kerala treatment
-
‘నాభార్య మిస్సైంది’
తిరువనంతపురం : ఐరిష్ నుంచి వైద్యం కోసం కేరళ వచ్చిన తన భార్య మిసైందని కోవలం పోలీస్ స్టేషన్లో ఆండ్రూ జోర్డాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గత నెల 21న ఆయుర్వేదిక్ వైద్యం కోసం కేరళలోని కోవలానికి తాను తన భార్యతో కలసి వచ్చానని పేర్కొన్నాడు. మార్చి 14న తన భార్య తిరువనంతపురంకి 40కి.మి దూరంలో ఉన్న బీచ్‌కి వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఆండ్రూ. తన భార్య లీగా(33) ఎవరికైనా, ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వగలరని చేతిలో తన భార్య ఫొటోను పట్టుకుని కోవలం మొత్తం వెతకటం మొదలుపెట్టాడు. తన భార్య చాలా తెలివైనదని, ఎక్కడైన తప్పిపోయినా తిరిగి వచ్చేయగలదన్నారు. తన భార్యను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే విదేశాంగ శాఖకు కూడా ఈ మేరకు సమాచారం అందించామని తెలిపాడు. తన భార్య ఆచూకి తెలిపిన వారికి లక్ష రివార్డు కూడా ఇస్తామని పేర్కొన్నాడు. -
పన్నీర్ సెల్వానికి కేరళ వైద్యం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురట్చి తలైవి శిబిరం నేత పన్నీరుసెల్వం ఆయుర్వేద చికిత్స నిమిత్తం కోయంబత్తూరు వెళ్లారు. గురువారం పన్నీరుసెల్వంకు ఆయుర్వేద వైద్యులు పరీక్షలు చేసి, చికిత్స మొదలెట్టారు. నాలుగు రోజులపాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోనున్నారు. కాగా కోయంబత్తూరులోని ఆర్య ఆస్పత్రి కేరళ వైద్యానికి ప్రసిద్ధి చెందింది. అక్కడ మూలికలతో కూడిన వైద్యం అందిస్తుంటారు. అయితే, కేరళ ఆయుర్వేద వైద్యం చేసుకోవాలనే పన్నీరు ఆస్పత్రిలో చేరినట్టు, ఆయనకు ఎలాంటి సమస్య లేదని పురట్చి తలైవి శిబిరం వర్గాలు పేర్కొన్నాయి. నాలుగు రోజుల పాటు ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోనే ఉంటారని చెప్పారు.