తన చెల్లిపై లైంగిక దాడి చేశాడని భర్తపై ఫిర్యాదు
Published Mon, Oct 3 2016 8:07 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM
గుంటూరు ఈస్ట్ : మంగళగిరి మండలం ఎర్రబాలెంకు చెందిన ఓ మహిళ తన భర్త కీచకపర్వాన్ని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్టత్రిపాఠికి ఫిర్యాదుచేసింది. తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. తన భర్త రవికృష్ణ బీటెక్ చదువుతున్న తన చెల్లికి ఉద్యోగం ఎర చూపించి మంగళగిరిలోని ఓ గదిలో 15 రోజులు బంధించి లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. ఈ విషయమై తాను మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో చెల్లెలి విద్యార్హత సర్టిఫికెట్లన్నీ కనపడకుండా చేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించి, తన చెల్లెలు విద్యార్హత సర్టిఫికెట్లు ఇప్పించాలని, అతనిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తిచేసింది.
Advertisement
Advertisement