wife missing
-
భర్త స్నేహితునితో నవ వివాహిత జంప్
కర్ణాటక: రెండు నెలల క్రితం వివాహమైన యువతి భర్త స్నేహితునితో పరారైన ఘటన బెంగళూరులో జరిగింది. రాజరాజేశ్వరినగరకు చెందిన రమేశ్‌కు రెండు నెలల క్రితం ఓ యువతితో పెళ్లయింది. కొత్త సంసారం సాఫీగా సాగుతోంది. అయితే ఈ నెల 12న ఉదయం రమేశ్ స్నానం చేయడానికి వెళ్లాడు. ఇంతలో నవ వధువు బట్టలు, డబ్బులు సర్దుకుని బాత్ రూం, ఇంటికి తాళం వేసుకొని స్నేహితునితో కలిసి వెళ్లిపోయింది. అతి కష్టం మీద బయటకు వచ్చిన రమేశ్ జరిగిన విషయాన్ని ఆర్‌ఆర్‌నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన స్నేహితుడు కార్తీక్‌తో వెళ్లిపోయిందని తెలిపాడు. పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. -
నా భార్య శ్రావణి తరచూ వేరే వ్యక్తితో... వివాహిత అదృశ్యం
హైదరాబాద్: తన భార్య కనిపంచడం లేదని వ్యక్తి ఫిర్యాదు చేసిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... ఖైరతాబాద్ మారుతీనగర్‌లో నివాసముండే గూడూరు గణేష్ ప్రైవేటు ఉద్యోగి. 2020లో ఖమ్మం జిల్లాకు చెందిన గూడూరు శ్రావణి (22)తో వివాహం జరిగింది. వీరికి 2021లో పాప పుట్టింది. ఆ తరువాత పుట్టింటికి వెళ్లిన తన భార్య 5 నెలల తరువాత తిరిగి వచి్చంది. ఆ తరువాత తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. విషయం ఆరా తీయగా పుట్టింటి దగ్గర ఓ వ్యక్తితో మాట్లాడుతున్న విషయం తెలుసుకొని బంధువుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చామని భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తరువాత బాగానే ఉందని, ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు డ్యూటీకి వెళ్లి రాత్రి 9.30 గంటలకు ఇంటికి వచ్చి చూసే సరికి భార్య, పాప కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల వెతికినా ఫిలితం లేకపోవడంతో, అత్తమామలకు ఫోన్ చేసి విచారించినా అక్కడికి రాలేదని తెలియడంతో ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక లోడ్‌కెళ్లొచ్చే లోపు.. భార్య రష్మి సహా రూ.2 లక్షల నగదు అదృశ్యం
హైదరాబాద్: భార్య కనిపించడం లేదని భర్త ఫిర్యాదు చేసిన సంఘటన శనివారం భానూర్–బీడీఎల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి కథనం ప్రకారం మెదక్‌కు చెందిన రాజేశ్వర్ పటాన్చెరు మండలం పాశమైలారం ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు. గత నెల 23న ఒడిశా రాష్ట్రానికి చెందిన రష్మితో వివాహమైంది. శనివారం రాజేశ్వర్ ఇసుక లోడ్ ఖాళీ చేయించడానికి వెళ్లి తిరిగి ఉదయం 9.30 గంటలకు తన ఇంటికి రాగా, భార్య రష్మి అదృశ్యమైంది. ఫోన్ స్వీచ్ ఆఫ్ రావడంతోపాటు ఇంట్లోని రూ.2 లక్షల నగదు కనిపించడం లేదని రాజేశ్వర్ పేర్కొన్నాడు. ఆమె ఆచూకీ కోసం తెలిసిన, బంధువులను విచారించినా ఫలితం లేకపోయింది. దీంతో రాజేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే.. మా శవాల లొకేషన్ షేర్ చేస్తా'
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరులో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు దొరిశెట్టి సత్యమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పోలీసులు వైఫల్యంతో తన భార్య ఆచూకీ లభించడం లేదని ఆరోపిస్తున్నారు. తన భార్య అన్నపూర్ణ అదృశ్యమై మూడు నెలలు గడుస్తున్నా ఇంకా ఆచూకీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మనోవేదనకు గురై తన పిల్లలతో సహా అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లుగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ కనిపెట్టకపోతే తమ శవాల లొకేషన్ షేర్ చేస్తానని సెల్ఫీ వీడియోలో హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: (రాకేశ్ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ) -
సెల్‌ఫోన్ చిచ్చు.. భార్య అదృశ్యం
హొసూరు: సెల్ఫోన్లో మాట్లాడద్దని భర్త మందలించడంతో భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఈ సంఘటన బాగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. వివరాల మేరకు.. బెంగళూరు హొసరోడ్డు ప్రాంతానికి చెందిన ప్రేమ్‌రాజ్ భార్య శిల్ప (23). వీరు హొసూరు సమీపంలోని బాగలూరులో నివాసముంటున్నారు. నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. శిల్ప వేరొకరితో సెల్ఫోన్లో మాట్లాడుతూ ఉందని భర్త గొడవపడేవాడు. ఇదే విషయమై ప్రేమ్‌రాజ్ ఇటీవల నిలదీశాడు. దీంతో భార్యభర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. శిల్ప ఏప్రిల్ 26వ తేదీ బంధువుల ఇంటికెళ్లి వస్తానని వెళ్లింది కానీ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో ప్రేమ్‌రాజ్ బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
‘నాభార్య మిస్సైంది’
తిరువనంతపురం : ఐరిష్ నుంచి వైద్యం కోసం కేరళ వచ్చిన తన భార్య మిసైందని కోవలం పోలీస్ స్టేషన్లో ఆండ్రూ జోర్డాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గత నెల 21న ఆయుర్వేదిక్ వైద్యం కోసం కేరళలోని కోవలానికి తాను తన భార్యతో కలసి వచ్చానని పేర్కొన్నాడు. మార్చి 14న తన భార్య తిరువనంతపురంకి 40కి.మి దూరంలో ఉన్న బీచ్‌కి వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఆండ్రూ. తన భార్య లీగా(33) ఎవరికైనా, ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వగలరని చేతిలో తన భార్య ఫొటోను పట్టుకుని కోవలం మొత్తం వెతకటం మొదలుపెట్టాడు. తన భార్య చాలా తెలివైనదని, ఎక్కడైన తప్పిపోయినా తిరిగి వచ్చేయగలదన్నారు. తన భార్యను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే విదేశాంగ శాఖకు కూడా ఈ మేరకు సమాచారం అందించామని తెలిపాడు. తన భార్య ఆచూకి తెలిపిన వారికి లక్ష రివార్డు కూడా ఇస్తామని పేర్కొన్నాడు. -
భార్య కోసం 65 గ్రామాల్లో..
సాక్షి, రాంచీ : మతిస్థిమితం లేని భార్య తప్పిపోవడంతో ఆ భర్త తల్లడిల్లాడు. ఆమె కోసం సైకిల్‌పై ఏకంగా 65 గ్రామాలను చుట్టేశాడు. జార్ఖండ్‌కు చెందిన వ్యవసాయ కూలీ మనోహర్ 16 ఏళ్ల కిందట అనితను వివాహం చేసుకున్నాడు. వీరికి 14 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. జనవరి 11న అనిత తన కుమారుడితో కలిసి పశ్చిమ మెదినిపూర్ జిల్లాలోని కుమ్రాసోల్ గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. ప్రయాణంలో దారితప్పడంతో అప్పటినుంచి ఆమె జాడ తెలియరాలేదు. ఆ సమయంలో ఒడిషాలో పనిచేస్తున్న మనోహర్ తన ఉద్యోగాన్ని వదిలి భార్యను వెతుకుతున్నాడు. కుమ్రసోల్ గ్రామానికి సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాడు. పోలీసు చర్యల కోసం ఎదురుచూడకుండా మనోహర్ తనే సొంతంగా భార్యను గాలించేందుకు తన పాత సైకిల్‌పై ప్రయాణం చేపట్టాడు. అనిత ఫోటోతో పాటు ఆమె తప్పిపోయిన వార్త ప్రచురితమైన వార్తాపత్రికలను తన వెంట తీసుకెళ్లాడు. అయితే వార్తాపత్రికల్లో ఆమె ఫోటోను చూసిన కొందరు అనితను గుర్తుపట్టి ఖరగ్‌పూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దీంతో వారు ముసబని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించడంతో ఆమె ఆచూకీని మనోహర్‌కు తెలియచేశారు. ఆ సమయంలో భార్య కోసం తూర్పు సింగ్భుమ్లో గాలిస్తున్న మనోహర్ సైకిల్‌పైనే నేరుగా ఖరగ్‌పూర్ పీఎస్‌కు వెళ్లి అనితను కలిశారు. తన భర్త సైకిల్‌పై జాతీయ రహదారిలో 120 కిమీ ప్రయాణించి కోల్‌కతా చేరుకోవడం పట్ల అనితతో పాటు పోలీసులూ ఆశ్చర్యపోయారు. -
నటుడి భార్య అదృశ్యం
చెన్నై: సినీ నటుడు కరా టే రాజా భార్య బుధవారం అదృశ్యమైంది. నటుడు కరాటే రాజా పోలీసులను ఆశ్రయించారు. కడలూరు జిల్లా సమీపంలోని మానలూరుకు చెందిన రాజా. ఈయన కరాటే రాజాగా చిత్ర పరిశ్రమలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కరాటే రాజా పుదువై సారం పూంగోళం కామరాజర్‌నగర్‌కు చెందిన మురుగన్ కూతురు దివ్యను 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు. సారం గ్రామం సమీపంలో అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. కరాటే రాజా ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉంటూ నెలలో రెండు, మూడుసార్లు మాత్రం ఇంటికి వస్తుంటారు. ఈ విషయమై ఇటీవల భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో కరాటే రాజా భార్య దివ్య బుధవారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో తన ముగ్గురు కూతుళ్లను ఆమె తల్లి ఇంటికి తీసుకెళ్లి మార్కెట్‌కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన రామన్ కుటుంబ సభ్యులు ఆ ప్రాంతం అంతా గాలించారు. అయినా ఆమె జాడ తెలియలేదు. సమాచారం అందుకున్న నటుడు కరాటే రాజా గురువారం ఉదయం పుదువై కోరిమేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.