి రవాణాకు స్థావరాలుగా మార్చుకున్నట్టు తెలుస్తోంది.ఇటీవల కాలంలో గంజాయి ఎక్కువగా టోల్గేట్ పరిసర ప్రాంతాల్లోనే పట్టుబడుతుండడం ఈ అనుమానాలకు తావిస్తోంది.ఏజెన్సీ వాసులతో పాటు,చెన్నైకు చెందినవారే గంజాయి రవాణా చేస్తున్నారని ఇప్పటి వరకు భావించారు. కానీ ఈ వ్యాపారంలో స్థానికుల పాత్ర కూడా ఉన్నట్టు గురువారం గంజాయి చిక్కడంతో తెలుస్తోంది. స్మగ్లర్ల మధ్య తలెత్తిన విబేధాల కారణంగానే పోలీసులకు సమాచారం అందుతోంది. గంజాయి వ్యాపారంలో ఉద్దండపురానికి చెందిన మహిళ కూడా ఉండడం చర్చనీయాంశమైంది. ఏజెన్సీ నుంచి గంజాయిని తెచ్చి వేంపాడు, ఉద్దండపురం గ్రామాల్లోపలు ఇళ్లల్లో నిల్వచేసి, బస్సుల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిసింది. ఈవిధంగా గురువారం చింతపల్లి నుంచి గంజాయిని వేంపాడు తరలించి, అక్కడనుంచి ఇతర ప్రాంతాలకు చేరవేసే క్రమంలో వ్యాపారుల మధ్య ఏర్పడిన విబేధాలు కారణంగా దొరికిపోయినట్టు భావిస్తున్నారు. నిందితుల్లో పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన వారు కూడా ఉండడంతో అక్కడ కూడా పూర్తిస్థాయిలోవిచారణ జరపాల్సి ఉంది. -
కోటి రూపాయల విలువజేసే గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి బొడ్డపొడ పంచాయతీ పీపార్ పొదర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఏడు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని జొగ్గ బంధు ఖొర అనే గిరిజనుడి ఇంట్లో పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి గంజాయి మాఫి యా ముఠా వస్తామని చెప్పడంతో జొగ్గబంధు ఖొర తన ఇంటిలో సుమారు 22 బస్తాల గంజాయిని సిద్ధంచేశాడు. అయితే పెట్రోలింగ్ పోలీసులు తిరిగి వస్తున్న సమయంలో గంజాయి బయటపడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని జొగ్గబంధు ఖొరను అరెస్ట్ చేశారు. నిందితులు గంజాయిని ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్, బీహార్, భువనేశ్వర్, వెస్ట్‌బెంగాల్ తదితర రాష్ట్రాలకు తరలిస్తారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు అమ్ముతారు. ఇదే మాదిరిగా కారులో 52 కిలోల గంజాయిని మధ్యప్రదేశ్ తరలిస్తుండగా మల్కన్‌గిరి–సుకుమ రహదారులో పోలీసులు పట్టుకున్నారు. కారులో గంజాయి తరలిస్తున్న 6గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ రెండు ఘటనల్లో పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న 6గురు నిందితులు అశోక్ ఖెముండు(23), శివనారాయణ సోలంకి(45), నరేంద్ర పొంగి(26), ప్రహ్లద్ ఖొర(30), నారాయణ గొంప హరి(27), నరసింగ్ ఖొర(25)లు. వీరంతా మల్కన్‌గిరి జిల్లా ఒర్కిల్ నుంచి గిరిజనుల వద్ద గంజాయి కొనుగోలు చేసి మధ్య ప్రదేశ్‌కు సరఫరా చేస్తున్నారు. కటాఫ్ ఏరియా నుంచి గిరిజనులు కావిళ్లతో గంజాయిని తీసుకువస్తే, గంజాయి మాఫియా కారుల్లో, ఇతర వాహనాల్లో వచ్చి వారి దగ్గర అతి తక్కువ ధరకు కొని వారు మాత్రం ఎక్కువ ధరకు అమ్ముతారు. గిరిజనుల నుంచి కిలో గంజాయి రూ.400కు కొని మాఫియా మాత్రం రూ.3000కు అమ్మి సొమ్ము చేసుకుం టోంది. మల్కన్‌గిరి జిల్లా చిత్ర కొండ కటాఫ్ ఏరి యాను మావోయిస్టులు అడ్డాగా మార్చుకున్నారు. మావోయిస్టుల సహాయంతో గిరిజనులు గంజా యి సాగు చేస్తున్నారు. ఎన్నిసార్లు పంటను ధ్వం సం చేసినా తిరిగి అదే పంటను పండిస్తున్నారు. -
గంజాయి హబ్ గా ఇందూరు
♦ విశాఖపట్నం టూ మహారాష్ట్ర! ♦ వయా సూర్యాపేట, నిజామాబాద్.. ♦ నల్గొండలో రూ. 10 లక్షల గంజాయి స్వాధీనం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గంజాయి స్మగ్లర్లకు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా మారింది. ఏళ్ల తరబడిగా సాగుతున్న ఈ దందాను అరికట్డంలో పోలీసు, అబ్కారీశాఖలు విఫలం అవుతున్నాయి. అప్పుడప్పుడు కేసులు నమోదు చేసినా.. లోతైన విచారణ లేక గంజాయి దందా షరా‘మామూలు’గా మారుతోంది. ఒడిషా, విశాఖపట్నం సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పండించే గంజాయికి మహారాష్ట్రలో డిమాండ్ ఉంది. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా గాంధారి ప్రాంతం గంజాయి సాగుకు కేంద్రం కాగా.. ఇక్కడి నుంచే నేరుగా మహారాష్ట్రకు సరఫరా చేసేవారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యాపారులు ఇప్పుడు మౌనం వహించారు. విశాఖపట్నం నుంచి గుట్టుచప్పుడు కాకుండా నిజామాబాద్ జిల్లాకు గంజాయిని తరలిస్తున్న ముఠాను సూర్యాపేట పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. సీఐ వై.మొగలయ్య గురువారం స్థానిక పోలీసుస్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ముఠా వివరాలు తెలిపారు. ఆ వివరాలిలా.. విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం గండిగడ్ల గ్రామానికి చెందిన సింహాచలం, రవి వద్ద నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫరూఖ్ 123 ప్యాకెట్ల గంజాయిని కొనుగోలు చేశాడు. ఆ గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా నిజామాబాద్‌కు తరలించేందుకు బొలేరో వాహనాన్ని మాట్లాడుకున్నారు. ప్యాకెట్లను వాహనంలో భద్రపరిచి సింహాచలం, రవి, ఫరూఖ్‌లు కలిసి విశాఖపట్నం నుంచి బయలుదేరారు. సూర్యాపేట పట్టణం రాజీవ్‌పార్క్ సమీపంలో జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. దీనిని గమనించిన బొలోరో వాహనంలోని స్మగ్లర్లు.. వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్తుండడంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వాహనంలోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా విశాఖపట్నంలో గంజాయిని కొనుగోలు చేసుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలిస్తున్నట్టు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు. అయితే విశాఖపట్నం నుంచి నిజామాబాద్‌కు గంజాయిని తీసుకురావాలని ఎవరు డబ్బులు ఇచ్చారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్మగ్లింగ్‌లో రాజు, వెంకట్రావు, మునావర్ అనే వ్యక్తుల హస్తమూ ఉన్నట్లు తేలిందని సమాచారం. వారు ప్రస్తుతం నిజామాబాద్, విశాఖపట్నంలో ఉన్నారన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు సింహాచలం, రవి, ఫరూఖ్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు పేర్కొన్నారు. 123 ప్యాకెట్లలో 246 కేజీల గంజాయి ఉందని, వీటి విలువ సుమారు రూ. 10 లక్షలని తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు జబ్బార్, బాసిత్, సిబ్బంది బాల్నె కుశలవ్, చామకూరి శ్రీనివాస్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సైదులు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మావోయిస్టులకు గంజాయి స్మగ్లర్ల ఆయుధాలు?
♦ సరఫరాలో తమిళనాడు వ్యాపారులు కీలకం ♦ ఆ దిశగా ఆరా తీస్తున్న పోలీసులు మావోయిస్టులకు గంజాయి స్మగ్లర్ల నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నాయన్న దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల దళసభ్యులకు తుపాకులు సరఫరా చేస్తూ ఇద్దరు గిరిజనులు దొరకిపోవడంతో అప్రమత్తమయ్యారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో గంజాయి క్షేత్రాలు విస్తరించడం మావోయిస్టులకు ఆయుధాలు సరఫరాకు అనుకూలంగా మారింది. ఇక్కడకు వచ్చే తమిళనాడు వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లో ఆయుధాలు కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్టుగా తెలుస్తోంది. కొయ్యూరు : హిట్‌లిస్టులో ఉన్నవారిని మట్టుబెట్టేందుకు కొన్ని సందర్బాలలో మావోయిస్టులు యాక్షన్ టీంలను రంగంలోకి దించుతారు. లక్ష్యాన్ని సాధించాలంటే దగ్గర నుంచి కాల్చాల్సి ఉంటుంది. అలాంటి వారికి 9ఎంఎం పిస్టల్ వంటి చిన్న ఆయుధాలు అవసరం అవుతాయి. ఇటీవల దళసభ్యులకు తుపాకులు సరఫరా చేస్తూ చిక్కిన ఇద్దరు గిరిజనుల నుంచి పిస్టల్‌ను,దాని క్యాట్రిజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఒకప్పుడు మందుపాతరలే మావోయిస్టులకు బలమైన ఆయుధాలుగా ఉండేవి. ఇప్పుడు వాటిని పోలీసులు నిలువరించడంతో చిన్న చిన్న ఆయుధాల సేకరణపై దృష్టిపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. మన్యంలోని జీకేవీధి, చింతపల్లి, జి. మాడుగుల,పెదబయలు, ఓడిశా మల్కన్‌గిరి, ఆర్. ఉదయగిరి ప్రాంతాల్లో గంజాయి వనాలు అధికంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తమిళనాడు వ్యాపారులు మకాం వేసి పెట్టుబడి పెట్టి దగ్గరుండి గంజాయి పడిస్తున్నారు. తరువాత ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆ ప్రాంతాల నుంచే వ్యాపారులు నాటు తుపాకులను తెచ్చి మావోయిస్టులకు అందజేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏవోబీలో ఆయుధాల తయారీదారులు లేరు. మావోయిస్టుల డిమాండ్ మేరకు గంజాయి స్మగ్లర్లే ఆయుధాలు తెచ్చి అందజేస్తున్నట్టు భావిస్తున్నారు. గంజాయి స్మగ్లర్లుగా భావిస్తున్నవారిపై నిఘా పెంచారు. ఆయుధాల సరఫరాకు సంబంధించి లోతుగా విచారణ చేస్తున్నారు. కొన్ని నెలల కిందట లేటరైట్ (ఎర్రమట్టి)ని తరలించే వారితో మావోయిస్టులు పేలుడు పదార్థాలు తెప్పించుకున్న వైనంతో సంబంధమున్న ఏయూ అసోసియేట్ ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత పోలీసులు క్వారీలపై దృష్టిపెట్టారు. -
గంజాయి గుబులు
- మారణాయుధాలతో రవాణా - రెండు పిస్తోళ్లు, 28 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న రావికమతం పోలీసులు - ఉలిక్కిపడిన పోలీసు, ఎక్సైజ్ శాఖలు చోడవరం: గమ్మత్తుగా తరలించే గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్నారు. మారణాయుధాలతో రవాణా చేస్తున్నారు. అంటే వీరు ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అంటేనే గంజాయి సాగు, రవాణాకు పెట్టింది పేరు. ఇక్కడ అతి విలువైన శీలావతిరకం పండిస్తున్నారు. దీనికి బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో మంచి గిరాకీ. ఒకప్పుడు కిలో రూ. వెయ్యి నుంచి రూ. 2వేలు ఉండేది. ఇప్పుడు రూ. 8 నుంచి రూ.10వేలు పలుకుతోంది. ఇప్పటి వరకు సాదా, సీదాగా గుట్టుచప్పుడు కాకుండా తరలించే స్మగ్లర్లు ఇప్పుడు ఏకంగా మారణాయుధాలతో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. రోలుగుంట మండల శివారు ఏజెన్సీ గ్రామాల్లో శనివారం రాత్రి కొత్తకోట పోలీసులకు పట్టుబడిన గంజాయి ముఠావద్ద మారణాయుధాలు ఉండడం ఇందుకు తార్కాణం. రూ.42లక్షలు విలువైన 420 కిలోల గంజాయి, రెండు పిస్తోళ్లు, 28 బుల్లెట్లు దొరకడం ఇటు పోలీసు, అటు ఎక్సైజ్ వర్గాల్లో తీవ్ర సంచలనమైంది. కొన్నేళ్లుగా గంజాయి రవాణాకు జిల్లా అడ్డాగా మారింది. రోజూ రూ.లక్షల విలువైన సరకు రోడ్డు, రైలు మార్గాల్లో తరలిపోతోంది. రావికమతం, రోలుగుంట, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, దేవరాపల్లి,చీడికాడతోపాటు మరి కొన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రూ. కోట్లు విలువైన గంజాయి పట్టుబడింది. రోలుగుంట, మాడుగుల, రావికమతం, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం, దేవరాపల్లి, కె.కోటపాడు,చీడికాడ, నాతవరం మండలాల్లోని కొన్ని గ్రామాలు కేవలం గంజాయి అమ్మకాలకు చిరునామాగా మారాయి. పోలీసు, ఎక్సైజ్ అధికారుల రికార్డులే దీనిని ధ్రువీకరిస్తున్నాయి. మన్యంలోని చింతపల్లి, పాడేరు ప్రాంతాలకు ప్రధాన రహదారులుగా ఉన్న వయా రోలుగుంట, మాడుగుల వయా చోడవరం, నర్సీపట్నం వయా తాళ్లపాలెం దారుల్లో దీని రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది. వీటితోపాటు కోటవురట్ల వయా అడ్డురోడ్డు, కొత్తవలస మీదుగా విశాఖపట్నం రూట్లలోనూ తరలిస్తున్నారు. ఏడా రూ. వంద కోట్లకు పైబడి విలువైన గంజాయిని ఎక్సైజ్, పోలీసు అధికారులు పట్టుకుంటున్నారు. అంటే ఈ వ్యాపారం రూ.వేల కోట్లలో సాగుతున్నదని అవగతమవుతోంది. కొన్ని స్టేషన్లలో ఖైదీలు ఉండాల్సిన కటకటాలు గంజాయి బస్తాలతో నిండిపోయి ఉన్నాయి. ఇప్పటి వరకు మరణాయుధాలతో గంజాయి స్మగ్లర్లు పట్టుబడిన దాఖలాలు లేవు. ఇప్పుడు పిస్తోళ్లు పట్టుకుని మరీ రవాణా చేయడం అందరినీ కలవర పెడుతోంది. గంజాయి అంటే టేకిట్ఈజీగా తీసుకునే ఎక్సైజ్,పోలీసు అధికారులు ఇప్పుడు ఈ సంఘటనతో ఎలా స్పదిస్తారో వేచిచూడాలి. -
పెదబయలులో నకిలీ రూ.వెయ్యి నోట్లు
కిరాణా వ్యాపారికి టోకరా చలామణి వెనక గంజాయి స్మగ్లర్లు నష్టపోతున్న గిరిజనులు పెదబయలు, న్యూస్‌లైన్: మన్యంలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి ఎక్కువగా సాగుతోంది. మన్యంలో ప్రస్తుతం గంజాయి, గిరిజనులు పండించి పంటల అమ్మకాల సీజన్ కావడంతో స్మగ్లర్లు నకిలీ నోట్లను గుట్టుగా చలామణి చేస్తున్నారు. గతంలో మన్యంలో రూ.100, రూ.500 నకిలీ నోట్లు ఉండేవి. ప్రస్తుతం రూ.వెయ్యి విలువైన నోట్లు కూడా చలామణిలో ఉన్నాయి. పెదబయలు మండల కేంద్రం లోని ఓ కిరాణా వ్యాపారికి ఆదివారం రెండు రూ.వెయ్యి నోట్లు వచ్చాయి. అవి అసలైన నోట్లని భావించిన ఓ గిరిజన రైతు తీసుకొచ్చాడు. చివరకు అవి నకిలీవనితెలిసి బాధపడ్డాడు. గత వారం పెదబయలు వారపు సంతల్లో పిప్పళ్లను విక్రయించినప్పుడు ఈ నోట్లు ఇచ్చారని న్యూస్‌లైన్ ముందు వాపోయాడు. వారపు సంతలు, కుగ్రామాల్లో గంజాయి విక్రయించే రైతులకు కూడా స్మగర్లు నకిలీ నోట్లను ముట్టజెబుతున్నారు. వారపు సంతల్లో పసుపు, పిప్పళ్లు విక్రయించే రైతులకు వస్తున్న డబ్బులో కూడా ఇవి ఉంటున్నాయి. పోలీసులు స్పందించి నకిలీ నోట్ల ముఠాను పట్టుకుని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.