
తిరువళ్లూరు: కేరళ నుంచి రైలులో అక్రమంగా గంజాయిని తరలించి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఐనవరంలో అక్రమంగా గంజాయిని నిల్వ వుంచి విక్రయిస్తున్నట్టు కమిషనర్ సందీప్‌రాయ్ రాథోడ్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు అంబత్తూరు ఇన్‌స్పెక్టర ధనమ్మాల్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఇంట్లో అక్రమంగా నిల్వ వుంచి గంజాయి విక్రయిస్తున్న అంబత్తూరుకు చెందిన ఉదయకుమార్ భార్య కళావతి(63), శంకర్ భార్య రాణి(59) చైన్నె కొళత్తూరుకు చెందిన కుమార్ కుమారుడు ఆకాష్(23)ను అరెస్టు చేశారు. వారి నుంచి 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పూందమల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Comments
Please login to add a commentAdd a comment