కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఆరుగురు నిందితులు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి బొడ్డపొడ పంచాయతీ పీపార్ పొదర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఏడు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని జొగ్గ బంధు ఖొర అనే గిరిజనుడి ఇంట్లో పట్టుకున్నారు.
వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి గంజాయి మాఫి యా ముఠా వస్తామని చెప్పడంతో జొగ్గబంధు ఖొర తన ఇంటిలో సుమారు 22 బస్తాల గంజాయిని సిద్ధంచేశాడు. అయితే పెట్రోలింగ్ పోలీసులు తిరిగి వస్తున్న సమయంలో గంజాయి బయటపడింది.
గంజాయిని స్వాధీనం చేసుకుని జొగ్గబంధు ఖొరను అరెస్ట్ చేశారు. నిందితులు గంజాయిని ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్, బీహార్, భువనేశ్వర్, వెస్ట్‌బెంగాల్ తదితర రాష్ట్రాలకు తరలిస్తారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు అమ్ముతారు.
ఇదే మాదిరిగా కారులో 52 కిలోల గంజాయిని మధ్యప్రదేశ్ తరలిస్తుండగా మల్కన్‌గిరి–సుకుమ రహదారులో పోలీసులు పట్టుకున్నారు. కారులో గంజాయి తరలిస్తున్న 6గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ రెండు ఘటనల్లో పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు.
కారులో ఉన్న 6గురు నిందితులు అశోక్ ఖెముండు(23), శివనారాయణ సోలంకి(45), నరేంద్ర పొంగి(26), ప్రహ్లద్ ఖొర(30), నారాయణ గొంప హరి(27), నరసింగ్ ఖొర(25)లు. వీరంతా మల్కన్‌గిరి జిల్లా ఒర్కిల్ నుంచి గిరిజనుల వద్ద గంజాయి కొనుగోలు చేసి మధ్య ప్రదేశ్‌కు సరఫరా చేస్తున్నారు.
కటాఫ్ ఏరియా నుంచి గిరిజనులు కావిళ్లతో గంజాయిని తీసుకువస్తే, గంజాయి మాఫియా కారుల్లో, ఇతర వాహనాల్లో వచ్చి వారి దగ్గర అతి తక్కువ ధరకు కొని వారు మాత్రం ఎక్కువ ధరకు అమ్ముతారు. గిరిజనుల నుంచి కిలో గంజాయి రూ.400కు కొని మాఫియా మాత్రం రూ.3000కు అమ్మి సొమ్ము చేసుకుం టోంది.
మల్కన్‌గిరి జిల్లా చిత్ర కొండ కటాఫ్ ఏరి యాను మావోయిస్టులు అడ్డాగా మార్చుకున్నారు. మావోయిస్టుల సహాయంతో గిరిజనులు గంజా యి సాగు చేస్తున్నారు. ఎన్నిసార్లు పంటను ధ్వం సం చేసినా తిరిగి అదే పంటను పండిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment