Husband Complaint on Wife Missing - Sakshi
Sakshi News home page

నా భార్య శ్రావణి తరచూ వేరే వ్యక్తితో... వివాహిత అదృశ్యం

Published Tue, Aug 15 2023 7:55 AM | Last Updated on Sat, Aug 19 2023 3:30 PM

Husband Complaint on wife missing - Sakshi

హైదరాబాద్: తన భార్య కనిపంచడం లేదని వ్యక్తి ఫిర్యాదు చేసిన సంఘటన ఖైరతాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... ఖైరతాబాద్‌ మారుతీనగర్‌లో నివాసముండే గూడూరు గణేష్‌ ప్రైవేటు ఉద్యోగి. 2020లో ఖమ్మం జిల్లాకు చెందిన గూడూరు శ్రావణి (22)తో వివాహం జరిగింది. వీరికి 2021లో పాప పుట్టింది. ఆ తరువాత పుట్టింటికి వెళ్లిన తన భార్య 5 నెలల తరువాత తిరిగి వచి్చంది. 

ఆ తరువాత తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. విషయం ఆరా తీయగా పుట్టింటి దగ్గర ఓ వ్యక్తితో మాట్లాడుతున్న విషయం తెలుసుకొని బంధువుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇచ్చామని భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తరువాత బాగానే ఉందని, ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు డ్యూటీకి వెళ్లి రాత్రి 9.30 గంటలకు ఇంటికి వచ్చి చూసే సరికి భార్య, పాప కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల వెతికినా ఫిలితం లేకపోవడంతో, అత్తమామలకు ఫోన్‌ చేసి విచారించినా అక్కడికి రాలేదని తెలియడంతో ఖైరతాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త ఫిర్యాదుతో  పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement