పన్నీర్ సెల్వానికి కేరళ వైద్యం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురట్చి తలైవి శిబిరం నేత పన్నీరుసెల్వం ఆయుర్వేద చికిత్స నిమిత్తం కోయంబత్తూరు వెళ్లారు. గురువారం పన్నీరుసెల్వంకు ఆయుర్వేద వైద్యులు పరీక్షలు చేసి, చికిత్స మొదలెట్టారు. నాలుగు రోజులపాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోనున్నారు.
కాగా కోయంబత్తూరులోని ఆర్య ఆస్పత్రి కేరళ వైద్యానికి ప్రసిద్ధి చెందింది. అక్కడ మూలికలతో కూడిన వైద్యం అందిస్తుంటారు. అయితే, కేరళ ఆయుర్వేద వైద్యం చేసుకోవాలనే పన్నీరు ఆస్పత్రిలో చేరినట్టు, ఆయనకు ఎలాంటి సమస్య లేదని పురట్చి తలైవి శిబిరం వర్గాలు పేర్కొన్నాయి. నాలుగు రోజుల పాటు ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోనే ఉంటారని చెప్పారు.