హొసూరు: సెల్‌ఫోన్‌లో మాట్లాడద్దని భర్త మందలించడంతో భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఈ సంఘటన బాగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. వివరాల మేరకు.. బెంగళూరు హొసరోడ్డు ప్రాంతానికి చెందిన ప్రేమ్‌రాజ్ భార్య శిల్ప (23). వీరు హొసూరు సమీపంలోని బాగలూరులో నివాసముంటున్నారు. నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. శిల్ప వేరొకరితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఉందని భర్త గొడవపడేవాడు. ఇదే విషయమై ప్రేమ్‌రాజ్ ఇటీవల నిలదీశాడు. దీంతో భార్యభర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. శిల్ప ఏప్రిల్ 26వ తేదీ బంధువుల ఇంటికెళ్లి వస్తానని వెళ్లింది కానీ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో ప్రేమ్‌రాజ్ బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment