
బెంగళూరు: సంవత్సరం నుంచి భర్త తనతో శృంగారం చేయడంలేదని ఓ భార్య పోలీసులను ఆశ్రయించింది. చిన్న విషయాలకు కోపగించుకుంటున్నాడని, విడాకులపై కూడా సంతకం చేయడంలేదని కేసు నమోదు చేసింది.
కర్ణాటకాలోని మాండ్యా జిల్లాకు చెందిన యువతి(21)తో హస్సాన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి పెద్దల సమక్షంలో గత ఏడాది వివాహం జరిగింది. భర్త బెంగళూరులోని ఓ సెక్యూరిటీ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుంటారు. ఆమె గృహిణిగా ఉంటోంది. అయితే..పెళ్లి చేసుకుని అన్యోన్యంగా బతకాలనే తన కలను భర్త నెరవేర్చడం లేదని బాధితురాలు పోలీసులకు తెలిపింది. చాలా ప్రేమగా మాట్లాడినా.. చిరాకు పడుతున్నాడని పేర్కొంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడంలేదని, శృంగార జీవితం పేలవంగా ఉందని ఫిర్యాదులో పేర్కొంది.
హాయ్.. హోటల్‌లో కలుద్దాం.. డేటింగ్ యాప్‌లో యువకులే ఆమె టార్గెట్..
Comments
Please login to add a commentAdd a comment