Kovalam
-
వ్యాక్సిన్ వేసుకుంటే.. బిర్యానీ, బైకు, బంగారం.. ఎక్కడో తెలుసా?
చెన్నై: కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ కీలకమని ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. మరో పక్క టీకా వేసుకుంటే ఏమౌతుందో అన్న అపోహ ఇంకా పలు చోట్ల ఉండడంతో వ్యాక్సినేషన్‌కు ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో తమిళనాడులో ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్ వేయుంచుకున్న వారికి లక్కీ డ్రా రూపంలో విలువైన వస్తువులను అందిస్తోంది. ఈ లక్కీ డ్రాలో బిర్యానీ, మిక్సీ గ్రైండర్, 2 గ్రాముల బంగారం, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, స్కూటర్‌ను బహుమతులుగా ఇస్తామని చెప్పడంతో ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే..బైకు, బంగారం మీకే కోవలం ప్రాంతంలో సుమారు 7000 జనాభా ఉండగా, గత రెండు నెలల్లో కేవలం 58 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేసుకునే వారి సంఖ్య తగ్గుతుందనే ఆందోళనతో ఆ ప్రాంతానికి చెందిన ఎస్ఎన్ రామ్‌దాస్ ఫౌండేషన్, ఎస్టిఎస్ ఫౌండేషన్, చిరాజ్ ట్రస్ట్‌కు చెందిన వలంటీర్లు చేతులు కలిపి ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకున్నావారికి ఉచిత బిర్యానీ భోజనం అందించడం ప్రారంభించారు. అనంతరం దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, ముగ్గురు వ్యక్తులకు మిక్సీ, గ్రైండర్ , 2-గ్రాముల బంగారు నాణెలను లక్కీ డ్రా ద్వారా ఇవ్వడం ప్రారంభించారు. రాను రాను అందులో విజేతలకు బహుమతిగా రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, స్కూటర్‌ను కూడా జత చేర్చారు. ఈ నేపథ్యంలో కొత్తగా టీకా వేయించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలా ఈ లక్కీ డ్రా వల్ల కేవలం మూడు రోజుల్లో 345 మందికి టీకాలు వేసుకున్నారు. చదవండి: మంత్రి ప్రకటనపై ప్రజలు హర్షం, ఆ వెంటనే యూటర్న్.. -
‘నాభార్య మిస్సైంది’
తిరువనంతపురం : ఐరిష్ నుంచి వైద్యం కోసం కేరళ వచ్చిన తన భార్య మిసైందని కోవలం పోలీస్ స్టేషన్లో ఆండ్రూ జోర్డాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గత నెల 21న ఆయుర్వేదిక్ వైద్యం కోసం కేరళలోని కోవలానికి తాను తన భార్యతో కలసి వచ్చానని పేర్కొన్నాడు. మార్చి 14న తన భార్య తిరువనంతపురంకి 40కి.మి దూరంలో ఉన్న బీచ్‌కి వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఆండ్రూ. తన భార్య లీగా(33) ఎవరికైనా, ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వగలరని చేతిలో తన భార్య ఫొటోను పట్టుకుని కోవలం మొత్తం వెతకటం మొదలుపెట్టాడు. తన భార్య చాలా తెలివైనదని, ఎక్కడైన తప్పిపోయినా తిరిగి వచ్చేయగలదన్నారు. తన భార్యను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే విదేశాంగ శాఖకు కూడా ఈ మేరకు సమాచారం అందించామని తెలిపాడు. తన భార్య ఆచూకి తెలిపిన వారికి లక్ష రివార్డు కూడా ఇస్తామని పేర్కొన్నాడు. -
కేరళలో దారుణం: విదేశీ మహిళపై..
తిరువనంతపురం: విహారయాత్ర కోసం కేరళకు వచ్చిన విదేశీ వనితపై ఓ యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తీవ్రరక్తస్త్రావం కావడంతో స్పృహతప్పి పడిపోయిన ఆమెను కొందరు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. కేరళ రాజధాని తిరువనంతపురం శివారు కోవళంలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జపాన్ కు చెందిన 35 ఏళ్ల మహిళ శుక్రవారం ఉదయం కేరళకు వచ్చి, కోవళంలోని ఓ హోటల్ గదిలో దిగింది. అదే రోజు రాత్రి ఆమె అత్యాచారానికి గురైంది. రక్తస్త్రావం కావడంతో స్పృహతప్పి అచేతనంగా పడిఉన్న ఆమెను హోటల్ సిబ్బంది గుర్తించి, స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చివరికి కోవళం ప్రాంతంలోనే తేజ(25) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తేజ కుటుంబం కోవళంలో హ్యాండీక్రాఫ్ట్స్(హస్తకళల) దుకాణాన్ని నడుపుకొంటున్నదని, వీరు కర్ణాటక నుంచి కేరళకు వలస వచ్చారని పోలీసులు చెప్పారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376ను అనుసరించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.