caught by police
-
రాజీ చేసి లంచం డిమాండ్!
హైదరాబాద్: ఓ కేసులో బాధితుడికి–నిందితుడికి మధ్య రాజీ చేశాడు... అప్పటికే నమోదైన కేసుకు ముగింపు పలకడానికి నిందితుడి నుంచి లంచం డిమాండ్ చేశాడు... అంగీకరించిన మొత్తం వాయిదాల్లో చెల్లించే అవకాశమూ ఇచ్చాడు... ఐదో విడత చెల్లింపు ఆలస్యం కావడంతో వేధింపులు మొదలెట్టాడు... ఫిర్యాదుదారుడిగా మారిన నిందితుడు అవినీతి నిరోధక శాఖను (ఏసీబీ) ఆశ్రయించడంతో చిక్కాడు... నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పార్కింగ్‌లో రూ.3 లక్షలు లంచం తీసుకుని, ఏసీబీ అధికారులను చూసి పరుగులు పెట్టి మరీ చిక్కిన ఇన్స్పెక్టర్ చామకూరి సుధాకర్ వ్యవహారమిది. గురువారం అరెస్టు చేసిన ఇతడిని ఏసీబీ అధికారులు శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. నగరానికి చెందిన సత్యప్రసాద్ అనే వ్యక్తికి యాప్రాల్‌లో ఓ విల్లా ఉంది. దీన్ని రంగస్వామి ద్వారా అమెరికాలో ఉంటున్న ఎన్నారై హేమసుందర్‌రెడ్డికి రూ.1.5 కోట్లకు విక్రయించారు. దీని నిమిత్తం సదరు ఎన్నారైకి నగరంలోని ఓ బ్యాంక్‌లో లోన్ కూడా ఇప్పించారు. ఇలా వచి్చన మొత్తం నుంచి రూ.50 లక్షలతో అప్పటికే ఆ ఇంటిపై ఉన్న గృహరుణాన్ని క్లియర్ చేశాడు. మిగిలిన రూ.కోటి వెచి్చంచి స్థలం కొందామని, దాన్ని అభివృద్ధి చేసి లాభాలు పొందుదామంటూ రంగస్వామి ఇచ్చిన సలహా సత్య ప్రసాద్‌కు నచి్చంది. దీంతో అతడితో ఒప్పందం చేసుకున్న సత్య ప్రసాద్ ఆ మొత్తం అందించాడు. దీన్ని వెచి్చంచిన రంగస్వామి నాచారం ప్రాంతంలో 1600 స్థలం ఖరీదు చేశాడు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో దాన్ని అభివృద్ధి చేయడం, విక్రయించడం సాధ్యపడలేదు. దీంతో సత్య ప్రసాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి రంగస్వామి తనను రూ.కోటి మేర మోసం చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి నమోదైన కేసును సీసీఎస్‌లోని ఎకనమికల్ ఆఫెన్సెస్ వింగ్ టీమ్–7 ఇన్స్పెక్టర్గా ఉన్న సీహెచ్ సుధాకర్ దర్యాప్తు చేశారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై అరెస్టు చేయడమో, నోటీసులు ఇవ్వడమో చేయాలి. దీనికి భిన్నంగా వ్యవహరించిన సుధాకర్ ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్య ప్రసాద్, రంగస్వామి మధ్య రాజీ చేశాడు. రూ.కోటి వాయిదాల పద్దతిలో చెల్లించే ఒప్పందం చేసి ఈ మేరకు ఎంఓయూ కూడా రాయించాడు. చట్ట ప్రకారం ఇలా రాజీపడిన కేసుల్లో ఇరు పక్షాలకు కోర్టులో హాజరుపరిచి, లోక్ అదాలత్ ద్వారా క్లోజ్ చేయాలి. అయితే ఈ కేసులో కాసులు ఏరుకోవాలని భావించిన సుధాకర్ కేసు క్లోజ్ చేయడానికి రూ.15 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఈ మొత్తం నిందితుడిగా ఉన్న రంగస్వామి చెల్లించేలా ఆదేశించాడు. ఒకేసారి అంత మొత్తం ఇచ్చుకోలేనంటూ రంగస్వామి వేడుకోగా... వాయిదాలో చెల్లించే అవకాశమూ ఇచ్చాడు. ఇప్పటికే రూ.50 వేలు, రూ.50 వేలు, రూ.2 లక్షలు, రూ.2 లక్షలు చొప్పున నాలుగు వాయిదాల్లో రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆఖరి వాయిదా ముట్టి 20 రోజులు గడిచిన తర్వాత మరో రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. దీంతో రంగస్వామి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకు సుధాకర్‌తో బేరసారాలు మొదలెట్టారు. ప్రస్తుతానికి తాను రూ.5 లక్షలు ఇచ్చుకోలేనని, తన వద్ద కేవలం రూ.2.5 లక్షలే ఉన్నాయంటూ చెప్పిన రంగస్వామి ఆ మొత్తం తీసుకుని రెండు రోజుల క్రితం సీసీఎస్ వద్దకు వెళ్లారు. అయితే తాను కూడా పై అధికారులకు ఇవ్వాల్సి వస్తుందంటూ పేర్కొన్న సుధాకర్ ఆ మొత్తం తీసుకోవడానికి నిరాకరించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు రూ.5 లక్షలు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టాడు. దీంతో ఆ రోజు ఏసీబీ ట్రాప్‌లో పడకుండా తప్పించుకున్నాడు. ఆపై మరోసారి బేరసారాల తర్వాత గురువారం రూ.3 లక్షలు తీసుకోవడానికి అంగీకరించి, తీసుకుని ఏసీబీ అధికారులకు చిక్కి జైలుకు వెళ్లాడు. గురువారం రాత్రి ఏసీబీ అధికారులు సుధాకర్‌ను పర్యవేక్షించే అధికారుల వాంగ్మూలాలు నమోదు చేశారు. -
మునుగోడులో పట్టుబడుతున్న నోట్ల కట్టలు...
-
నకిలీ ఐఆర్ఎస్ అధికారి అరెస్టు
ముమ్మిడివరం: ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) ఉన్నతాధికారినంటూ పలు మోసాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి నిందితుడిని గురువారం విలేకర్ల ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. యానాం అంబేడ్కర్ నగర్‌కు చెందిన కాశి ప్రేమ్‌కుమార్ గత ఏడాది ఉగాది సమయంలో ఇక్కడ జరిగిన ఒక కవి సమ్మేళనానికి వచ్చాడు. ముమ్మిడివరం పోస్ట్‌మాస్టర్ మద్దెల వెంకటేశ్వరరావుకు ఐఆర్ఎస్ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. సౌతిండియన్ కమిషనర్‌నని, సర్వే కమిషనర్‌నని నమ్మించాడు. పోస్టల్ రీజియన్ అధికారిగా ప్రమోషన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతడిని నమ్మిన వెంకటేశ్వరరావు డిసెంబర్లో ఒకసారి రూ.లక్ష, మరోసారి రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షలు ఇచ్చాడు. రోజులు గడుస్తున్నా ప్రమోషన్ రాకపోవడంతో వెంకటేశ్వరరావుకు అనుమానం వచ్చింది. తీసుకున్న రూ.4 లక్షలు తిరిగి ఇవ్వాలని ప్రేమ్‌కుమార్‌కు చెప్పాడు. ఫలితం లేకపోవడంతో జరిగిన మోసంపై ఈ నెల 2న ముమ్మిడివరం పోలీసులకు వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై కె.సురేష్‌బాబు లోతుగా విచారణ జరిపారు. నిందితుడు ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసి, అతడి నుంచి రూ.40 వేల విలువైన బంగారు గొలుసు, ఉంగరం, నకిలీ డాక్యుమెంట్లు, రబ్బరు స్టాంపులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ్‌కుమార్ డిప్లమో మధ్యలో ఆపేసి, లైబ్రరీలో పుస్తకాలు చదివి ప్రభుత్వ ఉన్నతాధికారుల విధి నిర్వహణ విధానాలు తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐఆర్ఎస్ అధికారిగా నకిలీ డాక్యుమెంట్లు, రబ్బర్ స్టాంపులు, గుర్తింపు కార్డు తయారు చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. కవితలు రాసే అలవాటు ఉండటంతో పద్మశ్రీ అవార్డు అందుకున్నట్టు పలు సాహితీ సంస్థల నుంచి నకిలీ ప్రశంసా పత్రాలు సృష్టించుకున్నాడు. కారులో తిరుగుతూ ఉన్నతాధికారిగా చలామణీ అవుతూ దేవాలయాల వద్ద ప్రొటోకాల్ అంటూ నమ్మబలికి మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడిని ముమ్మిడివరం కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్సై కె.సురేష్‌బాబును, సిబ్బందిని ఆయన అభినందించారు. -
పోలీసుల అదుపులో కౌన్సిలర్ హత్య కేసు నిందితుడు
సాక్షి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిల్ సభ్యుడు తాళ్లూరు వెంకట సురేష్‌ను దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న క్లూతో పోలీసులు గంటల వ్యవధిలోనే కౌన్సిలర్ హత్య కేసులో పురోగతి సాధించారు. ఈ హత్యలో నలుగురు కిరాయి హంతకులు పాల్గొన్నట్లు సమాచారం తెలియడంతో వారి కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు. కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ విజయారావు ఆదేశాల అనుసరించి ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. -
హత్నూర్‌లో దొరికిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని కటక్ జైలు నుంచి తప్పించుకుని, హైదరాబాద్ వచ్చిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ షేక్ హైదర్ ఎట్టకేలకు చిక్కాడు. ఆదివారం రాత్రి నుంచి ఇతడి కోసం ముమ్మరంగా గాలించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. గురువారం రాత్రి జహీరాబాద్ రూరల్ పరిధిలోని హత్నూర్‌లో కనిపెట్టారు. అక్కడ ఓ ప్రార్థనా స్థలంలో తలదాచుకుని ఉండగా పట్టుకున్నారు. ఒడిశా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం హైదర్‌ను తీసుకువెళ్లనుంది. భువనేశ్వర్‌కు చెందిన మైన్స్ యజమాని రష్మీ రాజన్ మొఘాప్తారా కిడ్నాప్, హత్య కేసులో హైదర్‌కు భువనేశ్వర్ కోర్టు 2015లో జీవిత ఖైదు విధించింది. అంతకుముందు 2011లో మరో గ్యాంగ్‌స్టర్ షేక్ సులేమాన్ సోదరుడు షేక్ చాను హత్య కేసులోనూ ఇతడికి జీవిత ఖైదు పడింది. 2017 వరకు భువనేశ్వర్‌లోని ఝార్పాడ జైల్లో ఉన్న హైదర్‌ను.. భద్రతా కారణాల నేపథ్యంలో సబల్‌పూర్ జైలుకు మార్చారు. ఇటీవల కిడ్నీ సమస్య వచ్చినట్లు అక్కడి జైలు అధికారులకు చెప్పాడు. దీంతో నాలుగు రోజుల కింద కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుప్రతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 4.30 గంటలకు తప్పించుకున్నాడు. పోలీసులు అప్రమత్తమయ్యేలోపే కారులో పారిపోయారు. విశాఖపట్నం, విజయవాడ మీదుగా ప్రయాణించాడు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సేకరించిన ఆధారాలను బట్టి సదరు హైదర్ ప్రయాణిస్తున్న స్విఫ్ట్ వాహనం ఆదివారం రాత్రి పంతంగి టోల్ ప్లాజా దాటింది. చివరకు హత్నూర్‌లో కదలికలు గుర్తించారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీం అక్కడికి వెళ్లి పట్టుకుంది. ( చదవండి: పసికందులతో సహా ఒకే కుటుంబంలో ఆరుగురిని నరికేసిన మానవ మృగం ) -
దొరికిపోతానని రూ.5 లక్షలు కాల్చేశాడు!
కల్వకుర్తి టౌన్/కల్వకుర్తి/వెల్దండ/మన్సూరాబాద్: అవినీతి వ్యవహారంలో లంచంగా డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రావడంతో ఆ నోట్ల కట్టలను గ్యాస్‌స్టవ్‌పై పెట్టి తగలబెట్టేశాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన మంగళవారం కల్వకుర్తిలోని విద్యానగర్‌లో జరిగింది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరంతకుంట తండా సర్పంచ్ రమావత్ రాములునాయక్ వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామ శివారులో ఉన్న 15 హెక్టార్ల భూమిలో క్రషర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి జనవరి 12న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఫిబ్రవరి 16న భూమి సర్వేకు హాజరు కావాలని రాములునాయక్‌కు వెల్దండ తహసీల్దార్ కార్యాలయం నుంచి నోటీసులు పంపించారు. సర్వే కోసం రూ.6 లక్షలు ఇవ్వాలని తహసీల్దార్ సైదులు డిమాండ్ చేశారు. దాదాపు నెల పాటు చర్చలు జరిగిన తర్వాత రూ.5లక్షలు ఇచ్చేందుకు రాములునాయక్ ఒప్పుకున్నారు. ఈ డబ్బులను మధ్యవర్తి, వెల్దండ మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్యగౌడ్‌కు ఇవ్వాలని తహసీల్దార్ సూచించారు. దీంతో రాములు నాయక్ ఈనెల ఒకటో తేదీన మహబూబ్‌నగర్‌లోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం సాయంత్రం డబ్బులు ఇచ్చేందుకు కల్వకుర్తిలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకటయ్యగౌడ్ ఇంటికి వెళ్లారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఇంటికి ఎవరో వచ్చారని పోలీసులకు ఫోన్.. ఏసీబీ అధికారులు వచ్చినా వెంకటయ్యగౌడ్ తలుపు తీయకుండా.. తన ఇంటికి ఎవరో వచ్చారని స్థానిక పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు.. వారు ఏసీబీ అధికారులు అని తెలుసుకుని వెనుదిరిగారు. అదే సమయంలో తాను దొరికిపోతాననే భయంతో వెంకటయ్యగౌడ్ వంటగదిలోకి వెళ్లి గ్యాస్‌స్టవ్‌పై డబ్బులు పెట్టి నిప్పంటించారు. వెంటనే మరో తలుపు నుంచి వయటకు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన ఏసీబీ అధికారులు తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లి అతడిని పట్టుకున్నారు. కాలుతున్న నోట్లపై నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. అయితే, అప్పటికే నోట్లన్నీ దాదాపు 70శాతం మేరకు కాలిపోయాయి. తగలబడిన నోట్లు అనంతరం వెంకటయ్యగౌడ్‌ను విచారించి, అతడిని తీసుకుని వెల్దండ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఏసీబీ అధికారులు వెంకటయ్యగౌడ్‌ను కార్యాలయంలోకి తీసుకెళుతుండగా.. పలువురు బాధితులు ఆయనపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఏసీబీ అధికారులు తహసీల్దార్ సైదులును అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులను బుధవారం హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపారు. నిందితుల ఇద్దరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కాగా, తహసీల్దార్ వేధింపులకు విసిగిపోయిన కొందరు బాధితులు ఈ సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. -
రొయ్యల మేత లారీ అపహరణ
నెల్లూరు (క్రైమ్): రొయ్యల మేతలోడ్‌తో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటనపై బాధిత లారీ యజమాని డయల్ 100కు ఫోన్ చేయడంతో బాలాజీనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంటల వ్యవధిలోనే లారీని స్వాదీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సేకరించిన సమాచారం మేరకు.. ఎన్టీఆర్ నగర్ నాల్గో బిట్లో ఎ.మల్లికార్జున్‌రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయనకు ఐదు లారీలు ఉన్నాయి. వాటిని అద్దెకు తిప్పుతున్నారు. అతని వద్ద సరస్వతీనగర్‌కు చెందిన జి.వెంకటేశ్వర్లు (అల్లుడు) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న వెంకటేశ్వర్లు బియ్యం లోడ్‌ను తీసుకుని చెన్నైకు వెళ్లాడు. అక్కడ 13వ తేదీన నెల్లూరు రామ్మూర్తినగర్లోని నర్మదా ఎంటర్‌ప్రైజస్‌కు చెందిన రొయ్యల మేతను లారీలో లోడ్ చేయించుకుని నెల్లూరుకు బయలుదేరాడు. రాత్రి 9.30 గంటలకు నెల్లూరుకు చేరుకున్నాడు. ఆ సమయలో కూలీలు లేకపోవడంతో లారీని ఎన్టీఆర్నగర్లోని ఎస్వీజీఎస్ కళాశాల వద్ద పార్క్ చేసి లారీలోనే పడుకుని ఉదయం కూలీలు వచ్చిన అనంతరం అన్లోడ్ చేయించాలని అతని మామ మల్లికార్జునరెడ్డి సూచించాడు. అయితే వెంకటేశ్వర్లు లారీలో కొద్ది సేపు పడుకుని, లారీ తాళాలను క్యాబిన్లో పెట్టి డోర్‌కు తాళం వేసుకుని ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం కళాశాల వద్దకు వచ్చి చూడగా లారీ కనిపించలేదు. దీంతో వెంకటేశ్వర్లు తన మామకు చెప్పాడు. డయల్ 100కు ఫిర్యాదు.. గంటల వ్యవధిలో లారీ పట్టివేత లారీ చోరీ ఘటనపై బాధితుడు మల్లికార్జునరెడ్డి శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఘటనా స్థలం నుంచే డయల్ 100కు ఫిర్యాదు చేశారు. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య జిల్లా వ్యాప్తంగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందం కావలి వైపు టోల్‌ప్లాజా, మరో బృందం గూడూరు బూదనం టోల్‌ప్లాజాలను పరిశీలించారు. చోరీకి గురైన లారీ బూదనం టోల్ ప్లాజాను క్రాస్ చేసి వెళ్లినట్లు సోమయ్య గుర్తించి లారీ ఆచూకీని కనుగొన్నారు. పోలీసు వాహనం లారీని సమీపిస్తున్న విషయాన్ని గమనించిన దుండగుడు లారీని ఆపి దూకి పరుగులు తీశాడు. పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. లారీని స్వాదీనం చేసుకుని, నిందితుడితో పాటు బాలాజీనగర్ స్టేషన్‌కు తరలించారు. నగర ఇన్చార్జి డీఎస్పీ పి. శ్రీధర్ బాలాజీనగర్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని లోతుగా విచారిస్తున్నారు. రొయ్యల ఫీడ్ విలువ రూ.43 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన రెండు గంటల వ్యవధిలోనే లారీని, అందులోని రొయ్యల ఫీడ్‌ను స్వాదీనం చేసుకున్న బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య, ఎస్సైలు పవన్‌కుమార్, వీరప్రతాప్ తదితరులను ఎస్పీ భాస్కర్‌భూషణ్ అభినందించినట్లు సమాచారం. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
-
‘చదువు గోల నా వల్ల కాదు’
రాజేంద్రనగర్ : కాలేజీలో బోధించే చదువు ఒంటపట్టడం లేదని, తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో చదవులో రాణించలేకపోతున్నా.. నా వల్ల కాదు నేను వెళ్లిపోతున్నానని ఓ విద్యార్థి కళాశాల డీన్‌కు రాసిన లేఖ నార్సింగి పోలీసులను హడలెత్తించింది. ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు చివరికి ఆ విద్యార్థిని క్షేమంగా తీసుకువచ్చారు. నార్సింగి సీఐ రమణాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... షాద్‌నగర్‌కు చెందిన ఎస్.చాణిక్యవర్షిత్రెడ్డి (17) నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్లో ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్లాడు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయి బాగా చదవాలని తల్లిదండ్రులు సూచించారు. ఇంటి నుంచి తిరిగి కళాశాలకు రాగా అధ్యాపకులు సైతం శ్రద్ధగా చదవాలంటూ తెలపడంతో ఒత్తిడికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో డీన్‌కు ఓ లెటర్ రాసి హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో చదవ లేకపోతున్నా.. ఒత్తిడికి గురవుతున్నానని, కాలేజీలో బోధించిన చదువు ఒంటబట్టడం లేదంటూ హాస్టల్ డీన్ తల్లిలా చూసుకుంటుందంటూ లెటర్ రాశాడు. ఉదయం వర్షిత్‌రెడ్డి కనిపించకపోవడాన్ని గమనించిన డీన్, అధ్యాపకులు రూమ్‌లో పరిశీలించగా లెటర్ లభ్యమైంది. వెంటనే తల్లిదండ్రులతో పాటు నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. హాస్టల్‌కు చేరుకున్న తల్లిదండ్రులు తెలిసిన వారితో పాటు బంధువుల ఇళ్లలో వాకబు చేయగా ఫలితం లభించలేదు. చివరకు పోలీసులు శుక్రవారం సాయంత్రం సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా వర్షిత్‌రెడ్డి ఆచూకీ తెలుసుకొని స్టేషన్‌కు తీసుకువచ్చారు. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో వర్షిత్‌రెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. -
కోటి రూపాయల విలువజేసే గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి బొడ్డపొడ పంచాయతీ పీపార్ పొదర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఏడు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని జొగ్గ బంధు ఖొర అనే గిరిజనుడి ఇంట్లో పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి గంజాయి మాఫి యా ముఠా వస్తామని చెప్పడంతో జొగ్గబంధు ఖొర తన ఇంటిలో సుమారు 22 బస్తాల గంజాయిని సిద్ధంచేశాడు. అయితే పెట్రోలింగ్ పోలీసులు తిరిగి వస్తున్న సమయంలో గంజాయి బయటపడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని జొగ్గబంధు ఖొరను అరెస్ట్ చేశారు. నిందితులు గంజాయిని ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్, బీహార్, భువనేశ్వర్, వెస్ట్‌బెంగాల్ తదితర రాష్ట్రాలకు తరలిస్తారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు అమ్ముతారు. ఇదే మాదిరిగా కారులో 52 కిలోల గంజాయిని మధ్యప్రదేశ్ తరలిస్తుండగా మల్కన్‌గిరి–సుకుమ రహదారులో పోలీసులు పట్టుకున్నారు. కారులో గంజాయి తరలిస్తున్న 6గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ రెండు ఘటనల్లో పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న 6గురు నిందితులు అశోక్ ఖెముండు(23), శివనారాయణ సోలంకి(45), నరేంద్ర పొంగి(26), ప్రహ్లద్ ఖొర(30), నారాయణ గొంప హరి(27), నరసింగ్ ఖొర(25)లు. వీరంతా మల్కన్‌గిరి జిల్లా ఒర్కిల్ నుంచి గిరిజనుల వద్ద గంజాయి కొనుగోలు చేసి మధ్య ప్రదేశ్‌కు సరఫరా చేస్తున్నారు. కటాఫ్ ఏరియా నుంచి గిరిజనులు కావిళ్లతో గంజాయిని తీసుకువస్తే, గంజాయి మాఫియా కారుల్లో, ఇతర వాహనాల్లో వచ్చి వారి దగ్గర అతి తక్కువ ధరకు కొని వారు మాత్రం ఎక్కువ ధరకు అమ్ముతారు. గిరిజనుల నుంచి కిలో గంజాయి రూ.400కు కొని మాఫియా మాత్రం రూ.3000కు అమ్మి సొమ్ము చేసుకుం టోంది. మల్కన్‌గిరి జిల్లా చిత్ర కొండ కటాఫ్ ఏరి యాను మావోయిస్టులు అడ్డాగా మార్చుకున్నారు. మావోయిస్టుల సహాయంతో గిరిజనులు గంజా యి సాగు చేస్తున్నారు. ఎన్నిసార్లు పంటను ధ్వం సం చేసినా తిరిగి అదే పంటను పండిస్తున్నారు. -
రూ.1.5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల పట్టివేత
జైపూర్: దేశీయ మార్కెట్లో సుమారు రూ.1.5 కోట్ల విలువ చేసే ఓపియం అనే మాదక ద్రవ్యాన్ని రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన మాదక ద్రవ్యాలు 71 కేజీల బరువు ఉందని పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నిందితుడు సునీల్ నగ్ధా మధ్యప్రదేశ్ రాష్ట్రం నీముచ్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. మాదక ద్రవ్యాలతో కారులో నీముచ్ నుంచి జోధ్‌పూర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెలూన్ పేరుతో వ్యభిచారం
హైదరాబాద్ : శ్రీనగర్ కాలనీలో వ్యభిచార స్థావరంపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మికదాడులు నిర్వహించారు. వి2 సెలూన్ పేరుతో నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అమ్మాయిలను, నిర్వాహకుడు వెంకట్ రావు, కస్టమర్ లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతులను కౌన్సెలింగ్ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సీఐ గట్టుమల్లు తెలిపారు. -
అదను చూసి దోచేస్తాడు
తణుకు: తాళం వేసిన ఇళ్లే అతని లక్ష్యం.. గట్టుచప్పుడు కాకుండా రెక్కీ నిర్వహించి.. అదను చూసి ఉన్నదంతా దోచేస్తాడు.. ఇలా ఏడాది వ్యవధిలో ఎనిమిది చోరీలకు పాల్పడిన యువకుడు ఎట్టకేలకు తణుకు పోలీసులకు చిక్కాడు. నిడదవోలు పట్టణానికి చెందిన షేక్ అలీమొహిద్దీ న్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.8.86 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పట్టణ పోలీసు స్టేష న్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ చింతా రాంబాబు వివరాలు వెల్లడించారు. వ్యసనాలకు బానిసైన అలీ మొహిద్దీ న్నిడదవోలు నుంచి మకాం మార్చి ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో నివాసం ఉంటున్నాడు. తణుకు పరిసర ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నాడు. తణుకు పట్టణంతోపాటు తణుకు మండలం వేల్పూరు గ్రామంలో జరిగిన వరుస చోరీల్లో సుమారు 39 కాసుల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి వస్తువులతోపాటు రూ.40 వేల నగదు అపహరించుకుపోయాడు. నిందితుడి కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులు తణుకు శర్మిష్ట సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అలీమొహిద్దీ న్ను అదుపులోకి తీసుకుని విచారించారు. పాత చోరీల్లో తన ప్రమేయం గురించి ఒప్పుకోవడంతో నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి బంగారం, వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కేసులను ఛేదించడంలో పట్టణ, రూరల్ ఎస్సైలు జి.శ్రీనివాసరావు, బి.జగదీశ్వరరావు, క్రైం ఎస్సై విఠల్, హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీధర్, సంగీతరావు, సాయిబాబా, కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, శరత్, గణేష్, శివ, వాసు ప్రత్యేక దృష్టి సారించారని సీఐ రాంబాబు తెలిపారు. -
రూ.1.50 లక్షల విలువైన కలప పట్టివేత
ములుగు : అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.50 లక్షల విలువైన టేకు కలపను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మల్లేశ్‌యాదవ్ ఉదయం డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జంగాలపల్లి వైపు నుంచి వస్తున్న బొలోరో వాహనం ఆనుమానాస్పదంగా కనిపించింది. వాహనాన్ని ఆపి పరిశీలించగా అందులో 19 టేకు దుంగలు ఉన్నాయి. దీంతో వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. అందులో ఉన్న నర్సంపేటకు చెందిన దారుగుల సూర్యనారాయణ, గాదె రాజేశ్, మండలంలోని మదనపల్లికి చెందిన జాటోతు ధరమ్సింగ్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎస్సై తెలిపారు. పెట్రోలింగ్‌లో కానిస్టేబుళ్లు సునిల్, శ్రీనివాస్, వాసు పాల్గొన్నారు. -
దొంగల ముఠా అరెస్ట్
దేవరపల్లి : జిల్లాలోని పలు ప్రాంతాల్లో దుకాణాల షట్టర్లు తొలగించి చోరీలకు పాల్పడడంతో పాటు మోటారు సైకిళ్లను అపహరిస్తున్న దొంగలను దేవరపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆ వివరాలిలా.. దేవరపల్లి మండలం గౌరీపట్నం, కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన కొంత మంది యువకులు ముఠాగా ఏర్పడి జిల్లలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రి సమయంలో దుకాణాల షట్టర్లను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి చోరీలకు పాల్పడంతో పాటు మోటారు సైకిళ్లను దొంగిలిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 22న దేవరపల్లి మండలం గౌరీపట్నం ఆంధ్రాబ్యాంకు ఆవరణలో గల జిరాక్సు సెంటర్, కిరాణా దుకాణం షట్టర్‌ను తెరిచి జిరాక్సు, లామినేషన్ మిషన్, తిను బండారాలను దొంగిలించారు. ట్రక్కు ఆటోను అడ్డుగా పెట్టి గ్యాస్‌కట్టర్‌తో దుకాణం షట్టర్‌ను తెరవడం వీరి ప్రత్యేకత. దేవరపల్లిలోని దుకాణ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవరపల్లి ఎసై ్స సీహెచ్ ఆంజనేయులు కేసునమోదు చేయగా కొవ్వూరు రూరల్ సీఐ ఎం.సుబ్బారావు దర్యాప్తు చేశారు. ఈ నెల 29న అందిన నిర్దిష్టమైన సమాచారం మేరకు దేవరపల్లిలో ఎసై ్స.ఆంజనేయులు, సిబ్బంది తనిఖీ చేస్తుండగా జిరాక్సు, లామినేషన్ మిషన్ ఉన్న ట్రక్కు ఆటోను గుర్తించి ఆరా తీశారు. గౌరీపట్నం ఆంధ్రాబ్యాంకు ఆవరణలో గల దుకాణంలో దొంగతనం చేసినట్టు ఆటోలోని వ్యక్తులు చాండ్ర వెంకటేశ్(వెంకన్న), మాదేటి పవన్(చిన్న), గాలుల శ్రీను, గన్నమని నవ సందీప్ తెలిపారు. అలాగే మోటారు సైకిళ్ల దొంగతనానికి పాల్పడుతున్న కనుమూరి రాము, మాదాసు సంతోష్, పట్నాని శంకర్, మల్లిపూడి మురళి, మేరుగుల సోమరాజును అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 9 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. దొంగిలించిన వాటిలో మూడు మోటారు సైకిళ్లను ఉండ్రాజవరం మండలం తాటిపర్రుకు చెందిన మాదిశెట్టి సురేష్ కొనుగోలు చేయగా అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. యర్రంపేటకు చెందిన వెంకన్న గతంలో పలు నేరాలకు పాల్పడినట్టు చెప్పారు. చోరీలకు ఇతనే ప్రణాళికను తయారు చేస్తున్నట్టు వివరించారు. సీఐ ఎం.సుబ్బారావు, ఎసై ్స ఆంజనేయులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు చేస్తానని చెప్పారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. జిల్లాలో వరుస చోరీలు : డీఎస్పీ జిల్లాలో వరుసగా చోరీలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు సూచించారు. విలువైన వస్తువులను ఇళ్లల్లో పెట్టుకోరాదని, బ్యాంకు లాకర్లతో పెట్టుకోవాలని కోరారు. ఇల్లు విడిచి బయటకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
పోలీసులకు చిక్కిన లేడి కిడ్నాపర్
-
అప్పు చెల్లించాలంటూ దాడులు
-
వడ్డీ కాసురులు -part 2
-
వడ్డీ కాసురులు-part 1
-
పేకాట అడ్డా గుటురట్టు
-
కడప జిల్లాలో ఎర్రచందనం పట్టివేత
-
76 లక్షలు పోలీసులు స్వాధీనం