సీఎం కోరిక మేరకే: శశికళ | Sasikala says Panneerselvam urged me to become cm | Sakshi
Sakshi News home page

సీఎం కోరిక మేరకే: శశికళ

Published Sun, Feb 5 2017 8:05 PM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

సీఎం కోరిక మేరకే: శశికళ

సీఎం కోరిక మేరకే: శశికళ

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం విన్నపం మేరకు ఆయన స్థానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నట్టు అన్నా డీఎంకేం ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ప్రకటించారు. జయలలిత మరణించిన తర్వాత పార్టీ పగ్గాలు స్వీకరించాలని తొలుత పన్నీరు సెల్వం తనను కోరారని, ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి కావాలని కోరిన తొలుత వ్యక్తి కూడా ఆయనేనని చెప్పారు.

ఆదివారం జరిగిన అన్నా డీఎంకే శాసనసభ పక్ష సమావేశంలో శశికళను నాయకురాలిగా ఎన్నుకోగా, ముఖ్యమంత్రి పదవికి సెల్వం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు. అమ్మ అడుగుజాడల్లో నడుస్తానని పేర్కొన్నారు. తమిళనాడు మూడో మహిళా ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement