
తిరువనంతపురం : ఐరిష్ నుంచి వైద్యం కోసం కేరళ వచ్చిన తన భార్య మిసైందని కోవలం పోలీస్ స్టేషన్‌లో ఆండ్రూ జోర్డాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గత నెల 21న ఆయుర్వేదిక్ వైద్యం కోసం కేరళలోని కోవలానికి తాను తన భార్యతో కలసి వచ్చానని పేర్కొన్నాడు. మార్చి 14న తన భార్య తిరువనంతపురంకి 40కి.మి దూరంలో ఉన్న బీచ్‌కి వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఆండ్రూ.
తన భార్య లీగా(33) ఎవరికైనా, ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వగలరని చేతిలో తన భార్య ఫొటోను పట్టుకుని కోవలం మొత్తం వెతకటం మొదలుపెట్టాడు. తన భార్య చాలా తెలివైనదని, ఎక్కడైన తప్పిపోయినా తిరిగి వచ్చేయగలదన్నారు. తన భార్యను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పాడు.
ఇప్పటికే విదేశాంగ శాఖకు కూడా ఈ మేరకు సమాచారం అందించామని తెలిపాడు. తన భార్య ఆచూకి తెలిపిన వారికి లక్ష రివార్డు కూడా ఇస్తామని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment