ఈయనతో వేగలేను ! | wife complaints against Husband in Police Station over Porn addiction | Sakshi
Sakshi News home page

భర్త వికృత చేష్టలు, భార్య ఫిర్యాదు!

Published Tue, Aug 1 2017 9:46 AM | Last Updated on Tue, Sep 18 2018 7:50 PM

ఈయనతో వేగలేను ! - Sakshi

ఈయనతో వేగలేను !

►భర్త వికృత చేష్టలతో విసిగి పోలీసులకు ఫిర్యాదు
►బెంగళూరులో ఘటన

బెంగళూరు: తనకు అశ్లీల వీడియో చూపించి అసహజ సెక్స్‌లో పాల్గొనాలని వేధిస్తున్నారని ఆరోపిస్తూ భర్తపై, భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నగరంలోని బసవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో సోమవారం చోటుచేసుకుంది. చామరాజపేటేలో నివాసముంటున్న దంపతులకు గత ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది.

వివాహమైన మొదటిరాత్రి తన భర్త తనపై వికృతంగా ప్రవర్తించారని అంతేగాక కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తనకు తాగించి అసహజ లైంగిక ప్రక్రియ జరిపాడని ఆరోపించింది. కొద్దిరోజుల అనంతరం ల్యాప్‌టాప్, మొబైల్‌లో అశ్లీల సినిమా చూపించి వికృతంగా ప్రవర్తించే వాడని, తాను సమ్మతించకపోవడంతో మొదటి రాత్రి చిత్రీకరించిన వీడియో దృశ్యాలను సామాజిక మాద్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరింపులు దిగారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

తన భర్తకు లైంగిక సామర్థ్యం లేదని, అందుకే తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. తనను ఇంటిని నుంచి గెంటి వేశారని, పెళ్లి సమయంలో బంగారు నగలు, వరకట్నం కింద రూ. 7 లక్షలు తీసుకున్నారని ఆరోపించింది. బసవనగుడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement