ప్రతీకాత్మక చిత్రం
జైపూర్: దేశీయ మార్కెట్లో సుమారు రూ.1.5 కోట్ల విలువ చేసే ఓపియం అనే మాదక ద్రవ్యాన్ని రాజస్తాన్లోని చిత్తోర్గఢ్లో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన మాదక ద్రవ్యాలు 71 కేజీల బరువు ఉందని పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నిందితుడు సునీల్ నగ్ధా మధ్యప్రదేశ్ రాష్ట్రం నీముచ్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.
మాదక ద్రవ్యాలతో కారులో నీముచ్ నుంచి జోధ్పూర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment